చలికాలపు ర్యాషెస్ ని తగ్గించుకోటానికి అద్భుత చిట్కాలు

Subscribe to Boldsky

చలికాలం ముంచుకొస్తోంది, ఏడాది మొత్తంలో ఈ సమయంలోనే మీ చర్మానికి ఎక్కువ శ్రద్ధ అవసరం. శరీరంపై తేమ తగ్గిపోవటంతో చర్మం పొడిగా, దురదగా,పొరలు పొరలుగా ఊడిపోతూ, నిగారింపు,జీవంలేకుండా ఉంటుంది.

పొడిచర్మం స్త్రీలను,పురుషులపై సమానంగా ప్రభావం చూపిస్తుంది, కానీ పెద్దవారికి ఎక్కువ సమస్యగా ఉంటుంది. ఎందుకంటే పెద్దయ్యేకొద్దీ సహజంగా చర్మం స్రవించే ద్రవాలు తగ్గిపోతాయి.

పొడిచర్మం తరచుగా చలికాలపు రాష్ కి దారితీస్తుంది. రాష్ అంటే మంటగా ఉండే చర్మప్రాంతం. ఏడాది పొడుగునా ఆరోగ్యకర చర్మం ఉన్నవారు కూడా చలికాలంలో ర్యాషెస్ పొందవచ్చు. ఈ స్థితి సాధారణం మరియు ప్రతి సంవత్సరం జరిగేదే.

Amazing Tips To Get Rid Of Winter Rashes

చలికాలపు ర్యాషెస్ లక్షణాలేంటి?

చలికాలపు ర్యాషెస్ లక్షణాలు కింద వివరించబడ్డాయి.

1.వాచడం

2.దురద

3.ఎర్రగా మారటం

4.బొబ్బలు

చలికాలం ర్యాషెస్ మీ చేతులు,కాళ్ళు,భుజాలు ఎక్కడన్నా రావచ్చు. కొన్ని కేసులలో శరీరం మొత్తం ప్రభావం చూపిస్తుంది.

సరైన చికిత్స,సంరక్షణ లేకుండా ఉంటే చలికాలం సీజన్ మొత్తం ఈ ర్యాషెస్ కొనసాగవచ్చు.మనం అది కోరుకోం,కదా? అందుకే ఇక్కడ ఆరోగ్యకర మరియు తేమపూరిత చర్మం తిరిగిపొందటానికి కొన్ని సహజమైన ఇంటిచిట్కాలు కింద అందించాం. అవేంటో చదవండి.

అవకాడో,అరటిపండు మరియు బొప్పాయి పేస్ట్

అవకాడో,అరటిపండు మరియు బొప్పాయి పేస్ట్

బొప్పాయిలో ఎక్కువ నీటిశాతం ఉంటుంది, ఇది చర్మాన్ని మృదువుగా,మెత్తగా,తేమ నిండేట్లా చేస్తుంది.

అవకాడో మరియు అరటిపండులో విటమిన్ ఇ మరియు పొటాషియం అధికంగా ఉండి, మీ చర్మంలో తేమను తిరిగితెస్తుంది.

ఎలా వాడాలి

అరటిపండు తొక్కతీసి బొప్పాయి మరియు అవకాడోతో కలపండి. అంతా పేస్టులాగా చేయండి.

ఈ మిశ్రమాన్ని మీ మొహం మొత్తంపై రాయండి.

దాన్ని అలానే 15 నిమిషాలు వదిలేయండి.

తర్వాత నీటితో కడగండి.

మంచి ఫలితాల కోసం, ఈ పద్ధతిని వారానికి రెండుసార్లు పాటించండి.

దోసకాయ

దోసకాయ

ఎక్కువ నీటి శాతం మాత్రమేకాక, దోసకాయలలో అనేక పోషక విలువలు కూడా ఉంటాయి. తేమగుణాలు, ముఖ్యపోషకాలతో దీనిలో ఉండే చల్లబరిచే గుణం, మంటను,వాపును తగ్గిస్తుంది.

ఎలా వాడాలి;

ఒక దోసకాయ మొత్తాన్ని చెక్కు తీయండి.

ముక్కలు చేసి పేస్టులా చేయండి.

మీ మొహం మొత్తంపై ఈ పేస్టు రాసి, 30 నిమిషాలు అలానే వదిలేయండి.

నీటితో కడిగేయండి.

మీరు దోసకాయల ముక్కలను కూడా ర్యాష్ వచ్చిన ప్రాంతంలో నేరుగా రుద్దవచ్చు. దానివల్ల మీకు మంట తగ్గి ఉపశమనం లభిస్తుంది.

నూనెలు

నూనెలు

నూనెలు చర్మాన్ని కాపాడి, సహజంగా తేమను పెంచే పదార్థాలుగా ఉపయోగపడతాయి.

