నల్లగా మారిన మీ చర్మరంగును తెల్లగా మార్చే సింపుల్ హోం రెమెడీస్..!!

Posted By:
Subscribe to Boldsky

హైపర్ పిగ్మెంటేషన్ ఇది ఒక చర్మ సమస్య. చర్మానికి ఏ మాత్రం ఎండ తగిలినా వెంటనే చర్మం నల్లగా కమిలినట్లు కనబడుతుంది. ఇలా వాతావరణంలోని మార్పులు వల్ల చర్మం రంగులో మార్పులు వస్తే దాన్ని హైబపర్ పిగ్మెంటేషన్ అంటారు. అయితే ఇలా సహజ చర్మం రంగు కోల్పోయి చర్మం నల్లగా మారడాన్ని ఏ ఒక్కరూ ఇష్టపడరు. ప్రతి మహిళ అందంగా కనబడాలనే కోరుకుంటుంది. అలాంటి వారిలో మీరు ఒకరైతే క్లియర్ స్కిన్ పొందాలని కోరుకుంటే కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి, ఈ హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల ఎలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు .

స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారించే ఉత్తమ హోం రెమెడీస్

ఈ హోం రెమెడీస్ అన్ని రకాల చర్మ తత్వాలకు నప్పుతాయి,. . సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి కూడా ఈ హోం రెమెడీస్ ఎక్కువగా సహాయపడుతాయి. ఈ సింపుల్ రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . అనేక చర్మ సమస్యలను నివారిస్తాయి. రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ సమస్య ఉండదు. వీటిని ఉపయోగించడం చాలా సౌకర్యవతం. ఎందుకంటే ఈ హోం రెమెడీస్ మన కిచెన్ లో అతి చౌకగా అందుబాటులో ఉంటాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం సిన్ పిగ్మెంటేషన్ నివారించుకోవడానికి కొన్ని సింపుల్ అండ్ ట్రస్టెండ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం...

పాలు :

పాలు :

పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది, చర్మానికి ఎలాంటి హాని కలిగించకుండా చర్మంను లైట్ గా మార్చుతుంది. చర్మ నల్లగా ఉన్న ప్రదేశంలో పాలను అప్లై చేయాలి. 10-15 నిముషాల తర్వాత కాటన్ తో తుడిచేసుకోవాలి. మంచి ఫలితం కనబడే వరకూ దీన్ని ప్రతి రోజూ చేయాల్సి ఉంటుంది.

నిమ్మరసం :

నిమ్మరసం :

నిమ్మరసం బెస్ట్ బ్లీచింగ్ ఏజెంట్ ఇది స్కిన్ లైట్ గా మార్చుతుంది. స్కిన్ టోన్ ను బ్రైట్ గా మార్చుతుంది. నిమ్మరసంను ముఖానికి అప్లై చేసి 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అంతే కాదు ఇది చర్మాన్ని లైట్ గా మరియు బ్రైట్ గా మార్చుతుంది. నిమ్మరసంను ముఖానికి అప్లై చేసి 15-20 తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలోవెర జెల్:

అలోవెర జెల్:

హైపర్ పిగ్మెంటేషన్ కు ముఖ్య కారణం చర్మం ఎక్కువగా డ్రైగా మారడం. డ్రై స్కిన్ నివారించడానికి అలోవెర జెల్ అద్భుతంగా సహాయపడుతుంది. దీన్ని ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు అప్లై చేయాలి. ఇలా రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

శెనగపిండి:

శెనగపిండి:

చర్మానికి శెనగపిండిని ఉపయోగించడం వల్ల ఇది ఒక ఏజ్ ఓల్డ్ రెమెడీ. పాలతో శెనగపిండి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత సున్నితంగా చర్మాన్ని మర్ధన చేయాలి. సర్క్యులర్ మోషన్ లో మర్ధన చేసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గడంతో పాటు, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీలో ఉండే యాసిడ్స్ స్కిన్ లైటనింగ్ ను మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. స్ట్రాబెర్రీస్ ను మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లనీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. దాంతో స్కిన్ పిగ్మెంటేషన్ ఎఫెక్టివ్ గా నివారించబడుతుంది.

బొప్పాయి :

బొప్పాయి :

బొప్పాయిలో ఎంజైమ్స్ అధికంగా ఉన్నాయి. హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. బొప్పాయిని మెత్తగా మ్యాష్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ తో స్కిన్ పిగ్మెంటేషన్ తొలగించుకోవడం మాత్రమే కాదు, ఫేషియల్ హెయిర్ కూడా తొలగిపోతుంది.

English summary

Simple & Most Trusted Home Remedies For Hyperpigmentation

A clear, flawless face is something that most women wish for, but very few eventually achieve it. Wouldn't we all love to have an even, clear skin? These simple home remedies for hyperpigmentation will make sure that your skin is at its best under any circumstance.
Story first published: Wednesday, February 15, 2017, 11:15 [IST]