For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేకప్ లేకుండా గార్జియస్ స్కిన్ తో మెరిసిపోవడం ఎలా..?

పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఆఫీసులో మీటింగ్స్ ఇలా దేనికైనా అందంగా కనిపించాలంటే మేకప్ వేసుకోవడం తప్పనిసరి. అయితే మేకప్ వేసుకున్నప్పుడల్లా దానికి సంబంధించిన అన్ని పద్దతులనూ తు.చ తప్పకుండా పాటించడం వల్ల చర్మం

|

పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఆఫీసులో మీటింగ్స్ ఇలా దేనికైనా అందంగా కనిపించాలంటే మేకప్ వేసుకోవడం తప్పనిసరి. అయితే మేకప్ వేసుకున్నప్పుడల్లా దానికి సంబంధించిన అన్ని పద్దతులనూ తు.చ తప్పకుండా పాటించడం వల్ల చర్మంపైన ఆయా ఉత్పత్తుల ప్రభావం ఎక్కువ అవుతుంది. ఫలితంగా చర్మం పాడయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ క్రమంలో మేకప్ కోసం మనం ఉపయోగించే కొన్ని ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించగలిగితే చర్మంపైన వాటి ప్రభావాన్ని తగ్గించగలుగలుగుతాము. అలాగని మేకప్ తక్కువగా వేసుకుంటే అందంగా కనిపిస్తామ? అనే అనుమానం కూడా వస్తుంది. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే తక్కువ మేకప్ వేసుకున్నా అందంగానే కనిపిస్తాం. మరి దానికోసం ఏం చేయాలో తెలుసుకుందామా..

Tips To Look Gorgeous Without Makeup

బేబీక్రిమ్ తో : సాధారణంగా మేకప్ వేసుకోవాలంటే ముందు ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని, ప్రైమర్ రాసి ఆ తర్వాత ఫౌండేషన్ వేసుకుంటాం. అయితే దీని వల్ల మేకప్ ఉత్పత్తులన్నీ కలిసి ముఖంపై మందైన పొరగా ఏర్పడతాయి. అంతే కాదు, వీటి వల్ల చర్మ రంద్రాలు మూసుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వీటికి బదులుగా బేబీ క్రీమును ఉపయోగిస్తే మంచిది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజర్ చేయడంతో పాటు కాంతివంతంగా మారేలా చేస్తుంది. అంతే కాదు దీనిలో సూర్య రశ్మి నుంచి చర్మాన్ని కాపాడే గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి, దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సిన అవరసం ఉండదు.

బేబీక్రిమ్ తో :

బేబీక్రిమ్ తో :

సాధారణంగా మేకప్ వేసుకోవాలంటే ముందు ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని, ప్రైమర్ రాసి ఆ తర్వాత ఫౌండేషన్ వేసుకుంటాం. అయితే దీని వల్ల మేకప్ ఉత్పత్తులన్నీ కలిసి ముఖంపై మందైన పొరగా ఏర్పడతాయి. అంతే కాదు, వీటి వల్ల చర్మ రంద్రాలు మూసుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వీటికి బదులుగా బేబీ క్రీమును ఉపయోగిస్తే మంచిది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజర్ చేయడంతో పాటు కాంతివంతంగా మారేలా చేస్తుంది. అంతే కాదు దీనిలో సూర్య రశ్మి నుంచి చర్మాన్ని కాపాడే గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి, దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సిన అవరసం ఉండదు.

సన్ స్క్రీన్ లోషన్ తో :

సన్ స్క్రీన్ లోషన్ తో :

కొంత మంది చర్మానికి మేకప్ ఉత్పత్తులు సరిపడవు. అలాంటి వారు ముఖానికి మాయిశ్చరైజర్ ఆ తర్వాత సన్ స్క్రీన్ బ్రైటనింగ్ క్రీమ్ ను ఉపయోగిస్తారు. అలాంటి వారు సన్ స్క్రీన్ లోషన్ ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఇది చర్మాన్ని సూర్యరశ్మి బారి నుండి కాపాడటంతో పాటు చర్మంలో తమేమ కోల్పోకుండా చేస్తాయి. కొన్ని రకాల సన్ స్క్రీన్ లోషన్లు సూర్య రశ్మి నుంచి చర్మాన్ని రక్షించడమే కాకుండా మాయిశ్చైజ్ కూడా చేస్తాయి. అలాగే చర్మాన్ని కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి . అందుకే మాయిశ్చరైజర్ , స్కిన్ బ్రైటనింగ్ క్రీమ్ లకు బదులుగా సన్ స్క్రీన్ లోషన్ ని ఉపయోగిస్తే సరిపోతుంది. అయితే దీని ఎస్పీఎప్ విలువ చర్మ తత్వానికి సరిపోయే విధంగా చూసుకోవాలి.

ఐ మేకప్:

ఐ మేకప్:

ఐషాడో, ఐలైనర్ మస్కారా వంటి వాటిని ఉపయోగించడం వల్ల కళ్ళ అందాన్ని రెట్టింపు చేసి చూపించవచ్చు. అయితే కళ్ళ భాగంలో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఫలితంగా వీటిలోని రసాయనాల ప్రభావానికి పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత తక్కువ మేకప్ తోనే గ్రాండ్ లుక్ వచ్చేలా చేసుకోవాలి. దీనికోసం నలుపు రంగు ఐలైనర్ కి బదులుగా బ్రౌన్ రంగుని ఎంచుకోవాలి. అలాగే వాటర్ ఫ్రూఫ్ మస్కారాని వేసుకుంటే కళ్ళు అందంగా మెరిసిపోతాయి.

 లిప్ స్టిక్ ఇలా:

లిప్ స్టిక్ ఇలా:

పెదాలకు లిప్ స్టిక్ సరైన రీతిలో వేసుకోవడం ద్వారా ముఖ సౌందర్యాన్ని మరింత ఇనుమడించేలా చేసుకోవచ్చు.దీనికోసం లేత, మద్యరంగుల్లో ఉండే లిప్ స్టిక్ ని ఎంపిక చేసుకోవాలి. ముందుగా లిప్ బామ్ అప్లై చేసుకుని ఆ తర్వాత లిప్ స్టిక్ రాసుకోవాలి. ఆ తర్వాత దీనికి తగిన లిప్ గ్లాస్ అప్లై చేసుకోవడం ద్వారా అందమైన పెదాల్ని సొంతం చేసుకోవచ్చు. ఫలితంగా ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది.

హైలైట్ చేయాలి:

హైలైట్ చేయాలి:

ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఏదో ఒక భాగం అందంగా ఉంటుంది. ముందు దాన్ని గుర్తించి హైలైట్ చేయడం ద్వారా తక్కవ మేకప్ తోనే మంచి లుక్ ని సొంతం చేసుకోవచ్చు. కొంతమందిలో కళ్ళు ఆకర్షణీయంగా ఉంటే మరికొందరిలో ముక్కు, ఇంకొందరికి పెదాలు, అందంగా కనిపిస్తాయి. ముఖంలో ఏ) భాగం అందంగా కనిపిస్తే దాన్ని మరింత అందంగా కనిపిస్తే దాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలి. అప్పుడు మన సౌందర్యం మరింత ఇనుమడిస్తుంది.

English summary

Tips To Look Gorgeous Without Makeup

Looking gorgeous without makeup is the best thing to do if you don't want to load yourself with chemicals. Makeup is not always needed to look gorgeous. When you stand before the mirror surrounded by cosmetics, you find it difficult to avoid makeup and look beautiful naturally. Then, how to look gorgeous without makeup? Well, Boldsky has the answer for you.
Desktop Bottom Promotion