For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో అమ్మలు అందంగా కనబడుట కోసం ఫాలో అవ్వాల్సిన స్కిన్ కేర్ టిప్స్

By Mallikarjuna
|

ఇంట్లో ఉండే అమ్మలు ఏం చేయాలి.? లైఫ్ ను అందంగా మార్చుకోవాలి. మీ పిల్లలు పెరిగి పెద్దవారై ఒక బాధ్యత కలిగిన పౌరులుగా మీరు చూడాలని కోరుకుంటారు. అంత సమయంలో మీకు నచ్చినపనులు చేయడానికి, మీకు ఇష్టమైన పనులుచేయడానికి మీకు తగిన సమయం ఉంది. అలాగే ఇంట్లో ఉండే తల్లులకు ఎలాంటి పనిఒత్తిళ్ళు, పనిభారం, డెడ్ లైన్స్ ఉండవు.(పనిచేసే మహిళలను చూస్తే వారు ఎంత టెన్షన్స్ తోఉంటారో కనబడుతుంది). అయితే ఇంట్లో ఉండే మహిళలు, తల్లులు వారి చర్మ సంరక్షణ గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కొంత మంది తల్లులను గమనించినట్లైటే వారి చర్మం అందంగా కాంతివంతంగా ఉంటుంది. అలాంటి వారు ఎలాంటి చర్మ సమస్యలతో బాధపడరు, వారిలో ఎలాంటి ఏజింగ్ లక్షణాలు కనబడవు . ఎందుకంటే వారు ఎక్కువగా ఎండలో తిరగరు, ఎక్కువ సమయం బయట గడపరు కాబట్టి.లేదు వారు పిల్లలను స్కూల్లో దింపడం, తిరిగి తీసుకురావడం, సరుకులు పట్టుకు రావడానికి మార్కెట్, షాపింగ్ వంటివి కూడా ఉంటాయి. అయితే ఇంట్లో ఉండే మహిళల్లో ఒత్తిడి కొంచెం తక్కువగా ఉంటుంది.

<strong>మిమ్మల్నిమరింత అందంగా మార్చేనేచురల్ బ్యూటీ టిప్స్</strong>మిమ్మల్నిమరింత అందంగా మార్చేనేచురల్ బ్యూటీ టిప్స్

ఇంటిపనులు చక్కబెట్టడం, పిల్లలకు సమయానికి అన్ని సమకూర్చడం, ఫుడ్, బాతింగ్, స్కూల్ కు పంచడం, హోం వర్క్ చేయించడం, చివరగా రాత్రి డిన్నర్ కుటుంబం కోసం మంచి భోజనం తయారుచేయడం వంటి పనులతో కూడా కాస్త ఒత్తిడి ఉంటుంది?అయినా కూడా వారి చర్మ రహస్యం ఏంటి?అందంగా కనడటానికి కారణం ఏంటి?

మహిళలు, అమ్మలు ఇంట్లో ఉన్నా, వారు ఎక్కువ సమయం వంటగదిలోనే గడుపుతారు.అందుకే వారి చర్మం అందంగా కనబడుటలో రహస్యం దాగుంది. వంటగదిలో ఉండే న్యాచురల్ పదార్థాలతోటి, వారి అందం మరింత మెరుగుపడుతుంది. న్యాచురల్ పదార్థాలతో వారిలోని ఎలాంటి చర్మ సమస్యలైనా నయం చేసుకోగలుగుతారు. వీరు ఎక్కువగా మార్కెట్లోని బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఆధారపడరు. వాటి కంటే న్యాచురల్ పదార్థాలే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని నమ్ముతారు. ఇంట్లోని కొన్ని న్యాచురల్ పదార్థాలతో స్కిన్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్లస్ సులభంగా అందుబాటులో ఉంటాయి.

Skin Care Tips Mums At Home Should Follow

1. డార్క్ స్పాట్స్ ట్రీట్మెంట్ :

మహిళల్లో చాలా వరకూ ఉండే సమస్య డార్క్ స్పాట్స్ , ఎండలో తిరగడం వల్ల మొటిమలు, మచ్చలు వయస్సైన లక్షణాలను తెలుపుతాయి. ఈ సమస్యకు లెమన్ మాస్క్ బాగా సహాయపడుతుంది. న్యాచురల్ గా తగ్గిస్తుంది

కావల్సినవి

1 టీస్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్

ఒక టీస్పూన్ తేనె

ఒక టేబుల్ స్పూన్ బాదం ఆయిల్

పద్దతి:

1. ఒక బౌల్లో పైన సూచించిన పదార్థాలన్నింటిని కలపాలి.

2. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, 15నిముషాలు అలాగే ఉంచాలి.

3. తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడు సార్లు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. డార్క్ స్పాట్స్ తొలగిపోతాయి.

Skin Care Tips Mums At Home Should Follow

2. బ్లాక్ హెడ్స్ ట్రీట్మెంట్ :

ఆయిల్ స్కిన్ ఉన్నవారికి బ్లాక్ హెడ్స్ ఇబ్బంది కలిగిస్తాయి. దీనికి ఈ క్రింది సూచించిన రెమెడీ బాగా పనిచేస్తుంది.

