For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళ చుట్టూ వయస్సైన ముడతల గుర్తులను నివారించుకోవడానికి 10 హోం రెమెడీస్

మీకు కళ్ళ చుట్టూ ముడతలు ఉన్నాయా? మీరు సౌందర్య దుకాణంలో దొరికే ప్రతి చిన్న ఐ క్రీములు, మాస్క్ లు ఇప్పటికే ప్రయత్నించారా? వాటి ఫలితాలతో మీరు అసంతృప్తి చెందారా?

By Lakshmi Bai Praharaju
|

మీకు కళ్ళ చుట్టూ ముడతలు ఉన్నాయా? మీరు సౌందర్య దుకాణంలో దొరికే ప్రతి చిన్న ఐ క్రీములు, మాస్క్ లు ఇప్పటికే ప్రయత్నించారా? వాటి ఫలితాలతో మీరు అసంతృప్తి చెందారా?

మీరు పై ప్రశ్నలన్నిటికీ సమాధానం అవును అని చెప్తే, ఇవ్వాల్టి పోస్ట్ మీకు సరిగా సరిపోతుంది. బోల్డ్ స్కై ప్రకారం, మీరు చాలా తేలికగా దొరికే, అద్భుతమైన సహజ పదార్ధాల సహాయంతో ఇంట్లోనే తేలికగా తయారుచేసుకునే కొన్ని వార్ధక్య నివారణా ఐ మాస్క్ ల గురించి తెలుసుకుందాం.

anti-ageing eye masks that can be prepared at home

ఈ మాస్క్ ను తయారుచేయడానికి ఉపయోగించి పదార్ధాలలో సౌందర్య ప్రయోజనాలకు చెందిన లక్షణాలు కలిగి ఉండడం వల్ల ఈ మాస్క్ ని చర్మ రక్షణా విధానంలో ఉపయోగిస్తారు, కాఫీ బీన్స్, ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె, కీరదోస మొదలైన పదార్ధాలలో ఆంటీ-ఆక్సిడెంట్లు మెండుగా ఉండడంవల్ల ముడతల వంటి వృద్ధాప్యం వల్ల వచ్చే చెడు సంకేతాలను ఆలస్యం చేస్తాయి.

ఈకింద ఇచ్చిన ఏ ఐ మాస్క్ అయినా మీ రోజువారీ సౌందర్య౦తోపాటు, మీ కళ్ళను మంచి యవ్వనంగా, ఎల్లప్పుడూ తాజాగా ఉంచుతాయి.

ఈ రెసిపీ పై దృష్టి పెట్టండి, ఇక్కడ:

1. తేనె తో కాఫీ బీన్స్

1. తేనె తో కాఫీ బీన్స్

- 1 టీస్పూన్ తేనెతో ½ టీస్పూన్ కాఫీ బీన్స్ కలపండి.

- ప్రభావిత ప్రదేశంపై ఈ మిశ్రమంతో మర్దనా చేయండి.

- తడిబట్టతో తుడిచే ముందు ఇలా మరో 10 నిమిషాల పాటు వదిలేయండి.

- గమనించదగ్గ ఫలితాల కోసం దీన్ని వారానికి 4-5 సార్లు వాడండి.

2. కొబ్బరినూనె తో పసుపు

2. కొబ్బరినూనె తో పసుపు

- ఒక చిటికెడు పసుపు తీసుకుని దానిని ½ టీస్పూన్ కొబ్బరినూనేతో కలపండి.

- ప్రభావిత ప్రాంతంపై ఈ మాస్క్ ని పూయండి, ఇలా 15 నిమిషాల పాటు ఉంచండి.

- శుభ్రమైన తడి గుడ్డతో ఆ మాస్క్ ని తుడిచేయండి.

- మీ కంటి చుట్టూ ఉన్న ముడతలు నివారించడానికి వారానికి రెండుసార్లు ఈ ఇంట్లో చేసిన మాస్క్ ని ప్రయత్నించండి.

3. ఫ్రాన్కిన్సేన్స్ ఎసెన్షియల్ ఆయిల్, సెనగపిండి తో విటమిన్ E ఆయిల్

3. ఫ్రాన్కిన్సేన్స్ ఎసెన్షియల్ ఆయిల్, సెనగపిండి తో విటమిన్ E ఆయిల్

- చిటికెడు సెనగపిండి, 2-3 చుక్కల ఫ్రాంక్ఇంసేన్స్ ఎసెన్షియల్ ఆయిల్ తో విటమిన్ E కాప్సిల్ నుండి సేకరించిన నూనెను కలపండి.

- ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై పూసి, 10 నిమిషాల పాటు ఉంచండి.

- గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- కావాల్సిన ఫలితాలు పొందడానికి ఈ పద్ధతిని నెలకు రెండుసార్లు అనుసరించండి.

