10 రకాల న్యాచురల్ ఫేషియల్స్! వీటిలో మీ చర్మానికి సూట్ అయ్యే దాన్ని ఎంపిక చేసుకోండి..

By: Mallikarjuna
Subscribe to Boldsky

అతివలకు అందంగా కనబడుట అంటే చాలా ఇష్టం అందుకోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ, డబ్బు ఖర్చుచేస్తుంటారు. అందంగా , చర్మంలో మంచి గ్లో రావాలంటే ఫేషియల్ చేయించుకుంటుంటారు. నెలకొకసారైనా ఇలా ఫేషియల్ చేయించుకోవడం వల్ల చర్మం ఫ్రెష్ గా అందంగా కనబడుతుంది. పురాతన కాలం నుండి కూడా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే అప్పుడు ఇంట్లోనే స్వయంగా ఫేషియల్ కు సంబంధిన పదార్థాలతో ఫేషియల్ చేసుకునేవారు. వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి కావు, మరియు ఇవి చర్మానికి అద్భుతంగా సహాపడేవి.

అందువల్ల, పార్లర్ కు వెళ్లి డబ్బు ఖర్చుచేసే ముందు , మొదట మీ చర్మ తత్వం ఏంటి, మీ చర్మ తత్వాన్ని బట్టి, మీరు ఫేషియల్ చేయించుకోవడం అవసరమా లేదా అన్న విషయం తెలుసుకోవాలి. ఫేషియల్ అనేది మీ చర్మ తత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది. బయటకు వెళ్ళి ఫేషియల్ చేయించుకోలేని పరిస్థితిలో కొన్ని హోం మేడ్ ఫేషియల్ ను కొన్ని మీకోసం అందిస్తున్నాము.

10 Types Of Facial According To Your Skin Type And Concern

చర్మ తత్వాన్ని బట్టి, 10 డిఫరెంట్ ఫేషియల్స్ ఉన్నాయి. వీటిలో వారి యొక్క చర్మ తత్వాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి. మరి ఆలస్యం చేయకుండా మీ చర్మ తత్వానికి సూట్ అయ్యే ఆ ఫేషయల్ ఏంటో ఒకసారి తెలుసుకుందామా...

1. అన్ని రకాల చర్మ తత్వాలకు ఫ్రూట్ ఫేషియల్

1. అన్ని రకాల చర్మ తత్వాలకు ఫ్రూట్ ఫేషియల్

పేరుకు తగ్గట్లే కాంబినేషన్ స్కిన్ అంటే ఆయిల్ స్కిన్ మరియు డ్రై స్కిన్ కలవారు దీన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు కూడా ఈ చర్మ తత్వాన్ని కలిగి ఉంటే, అప్పడు మీరు ఫ్రూట్ ఫేషియల్ చేయించుకోవచ్చు. ఫ్రూట్ ఫేషియల్లో యాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ వంటివి డిఫరెంట్ యాసిడ్స్ ఉండటం వల్ల ఈ ఫ్రూట్ ఫేషియల్ కాంబినేషన్ స్కిన్ కు ఉపయోగపడుతుంది.

2. ఆయిల్ స్కిన్ వారికి(పరెల్) ముత్యాల ఫేషియల్:

2. ఆయిల్ స్కిన్ వారికి(పరెల్) ముత్యాల ఫేషియల్:

ఆయిల్ స్కిన్ ఉన్నవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.లేదంటే ఎక్కువ మొటిమలకు కారణమవుతుంది. ఇలాంటి సమస్య నుండి బయటపడాలంటే, ఇలాంటి చర్మ తత్వం ఉన్నవారు పేరల్ ఫేషియల్ ను ఎంపిక చేసుకోవాలి. ఈ ఫేషియల్ వేసుకోవడం వల్ల చర్మంలోపల ఉండే సెబమ్ ను ఉపయోగించుకోవడం జరగుతుంది. ఈ ఫేషియల్ వల్ల మరీ జిడ్డుగా లేకుండా, మొటిమలు రాకుండా నివారిస్తుంది.

3. పొడి చర్మ తత్వం కలవారికి గాల్వనిక్ ఫేషియల్:

3. పొడి చర్మ తత్వం కలవారికి గాల్వనిక్ ఫేషియల్:

డ్రై స్కిన్ ఉన్న వారికి చర్మంలో పొట్టు పొట్టుగా , చర్మం పూర్తి డ్రైగా ఉంటుంది. ఇలాంటి చర్మం తత్వం కలిగిన వారిలో మీరు ఒక్కరైతే అప్పుడు మీరు కూడా గాల్వనిక్ ఫేషియల్ ను ఎంపిక చేసుకోవాలి.

ఈ ఫేషియల్ వేసుకోవడం వల్ల చర్మంలో తేమ మరియు మాయిశ్చరైజింగ్ గుణాలు పెరుగుతాయి. ఇది ఒక ఖరీదైన ఫేషియల్ . డ్రై స్కిన్ టైప్ కు ఇది ఒక హైలీ ఎఫెక్టివ్ ఫేషియల్ గా సూచిస్తారు.