ఎలా వాడాలి;

మీరు ఆలివ్ నూనె, కొబ్బరినూనె, బాదం నూనె వంటి వాటిల్లో ఏదైనా మీ చర్మం యొక్క తేమ కోసం వాడవచ్చు.

స్నానం తర్వాత నూనెను మీ శరీరంపై మసాజ్ చేయండి. సరిపోయేంత నూనెను మీ శరీరానికి పట్టించండి. మీరు నూనెను రాసేముందు దాన్ని వేడిచేసి కూడా తర్వాత మీ శరీరానికి రాసుకోవచ్చు.

ఓట్ మీల్

ఓట్ మీల్

ఓట్ మీల్ లో విటమిన్ ఇ ఉంటుంది, ఇది చర్మానికి తేమను అందిస్తుంది మరియు సహజంగా మృతకణాలను తొలగించే ఎక్స్ ఫోలియంట్ గా కూడా పనిచేస్తుంది.

ఎలా వాడాలి

ఒక కప్పు ఓట్ మీల్ ను మిక్సీలో వేసి పొడిగా చేయండి.

నీటిని జతచేసి గట్టి పేస్టుగా కలపండి.

ఈ పేస్టును ర్యాషెస్ వచ్చిన ప్రాంతాలలో రాయండి.

శుభ్రమైన గుడ్డతో దాన్ని కప్పి 30 నిమిషాల పాటు అలా ఉంచండి.

నీటితో కడిగేయండి.

ప్రతిరోజూ ఇలా చేసి చర్మం మంట, దురద మరియు చలికాలపు ర్యాషెస్ కి దూరంగా ఉండండి.

పాల మీగడ

పాల మీగడ

పాలమీగడలో లాక్టిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది చర్మం నిగారింపుకి,మెరవడానికి సాయపడుతుంది. దీనిలో ఉండే తేమగుణాలు తేమను స్థిరంగా చర్మంపై ఉంచి, మీ చర్మాన్ని మెత్తగా మరియు నిగనిగలాడేలా చేస్తుంది.

ఎలా వాడాలి

ఒక గిన్నెలో ఒక కప్పు పాలమీగడ మరియు మెత్తగా చిదిమిన అరటిపళ్ళను వేయండి.

మొత్తం సరిగా కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై రాసి 30 నిమిషాలపాటు ఉంచేయండి.

మామూలు నీటితో కడిగేయండి.

తేనె

తేనె

తేనె సహజమైన మాయిశ్చరైజర్. దానిలోని బ్యాక్టీరియా వ్యతిరేక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పాడైన చర్మకణాలను బాగుచేసి తేమను తిరిగితెస్తాయి.

ఎలా వాడాలి

2-3చెంచాల తేనెను వేడిచేయండి.

ర్యాషెస్ ఉన్న ప్రాంతాలలో దీన్ని పూయండి.

15-20నిమిషాలు అలా వదిలేసి మామూలు నీరుతో కడిగేయండి.

డ్రై ఫ్రూట్లు

డ్రై ఫ్రూట్లు

బాదం, జీడిపప్పు మరియు కిస్మిస్ లు మీ చర్మంలో తేమను పెంచి పొడిచర్మాన్ని తొలగిస్తాయి.

వీటిని మీ డైట్ కి జతచేయడం వలన చలికాలపు ర్యాషెస్ తో పోరాడటానికి ఉపయోగపడతాయి.

చలికాలం ర్యాషెస్ రాకుండా నివారించే పద్ధతులు

చలికాలం ర్యాషెస్ రాకుండా నివారించే పద్ధతులు

వేడినీటిలో స్నానం చేయకండి, సుగంధద్రవ్యాలు లేని సబ్బు వాడండి

కాటన్ లేదా జనపనార బట్టలు ధరించండి.ఇది మీ చర్మం వేడెక్కకుండా, మంట రాకుండా చేస్తుంది.

చలికాలంలో బయటకి వెళ్ళేముందు ఎప్పుడూ గ్లోవ్స్ వేసుకోండి.

కొన్ని చలికాలపు ర్యాషెస్ చిన్నగానే ఉంటాయి,ఇవి పై చిట్కాలతో తొలగిపోతాయి. ఇతర కొన్ని ర్యాషెస్ సీరియస్ గా ఉండి వైద్య సాయం అవసరమవుతుంది. మీ ర్యాషెస్ తగ్గకపోతే వైద్యుడ్ని సంప్రదించండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Amazing Tips To Get Rid Of Winter Rashes

    Winter rashes can be seen on your arms, legs, or hands. And in a few cases, it may also affect the entire body. Without proper care and treatment, your rashes may last throughout the winter season. We wouldn't want that now, do we? So, here are few natural home remedies for healthy and moisturized skin, which are as mentioned below. Take a look.Read more at: https://www.boldsky.com/beauty/skin-care/2017/tips-to-get-rid-of-winter-rashes/articlecontent-pf181375-118927.html
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more