4. లవేండర్ ఎసెన్షియల్ ఆయిల్ తో ఎగ్ వైట్

4. లవేండర్ ఎసెన్షియల్ ఆయిల్ తో ఎగ్ వైట్

- 2 టీస్పూన్ ల ఎగ్ వైట్, 4 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ని ఒక బౌల్ లో తీసుకుని, కలపండి.

- ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేసి, 5-10 నిమిషాల పాటు వదిలేయండి.

- ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- కావాల్సిన ఫలితాలు పొందడానికి ఈ అండర్-ఐ మాస్క్ ని ప్రతి వారం అనుసరించండి.

5. పాలపొడి తో పెరుగు

5. పాలపొడి తో పెరుగు

- ½ టీస్పూన్ పాలపోడితో 1 టేబుల్ స్పూన్ పెరుగును కలపండి.

- ఈ మాస్క్ ని అప్లై చేసి 10 నిమిషాల సేపు ఉంచండి.

- శుభ్రమైన తడిబట్ట తో తుడవండి.

- మీ కంటి చుట్టూ ఉన్న ముడతలు పోవడానికి వారానికి రెండుసార్లు ఈ పద్ధతిని పాటించండి.

6. మెంతికూర విత్తనాల తో కీరదోస రసం

6. మెంతికూర విత్తనాల తో కీరదోస రసం

- మెంతికూర విత్తనాలను మీ అరచేతి నిండా తీసుకుని వాటిని పొడిగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి.

- 2 టీస్పూన్ ల కీరదోస రసంతో ఈ పౌడర్ ని కలిపి, మీ కంటికింద చర్మంపై రాయండి.

- గోరువెచ్చని నీటితో కడిగే ముందు 10 నిమిషాల సేపు మాస్క్ తో ఉంచండి.

- ఈ అద్భుతమైన మాస్క్ ని ప్రతివారం అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

7. బాదం పొడితో బొప్పాయి గుజ్జు

7. బాదం పొడితో బొప్పాయి గుజ్జు

- 1 టీస్పూన్ బాదం పౌడర్ తో 1 టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జును కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేయండి.

- మీ కంటి చుట్టూ ఉన్న చర్మంపై ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి.

- చల్లనీటితో కడిగే ముందు 10 నిమిషాల పాటు ఉంచండి.

- ఫలితాల కోసం ప్రతి వారం ఈ మాస్క్ ని అప్లై చేయండి.

8. తేనె తో క్యారెట్ రసం

8. తేనె తో క్యారెట్ రసం

- 1 టీస్పూన్ తేనెతో ½ టీస్పూన్ క్యారెట్ జ్యూస్ ని కలపండి.

- ప్రభావిత ప్రాంతంపై ఈ మాస్క్ ని పూయండి.

- గోరువెచ్చని నీటితో కడిగే ముందు 20 నిమిషాల పాటు ఆరనివ్వండి.

- మంచి ఫలితాలు పొందడానికి వారానికి రెండుసార్లు ఈ మాస్క్ ని ఉపయోగించండి.

9. రోజ్ వాటర్ తో అవకడో

9. రోజ్ వాటర్ తో అవకడో

- 2టీస్పూన్ల అవకడో మిశ్రమానికి 1 టీస్పూన్ రోజ్ వాటర్ ని కలపండి.

- ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రదేశంపై అప్లై చేసి 30 నిమిషాల పాటు వదిలేయండి.

- గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- ఈ అద్భుతమైన మాస్క్ ని ప్రతి వారం వాడినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి సహాయపడుతుంది.

10. కలబంద గుజ్జుతో ఆలివ్ ఆయిల్

10. కలబంద గుజ్జుతో ఆలివ్ ఆయిల్

- ఈ మిశ్రమాన్ని తయారుచేయడానికి ½ టీస్పూన్ కలబంద గుజ్జుతో 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ కలపండి.

- ప్రభావితమైన ప్రదేశంపై మీ మిశ్రమంతో మర్దనా చేసి గోరువెచ్చని నీటితో కడిగే ముందు 20-25 నిమిషాల పాటు ఆరనివ్వండి.

- గమనించదగ్గ ఫలితాల కోసం మీరు ఈ వార్ధక్య నివారణా ఐ మాస్క్ ని వార౦లో 3-4 సార్లు ప్రయత్నించండి.

English summary

10 Anti-ageing Eye Masks You Can Easily Make At Home

Have you got wrinkles around your eyes? Have you already tried out every single eye cream and mask in the beauty store? Are you unsatisfied with the results? Well, there are certain age-defying eye masks that you can easily make at home with the help of easily available and potent natural ingredients.
Story first published:Saturday, December 16, 2017, 16:15 [IST]
Desktop Bottom Promotion