వేసవిలో ఎండకు కమిలి, నల్లగా మారిన చర్మాన్ని..తెల్లగా మార్చే సింపుల్ టిప్స్

Posted By:
Subscribe to Boldsky

స్కిన్ పిగ్మెంటేషన్ అంటే చర్మం రంగు మారడం. కొందరికి ఎండలో తిరిగితే వెంటనే చర్మం నల్లబడటం జరుగుతుంటుంది. అంతే కాదు, వాతావరణంలో మార్పుల వల్ల, కాలుష్యం వల్ల కూడా స్కిన్ పిగ్మెంటేషన్ కు కారణం అవుతుంది. చర్మం రంగు అంటే స్వతహాగా చర్మం రంగు మారి దీని వలన అసమానమైన చర్మపు రంగుకు దారి తీయడం. ఈ చర్మపు రంగు మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. చర్మపు రంగు జన్యు పరంగా సిద్ధించి ఉండవచ్చు. ఎండలో ఎక్కువగా తిరగడం, ఒత్తిడి, మొటిమల మచ్చలు, హార్మోనుల స్థాయిలోని హెచ్చుతగ్గులు లేదా కాలుష్యం వంటి వాతావరణ మూలకాలు, దీనికి ఇతర కారణాలై ఉండవచ్చు.

చాలామందిని వేధించే చర్మ సమస్యల్లో.. పిగ్మెంటేషన్‌ ఒకటి. చర్మం రంగు ముదురు చాయలోకి మారినా.. లేదా మెరుపు పూర్తిగా తగ్గి మచ్చలు పడినా తేలిగ్గా తీసుకోకూడదు. దాన్ని పిగ్మెంటేషన్‌గా పరిగణించాలి. ఈ సమస్య ప్రధానంగా మూడు రకాలుగా వేధిస్తుంది.* చర్మం ముదురు రంగులోకి మారడాన్ని హైపర్‌ పిగ్మెంటేషన్‌ అంటారు. * అక్కడక్కడా తెల్ల మచ్చలు పడితే.. హైపో పిగ్మెంటేషన్‌గా పరిగణిస్తారు. * పూర్తిగా రంగు తగ్గిపోతే.. అది డీ పిగ్మెంటేషన్‌గా గుర్తించాలి.

Simple Yet Effective Ways To Treat Pigmentation

ప్రపంచం మొత్తంలో స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను చాలా మంది స్త్రీ , పురుషలు ఎదుర్కొంటున్న బ్యూటీ సమస్య. స్కిన్ పిగ్మెంటేషన్ నివారించుకోవడానికి అనేక మెడికేషన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈరోజు. స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను నివారించుకోవడానికి అనేక రకాల ఖరీదైన స్కిన్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ మరియు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యను నివారించుకోవాలంటే నేచురల్ హోం రెమడీస్ అద్భుతంగా సహాయపడుతాయి.

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి అధికంగా ఉంది, ఇది డార్క్ స్కిన్ ను లైట్ గా మార్చుతుంది. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. నిమ్మలో నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ . ఇందులో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్ ప్రొపర్టీస్ ఉన్నాయి .నిమ్మరసానికి కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అప్లై చేసిన 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రతి రోజూ రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది,.

బంగాళదుంప:

బంగాళదుంప:

బంగాళదుంపలో నేచురల్ బ్లీచింగ్ లక్షనాలు కలిగి ఉన్నాయి. ఇది చర్మ మీద ఎటువంటి ప్యాచెస్ లేకుండా చేస్తుంది. బంగాళదుంపను స్లైస్ గా చేసి చర్మం నల్లగా మరియు పిగ్నెంటేషన్ తో ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల పిగ్మేంటేషన్ నేచురల్ గా నివారించబడుతుంది. అలాగే పొటాటో జ్యూస్ లో నిమ్మరసం మిక్స్ చేసి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

పసుపు:

పసుపు:

ప్రెగ్నెన్సీ పిగ్మెంటేషన్ ను నివారించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. పసుపు, నిమ్మరసం శెనగపిండి, మిల్క్ క్రీమ్ మెత్తగా పేస్ట్ లా చేసి, ముఖానికి పట్టించాలి. మరింత ఉత్తమ ఫలితాల కోసం రోజ్ వాటర్ ను మిక్స్ చేయవచ్చు. చర్మాన్ని బ్రైట్ గా మార్చుకోవడం కోసం పసుపును వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. పసుపు ఫేస్ ప్యాక్ లో యాంటీబ్యాక్టీరియల్ పిగ్మేంటేషన్ నివారించే లక్షణాలు అధికంగా ఉన్నాయి . పసుపులో కొద్దిగా పాలు మరియు నిమ్మరసం మిక్స్ చేయాలి. ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.

బొప్పాయి:

బొప్పాయి:

పచ్చి బొప్పాయిను పచ్చి పాలతో కలిపి పది నిమిషాల పాటు ముఖంపై మర్దన చేయండి. ఈ లేపనం .మీ చర్మం పైన మచ్చలకు ప్రభావవంతమైన చికిత్స. ఎందుకంటే ఇందులో పెపైన్ అనే ఎంజైమ్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది . దాంతో స్కిన్ పిగ్మెంటేషన్ నివారించబడుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్:

యాపిల్ సైడర్ వెనిగర్:

పిగ్నెంటేషన్ ను నేచురల్ గా తగ్గించే మరో ఉత్తమ హోం రెమెడీ . కొద్దిగా వెనిగర్ ను నీటిలో వేసి బాగా గిలకొట్టి ముఖానికి అప్లై చేయాలి. వెనిగర్ లో కెమికల్ ఎసిటిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఇది పిగ్మెంటేషన్ కు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

అలోవెర:

అలోవెర:

అలోవెర జెల్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల పిగ్మేంటేషన్ సమస్య ఉండదు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ముకానికి అప్లై చేసి మరుసటి రోజు శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది మోస్ట్ ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీ..అలోవెర జెల్ ను అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

మరో ఉపయోగకరమైన హోం రెమెడీస్. ఉల్లిపాయ రసంలో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. అంతే ఇది స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది . లేదా ఉల్లిపాయ ముక్కను వెనిగర్ లో డిప్ చేసి ఎపెక్టెడ్ ఏరియాలో మర్దన చేయాలి. ఉల్లిరసంలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి నేరుగా చర్మానికి అప్లై చేయడం వల్ల స్కిన్ టోన్ క్లియర్ అవుతుంది.

బాదం

బాదం

బాదంలో ఉండే విటమిన్ ఇ కంటెంట్ డార్క్ స్పాట్స్ ను నివారించడంలో ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. బాదంను నీటిలో నానబెట్టి తర్వాత రెండు గంటల తర్వాత బయటకు తీసి, మెత్తగా పేస్ట్ చేసి, అందులో పాలు లేదా పాలక్రీమ్ వేసి మిక్స్ చేసి చర్మానికి పట్టించాలి. స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది.

English summary

Simple Yet Effective Ways To Treat Pigmentation

స్కిన్ పిగ్మేంటేషన్ నివారించే ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, Simple Yet Effective Ways To Treat Pigmentation, skin pigmentation in telugu, beauty tips in telugu, beauty article in telugu, ayurveda beauty tips in telugu, తెలుగులో బ్యూటి టిప్స్, తెలుగులో బ్యూటి ఆర్టికల్స్, తెలుగులో ఆయుర్వేద బ్యూటీ టిప్స్