 4. రఫ్ స్కిన్ కోసం సిల్వర్ ఫేషియల్ :

4. రఫ్ స్కిన్ కోసం సిల్వర్ ఫేషియల్ :

చర్మంలో దుమ్ము,ధూలి , ఇతర టాక్సిన్ చేరడం వల్ల చర్మం రఫ్ గా కనబడుతుంది. అందువల్ల చర్మను అప్పుడప్పుడు డిటాక్సిఫై చేసుకోవడం మంచిది. ఈ సిల్లవర్ ఫేషియల్ నెలకొకసారి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఫేషియల్ వల్ల చర్మంలోని మలినాలను, మురికిని మరియు టాక్సిన్స్ ను తొలగించి డిటాక్సిఫై చేస్తుంది. కాబట్టి సాఫ్ట్ మరియు సపెల్ స్కిన్ పొందడానికి ఈ ఫేషియల్ ను ట్రై చేయండి.

5. వదులైన చర్మానికి కొల్లాజెన్ ఫేషియల్ :

5. వదులైన చర్మానికి కొల్లాజెన్ ఫేషియల్ :

చర్మ సమస్యలో అతి పెద్ద సమస్య ఇది. ఈ సమస్యతో చాలా మంది మహిళలు బాధపడుతుంటారు. కాబట్టి, చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తి తగ్గినప్పుడు, చర్మంయొక్క ఎలాసిటి తగ్గి చర్మం వదులుగా కనబడుతుంది. ఈ చర్మ సమస్యను నివారించుకోవడానికి కొల్లాజెన్ ఫేషియల్ ను ఎంపిక చేసుకోవచ్చు.

6. డల్ స్కిన్ కు గోల్డ్ ఫేషియల్ :

6. డల్ స్కిన్ కు గోల్డ్ ఫేషియల్ :

వాతావరణ కాలుష్యం వల్ల చర్మం పాడైనప్పుడు డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కువ అవుతాయి. చర్మంకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చర్మం మరింత పాడవుతుంది. మీ చర్మం నిర్జీవంగా కనబడుతుంటే, అప్పుడు మీరదు గోల్డెన్ ఫేషియల్ ను ఎంపిక చేసుకోవాలి. ఈ ఫేషియల్ కోసం చర్మ కాంతిని పెంచే బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తారు .డల్ స్కిన్ నివారించడం కోసం ఇది చాలా అవసరం.

7. ఏజింగ్ స్కిన్ కోసం వైన్ ఫేషియల్ :

7. ఏజింగ్ స్కిన్ కోసం వైన్ ఫేషియల్ :

చర్మం గురించి తీసుకునే జాగ్రత్తలో ఇది ముఖ్యమైనది .వైన్ ఫేషియల్ మీరు ఎంపిక చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ ఫేషియల్లో ఫాలీఫినాల్ ఆయిల్స్ నుఉపయోగిస్తారు. ఏజింగ్ లక్షణాలను ఫైన్ లైన్స్,మరియు ముడుతలను నివారిస్తుంది. ఈ లక్సీరియస్ ఫేషియల్ ను ట్రై చేయడానికి చర్మం యంగ్ గా మరియు హెల్తీగా కనబడటానికి సహాయపడుతుంది.

8. స్కిన్ ట్యాన్ నివారించే డిట్యాన్ ఫేషియల్ :

8. స్కిన్ ట్యాన్ నివారించే డిట్యాన్ ఫేషియల్ :

డిట్యాన్ ఫేషియల్ మోస్ట్ ఎఫెక్టివ్ ఫేషియల్, ఇది ఎండవల్ల కమిలిన లేదా నల్లగా మారిన చర్మాన్ని నివారిస్తుంది. ఎండవల్ల ట్యాన్ అయిన చర్మంను ట్రీట్ చేయడానికి ఈ స్కిన్ లైటనింగ్ ఫేషియల్ అవసరం అవుతుంది. ఎండవల్ల పూర్తిగా పాడైన చర్మంను నల్లగా మారిపోయిన చర్మంను తిరిగి పూర్వస్థితికి తీసుకొస్తుంది.

9. సెన్సిటివ్ స్కిన్ కలవారికి ఆక్సిజన్ ఫేషియల్:

9. సెన్సిటివ్ స్కిన్ కలవారికి ఆక్సిజన్ ఫేషియల్:

సెన్సిటివ్ స్కిన్ కలవారికి చర్మం చాలా త్వరగా చీకాకు కలిగిస్తుంది. మరియు ఫేషియల్ తర్వాత ముఖ చర్మం ఎర్రగా కందిపోతుంది. ఈ చర్మ తత్వం ఉన్నవారు ఆక్సిజన్ ఫేషియల్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

ఈ ఫేషియల్ కోసం ఉపయోగించే క్రీమ్ మరియు మాస్క్ చర్మానికి ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. చర్మానికి తగినంత తేమను అందిస్తుంది.దాంతో చర్మం ఫ్రెష్ గా అందంగా కనబడుతుంది.

10.డ్యామేజ్ అయిన చర్మానికి డైమండ్ ఫేషియల్ :

10.డ్యామేజ్ అయిన చర్మానికి డైమండ్ ఫేషియల్ :

అంతర్గత మరియు బహిర్గత పరిస్థితితుల వల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది. ఈ రకమైన చర్మం నిర్జీవంగా, ఎక్కువ డార్క్ స్పాట్స్ తో కనబడుతుంది. ఇలాంటి చర్మంను రిపేర్ చేయడానికి డైమండ్ ఫేషియల్ ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవే కాకుండా స్కిన్ న్యాచురల్ కలర్ ను మరియు బ్రైట్ నెస్ ను పెంచడానికి ఈ ఫేషియల్ ఉపయోగపడుతుంది.

English summary

10 Types Of Facial According To Your Skin Type And Concern

Check out the best facials you should try according to your skin type and concerns.
Story first published: Monday, October 30, 2017, 19:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter