1. ఆవ నూనె నేచురల్ క్లెన్సర్ గా పనిచేస్తుంది

1. ఆవ నూనె నేచురల్ క్లెన్సర్ గా పనిచేస్తుంది

ఆవ నూనెను చర్మానికి ఉపయోగించడం వల్ల కొన్ని అద్భుతాలను క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే నేచురల్ గుణాలు చర్మంను క్లియర్ చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా చర్మానికి అప్లై చేస్తే మేకప్ తో పాటు, చర్మంలో మలినాలు కూడా సులభంగా తొలగిపోతాయి.

2. ముడుతలను నివారిస్తుంది

2. ముడుతలను నివారిస్తుంది

ఆవనూనెలో ఉండే విటమిన్ ఇ కంటెంట్ చర్మంలోని ముడుతలను ఇతర చారలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ట్రెడిషినల్ గా ఈ నూనెను అప్పుడే పుట్టిన శిశువుల నుండి రెండు మూడు సంవత్సరాల పిల్లల వరకూ ఆవనూనెతో బాడీ మసాజ్ చేస్తుంటరు. ఇలా చేయడం వల్ల న్యూ బార్న్ బేబీస్ లో ఎముకలు స్ట్రాంగ్ గా ఏర్పడుతాయి. స్కిన్ కూడా సాప్ట్ గా మారుతుంది.

3. స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది

3. స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది

మస్టర్డ్ ఆయిల్ ఫర్ఫెక్ట్ సన్ స్క్రీన్ లోషన్ గా పనిచేస్తుంది. ఆయిల్ స్కిన్ ను దూరం చేస్తుంది. ఈ ఆవ నూనెను చర్మానికి ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపరుడుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి ఈ నూనె చీకాకు కలిగిస్తుంది. చర్మ స్మూత్ గా..యూత్ ఫుల్ గా కనబడాలంటే ఆవనూనెతో మసాజ్ చేయడం మంచిది. ఆవనూనెలో కొద్దిగా కొబ్బరి నూనె కూడా చేర్చి మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం అందిస్తుంది .

నల్లగా మారిన చర్మానికి మంచి కాంతివంతమైన చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది. ఇది నేచురల్ సన్ స్క్రీన్ యస్ పిఎఫ్ 30 వలే పనిచేస్తుంది. సూర్యుని నుండి వెలువడే యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ, చర్మానికి మసాజ్ చేసినప్పుటు నేచురల్ సన్ స్క్రీన్ వలే పనిచేస్తుంది. ఆవ నూనెలో విటమిన్ ఇ అత్యధికంగా ఉండటం వల్ల యూవీ కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది.

4. డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది

4. డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది

రెగ్యులర్ గా ఆవనూనెను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం హెల్తీగా.. గ్లోయింగ్ స్కిన్ తో మెరిసిపోతుంటుంది. స్కిన్ రాసెష్ ను తొలగిస్తుంది. చర్మంలోని డార్క్ స్పాట్స్ మరియు స్కిన్ పిగ్నెంటేషన్ తొలగించడంలో గ్రేట్ గా సహాయడపుతుంది .

5. డ్రై స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది

5. డ్రై స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది

వింటర్ సీజన్ లో డ్రై అండ్ ఫ్లాకీ స్కిన్ నివారిస్తుంది. వింటర్ సీజన్లో బాగా పండిన అవొకాడో తీసుకుని, గుజ్జుగా చేసి , అందులో కొద్దిగా ఆవనూనె మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేయాలి. చర్మంలోపలికి ఇంకిపోయేలా చేసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపడుతుంది. డ్రై స్కిన్ నివారించబడుతుంది.

6. సన్ టాన్ తొలగిస్తుంది

6. సన్ టాన్ తొలగిస్తుంది

ఎండ వేడి వల్ల చర్మం రంగులో మార్పులు రావడం సహజం. చర్మం నల్లగా మారడం వల్ల అందవిహీనంగా కనబడుతారు. ఒక టీస్పూన్ పెరుగులో కొద్దిగా నిమ్మరసం మరియు ఆవనూనె మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని పేస్ట్ లా చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. అప్లై చేసిన అరగంట తర్వాత గోరువెచ్చని నీటిలో ముఖం శుభ్రం చేసుకోవాలి.

7. రేడియంట్ స్కిన్ కోసం

7. రేడియంట్ స్కిన్ కోసం

ఆవనూనెను ఒక బౌల్లోకి తీసుకుని అందులో కొద్దిగా శెనగపిండి మిక్స్ చేసి, పేస్ట్ లా చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆవనూనెలో శెనగపిండి మిక్స్ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. నిమ్మరసం మిక్స్ చేయడం వల్ల స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను 20 నిముషాలు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆవ నూనెలో ఉండే విటమిన్ ఇ కంటెంట్ యూవి కిరణాల వల్ల ఏర్పడే సన్ టాన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని రక్షించుకుంటుంది. ఎయిర్ పొల్యూషన్ నుండి చర్మం పాడవకుండా రక్షణ కల్పిస్తుంది. చర్మానికి ఆవనూనెను అప్లై చేయడం వల్ల స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపడుతుంది.

Read more about: skin care home remedies glowing skin చర్మ సంరక్షణ హోం రెమెడీస్ గ్లోయింగ్ స్కిన్
English summary

This Oil Can Make You More Beautiful! Find Out Here

Mustard oil which is loaded with anti bacterial and anti fungal properties can treat your rashes or any kind of skin inflammation that you have. Here are some of the beauty benefits of using Mustard oil..
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X