కావల్సినవి:

1 ఎగ్ వైట్,

1 టీస్పూన్ ఓట్స్ పౌడర్

పద్దతి: ఎగ్ వైట్ ను బాగా మిక్స్ చేయాలి.

తర్వాత అందులో ఓట్స్ పౌడర్ కలిపి రెండూ బాగా మిక్స్ చేయాలి.

3. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశం ముక్కు, గడ్డం మీద అప్లై చేయాలి.

4. 15 నిముషాల తర్వాత పొడి బట్టతో తుడవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే బ్లాక్ హెడ్స్ కనబడకుండా పోతాయి

Skin Care Tips Mums At Home Should Follow

3. వదులైన చర్మానికి ట్రీట్మెంట్ :

వయస్సయ్యే కొద్ది చర్మ సమస్యలు పెరుగుతాయి. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా చర్మంలో ముడతలు, చారలు పెరుగుతాయి. దీనికి బొప్పాయి స్కిన్ టైటనింగ్ మాస్క్ పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. అలాగే పెపైన్ అనే ఎంజైమ చర్మంను టైట్ గా మార్చుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చర్మ రంద్రాలను శుభ్రం చేసి, క్లోజ్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఈ ప్యాక్ వల్ల చర్మంలో మంచి గ్లో వస్తుంది.

కావల్సినవి:

1/4కప్పు బొప్పాయి ముక్కలు

2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి

1 టేబుల్ స్పూన్ పెరుగు

పద్దతి:

1. ఒక బౌల్లో బొప్పాయి ముక్కలను వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.

2. అందులో కొద్దిగా బియ్యం పిండి, పెరుగు వేసి, బాగా కలపాలి.

3. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.15 నిముసాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

5. ఇలా వారానికొకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Skin Care Tips Mums At Home Should Follow

4. హోం మేడ్ మల్టీపర్పస్ స్ర్కబ్ :

రెగ్యులర్ గా చర్మంను శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల డెడ్స్ స్కిన్ సెల్స్ తొలగిపోయి చర్మం స్మూత్ గా తయారవుతుంది. కొత్త కణాలను ప్రోత్సహిస్తుంది. ఈ హోం మేడ్ లెంటిల్ స్ర్కబ్ వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. చర్మంను శుభ్రం చేసి, చర్మంలోని మలినాలను, సన్నిని వెంట్రుకలను తొలగిస్తుంది. చర్మ కాంతి పెంచుతుంది. చర్మంలో గ్లోవస్తుంది.

కావల్సినవి:

1కప్పు కందిపప్పు

అరకప్పు కోకనట్ వాటర్

సగం ఆరెంజ్ తొక్క

పద్దతి: కోకనట్ వాటర్ లో కందిపప్పు వేసి రాత్రంతా నానబటెట్టాలి

2. తర్వాత ఎండలో ఎండబెట్టాలి. ఆరెంజ్ తొక్కతో సహా ఎండబెట్టాలి.

3. బాగా ఎండిన తర్వాత వీటిని మిక్సీలో వేసిమెత్తగా పొడి చేసుకోవాలి.

4. ఈ పొడిని రెగ్యులర్ గా ముఖానికి , బాడీకి ఉపయోగించాలి.

<strong>తల్లి నుంచి కూతుళ్లు వారసత్వంగా పొందే అంశాలు</strong>తల్లి నుంచి కూతుళ్లు వారసత్వంగా పొందే అంశాలు

5. గ్లోయింగ్ స్కిన్ ట్రీట్మెంట్:

రోజంతా పనిచేసి చర్మం అలసటగా, నిర్జీవంగా కనబడుతుందా? పని తర్వాత పార్టీకి వెళ్లాలా, వెంటనే చర్మంలో మంచి గ్లో రావాలా? చింతాల్సిన పనిలేదు, మీకో ఇన్ స్టాంట్ రిసిపిని పరిచయం చేస్తాం.కాఫీ రెమెడీ ఉపయోగిస్తే మీరు ఇప్పుడు సలూన్ నుండి ఫ్రెష్ గా వచ్చినట్లు కనబడుతారు.

కావల్సినవి:

3 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్

1 టేబుల్ స్పూన్ కోకనట్ వాటర్ లేదా కోకట్ ఆయిల్

పద్దతి:

ఒక బౌల్లో రెండు పదార్థాలను కలపాలి

ఈమిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.

15నిముషాల తర్వాత చన్నిటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Skin Care Tips Mums At Home Should Follow

Have you even noticed these Mums have the best and flawless skin? They never suffer from skin problems and they hardly show any signs of ageing. Do you think it is because they are not exposed to the elements outside? No, they have many tasks such as dropping the kids to school and picking them up, shopping for groceries etc. Then, is it because their lives are less stressful?
Story first published:Saturday, September 23, 2017, 15:24 [IST]
Desktop Bottom Promotion