చర్మంలో ఏజ్ స్పాట్స్ లేదా బ్రౌన్ స్పాట్స్ ను తొలగించే 10 సింపుల్ హోం రెమెడీస్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఏజ్ స్పాట్స్ ను సాధారంగా బ్రౌన్ స్పాట్స్ లేదా లివర్ స్పాట్స్ గా సూచిస్తుంటారు. బ్రౌన్ స్పాట్స్ వల్ల ఎలాంటి హాని ఉండదు. మన చర్మం ముఖ్యంగా ముఖం, మెడ, భుజాలు, చేతులు, వీపు, ఛాతీ ఎక్కువగా ఎండకు ఎక్స్ పోజ్ అవ్వడం వల్ల ఇలాంటి బ్రౌన్ స్పాట్స్ ఏర్పడుతాయి.

ఈ బ్రౌన్ స్పాట్స్ తరచూ కనబడుతుంటే ఇవి మెలనోసైడ్స్ అని పిలుస్తారు. ఇవి మీ చర్మంను మరింత డార్క్ గా మార్చుతుంది.

చర్మంలో ఇటువంటి బ్రౌన్ స్పాట్స్ ఎక్కువగా ఎండలో తిరిగే వారిలోనే వస్తుంటాయి. ఈ ఏజ్ స్పాట్స్ ప్రమాదకరం కాదు కానీ, వీటిని చూసినప్పుడు వయస్సైన వారిలా కనబడేలా చేస్తాయి. చిన్న వయస్సులో ఇలాంటి పరిస్థితిని ఎవ్వరూ ఇష్టపడు కాబట్టి, ఈ క్రింద సూచించిన 10 సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. వీటి ద్వారా చర్మంలోని ఏజ్ స్పాట్స్ ను తొలగించుకోవచ్చు...

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ అద్భుతమైన ఎక్స్ ఫ్లోయేటర్, ఇందులో ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్స్ కలవు. ఇంది డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి:

1. యాపిల్ సైడర్ వెనిగర్ లో కాటన్ డిప్ చేసి ప్రభావిత ప్రదేశంలో అప్లై చేయాలి.

2. రాత్రి మొత్తం అలాగే ఉండనివ్వాలి.

3. మీకు కనుక సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్లైతే, అందులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే, డ్రై స్కిన్ నుండి రక్షణ పొందుతారు .

4. ఉత్తమ ఫలితాలను పొందడం కోసం , ఈ చిట్కాను రోజూ ప్రయత్నించండి.

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంది, ఇది న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. చర్మంలో మెలనిన్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది. చర్మం ఫ్రెష్ గా మరియు రేడియంట్ గా కనబడేలా చేస్తుంది.

నిమ్మరసం అప్లై చేసి ఎండలోకి వెళ్ళకూడదు. వెళితే చర్మం డార్క్ గా మారుతుంది. ఇంకా మీచర్మం చాలా సెన్సిటివ్ గా ఉన్నట్లైతే , నిమ్మరసం వల్ల చర్మానికి చీకాకు కలిగి ఎర్రగా కందిపోతుంది. కాబట్టి, రోజ్ వాటర్ తో నిమ్మరసం కలిపి తర్వాత ఉపయోగించాలి.

ఎలా ఉపయోగించాలి:

నిమ్మకాయను స్లైస్ గా కట్ చేసి ముఖానికి మర్ధన చేయాలి.

15-20నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

ఉత్తమ ఫలితాల కోసం, రోజు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బట్టర్ మిల్క్

బట్టర్ మిల్క్

మజ్జిగలో ల్యాక్టిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది ఏజ్ స్పాట్ ను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. చర్మంను లైట్ గా మార్చుతుంది.

ఎలా ఉపయోగించాలి:

1. ఒక బౌల్లో ఒక కప్పు బట్టర్ మిల్క్ తీసుకోవాలి.

2. ఒక కాటన్ బాల్ తీసుకుని మజ్జిగలో డిప్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి.

3. 15-20 నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడగాలి.

4. ఆయిల్ స్కిన్ కలవారు కొద్దిగా నిమ్మరసం కలపాలి.

5. ఉత్తమ ఫలితాల కోసం, ఈ చిట్కాను రోజూ ఫాలో అయితే ఏజ్ స్పాట్స్ తొలగిపోతాయి.

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు

ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ కంటెంట్ యాంటీ సెప్టిక్ గా మరియు ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ఉల్లిపాయలు ఘాటైన వాసన ఉన్నా, లెమన్, యాపిల్ సైడర్ వెనిగర్ కంటే బెటర్ గా పనిచేస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

1. ఒక ఉల్లిపాయ తీసుకుని స్లైస్ గా కట్ చేయాలి. స్లైస్ ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి మర్ధన చేయాలి.

2. 10-20 నిముషాలు అలాగే ఉంచాలి

3. తర్వాత నార్మల్ వాటర్ తో కడగాలి.

4. ఈ చిట్కాను రెగ్యులర్ గా ట్రై చేస్తుంటే ఏజ్ స్పాట్స్ కనబడకుండా పోతాయి.

బొప్పాయి:

బొప్పాయి:

డెడ్ స్కిన్ సెల్ ను ఎక్సఫ్లోయేట్ చేయడంలో బొప్పాయి సహాయపడుతుంది, బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్, హైడ్రాక్సి యాసిడ్స్, అందుకు బాగా సహాయపడుతాయి, ఇది ఏజ్ స్పాట్స్ తొలగించడంతో పాటు, చర్మంను కాంతివంతంగా మార్చి, ఇతర చర్మ సమస్యలను నివారిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

1. గ్రీన్ బొప్పాయికి , తొక్క తొలగించాలి.

2. తర్వాత సన్నగా..స్లైస్ గా బొప్పాయిని కట్ చేసి ప్రభావితం ప్రాంతంలో అప్లై చేసి మర్ధన చేయాలి.

3. 10-20నిముషాల పాటు మసాజ్ చేయాలి

4. తర్వాగా ఫలితం పొందడానికి రోజూ ఈ చిట్కా పాటించండి.

కలబంద:

కలబంద:

కలబంద చర్మానికి న్యాచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మం ఫ్రెష్ గా, హైడ్రేట్ గా ఉండటానికి సహాయపడుతుంది, అలాగే ఏజ్ స్పాట్స్, చర్మ సమస్యలను తొలగిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

1. అలోవెర లీప్ కట్ చేసి అందులోని జెల్ తీసి చర్మానికి అప్లై చేయాలి. ముఖ్యంగా ఏజ్ స్పాట్ కనబడే చోటు అప్లై చేయాలి.

2. తర్వాత అరగంట పాటు ఎండలో ఉండాలి.

3. స్కిన్ బంకగా అనిపించేటప్పుడు నీటితో కడిగేయాలి.లేదా అలాగే కూడా వదిలేయవచ్చు.

4. రోజుకు రెండు సార్లు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పెరుగు:

పెరుగు:

పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది బ్రౌన్ స్పాట్స్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

1. ఏజ్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో దీన్ని నేరుగా అప్లై చేయాలి.

2. 30 నిముషాల డ్రైగా మారే వరకూ ఉండాలి.

3. అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో కడగాలి.

4. అలాగే రాత్రి నిద్రించే ముందు కూడా పెరుగు చర్మానికి లేపనంగా అప్లై చేసుకోవచ్చు.

5. బెటర్ రిజల్ట్ కోసం రోజూ ట్రై చేయండి.

టమోటోలు:

టమోటోలు:

టమోటోలలో లైకోపిన్ అధికంగా ఉంటుంది, ఇది ఏజ్ స్పాట్స్ ను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది, ఇందులో ఉండే బ్లీచింగ్ లక్షణాలు చర్మంను లైట్ గా మార్చుతుంది. చర్మంను కాంతివంతంగా హెల్తీగా మార్చుతుంది.

ఎలా ఉపయోగించాలి:

1. టమోటోలను స్లైగా కట్ చేయాలి.

2. టమోటో స్లైస్ ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి మర్ధన చేయాలి.

3. చర్మంలోకి టమోటో జ్యూస్ బాగా ఇమరాలి.

4. 20 నిముషాలు అలాగే ఉంచాలి.

5. తర్వాత నార్మల్ వాటర్ తో కడగాలి.

6. ఈపద్దతిని రోజులో రెండు సార్లు ఫాలోఅయితే మంచి ఫలితం ఉంటుంది.

ఆముదం నూనె:

ఆముదం నూనె:

కొన్ని రకాల ఏజ్ స్పాట్స్ రఫ్ గా ఉంటాయి, వాటిని తొలగించి స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరచడానికి ఆముదం నూనెను ఉపయోగపడుతుంది.

ఎలా ఉపయోగించాలి:

1. ఆముదం నూనెను ప్రభావిత ప్రాంతంలో నేరుగా అప్లై చేయాలి.

2. నూనె చర్మంలోకి బాగా శోషణ జరిగే వరకూ సున్నితంగా మసాజ్ చేయాలి.

3. రోజూ ఉదయం, సాయంత్రం ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

4. డ్రై స్కిన్ తో బాధపడే వారు, కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె కలిపి ఉపయోగించుకోవచ్చు.

వాటర్ మెలోన్

వాటర్ మెలోన్

పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి అధికంగా ఉన్నాయి, ఇవి బ్రౌన్ స్పాట్స్ తొలగించి చర్మం ఫ్రెష్ గా అయ్యే వరకూ సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి:

1. వాటర్ మెలోన్ చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

2. వాటర్ మెలోన్ ముక్కలు తీసుకుని చర్మం మీద మర్ధన చేయాలి.

3. 15-20 అలాగే ఉంచాలి

4. తర్వాత నార్మల్ వాటర్ తో కడగాలి.

5. ఉత్తమ ఫలితాల కోసం దీన్ని రోజూ రిపీట్ చేయండి.

ఏజ్ స్పాట్స్ తొలగించడానికి చిట్కాలు

సన్ స్క్రీన్ అప్లై చేయాలి:

ఎస్ పిఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ ను రోజూ బయటకు వెళ్ళే ముందు అప్లై చేయాలి. ఇది యూవీ కిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. ప్రతి రెండు గంటలకొకసారి తిరిగి అప్లై చేయాలి.

కవర్ చేసుకోవాలి:

చేతులు, కాళ్ళు కవర్ అయ్యేట్లు దుస్తులు ధరించాలి. తలకు హాట్ పెట్టుకోవాలి లేదా బేస్ బాల్ క్యాప్ పెట్టుకోవడం వల్ల సూర్యకిరణాల నుండి చర్మంను, జుట్టును కాపాడుకోవచ్చు.

English summary

10 Simple Home Remedies To Remove Age Spots

10 Simple Home Remedies To Remove Age Spots, Using natural ingredients such as apple cider vinegar, lemon, etc., can actually remove age spots. Read to know more.
Story first published: Wednesday, November 29, 2017, 8:30 [IST]