కళ్ళ క్రింద ఉబ్బుని తొలగించుకునే అద్భుతమైన చిట్కాలు

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మీరు నిద్రలేవగానే మీ కళ్ళు ఉబ్బినట్టుగా ఉన్నాయా? ఇన్స్టెంట్ గా ఈ సమస్య నుంచి బయటపడాలని మీరు ఆశిస్తున్నారా? అయితే, ఈ ఆర్టికల్ మీ కోసమే.

వివిధ కారణాల వల్ల కళ్ళు ఉబ్బుతాయి. సరైన నిద్ర లేకపోవడం, ఫ్లూయిడ్ రిటెన్షన్, ఏడుపు, డీహైడ్రేషన్, అలర్జీస్ వంటి కొన్ని కారకాల వల్ల కంటి కింద ఉబ్బినట్టుగా మారుతుంది.

కారణమేదైనా కానీ కంటి కిడా ఉబ్బినట్టుగా మారినట్టయితే తక్షణమే మీరు కొన్ని జాగ్రత్తలు పాటించి మీ అందాన్ని సంరక్షించుకోవాలి. కాస్మెటిక్ ప్రోడక్ట్స్ తో కంటి కింద ఉబ్బుని కప్పి పుచ్చడం కూడా అంత సులభమేం కాదు. పైగా, మరింతగా మీ అందాన్ని పాడుచేసుకున్నవారవుతారు.

Tricks To Get Rid Of Puffy Eyes In An Instant

ఉబ్బిన కళ్ళను నివారించే తక్షణ పరిష్కారం కోసం మీరు ఎదురుచూస్తున్నట్లైతే, మీకోసం మేము అద్భుతమైన చిట్కాలను తీసుకువచ్చాము. ఈ సమస్య నుంచి మిమ్మల్ని రక్షించేందుకు సులభమైన నివారణ చిట్కాలను మీకు తెలియచేయబోతున్నాము. ఈ క్రింద చెప్పబడిన మార్గాలను పాటిస్తే ప్రభావిత ప్రాంతంలో రక్తప్రసరణ సజావుగా జరిగి సమస్య తగ్గుతుంది. కాబట్టి, ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడనుంది.

ఈ చిట్కాలను తెలుసుకోండి మరి:

1. చల్లటి స్పూన్:

1. చల్లటి స్పూన్:

కంటి కింద ఉబ్బిన ప్రాంతంలో చల్లటి స్పూన్ ను ఉంచడం ఎంతో ఉపయోగకరమైన చిట్కా. ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. కంటి కింద బాగ్స్ ని తక్షణమే తొలగిస్తుంది. అయితే, ఈ చిట్కాని పాటించడానికి కొంత ప్రిపరేషన్ అవసరం.

రిఫ్రిజిరేటర్ లో రెండు స్పూన్స్ ని పెట్టి వాటిని అయిదు లేదా పది నిమిషాల తరువాత బయటకు తీయండి. వాటిని మీ కళ్ళు మూసుకుని మీ కళ్లపై పెట్టండి. దాదాపు అయిదు నుంచి ఏడు నిమిషాల వరకు ఈ చిట్కాని పాటించండి. మీరు కంటి కింద బాగ్స్ ని గమనించిన ప్రతీసారి ఈ చిట్కాని పాటించండి.

2. ఎగ్ వైట్స్:

2. ఎగ్ వైట్స్:

ఎగ్ వైట్స్ లో చర్మ సంరక్షణకు అవసరమయ్యే ప్రోటీన్లు అలాగే విటమిన్లు కలవు. అందువల్ల, ఈ సహజ సిద్ధమైన సౌందర్య పదార్థాలు చర్మ సంరక్షణకు ప్రభావవంతంగా పనిచేస్తాయి. తద్వారా కంటి కింద ఉబ్బుని త్వరితంగా తొలగిస్తాయి.

ఎగ్ వైట్ ని ఒక పాత్రలోకి తీసుకుని ప్రభావిత ప్రదేశంపై అప్లై చేయండి. అయిదు నిమిషాల తరువాత గోరువెచ్చని నీతితో ఆ ప్రదేశాన్ని శుభ్రపరచండి.

3. టీ బ్యాగ్స్:

3. టీ బ్యాగ్స్:

సహజసిద్ధమైన టానిన్లు టీ బాగ్స్ లో పుష్కలంగా కలవు. ఇవి తక్షణమే కంటి కింద ఉబ్బుని తొలగిస్తాయి. అంతే కాదు డార్క్ స్కిన్ ని సహజంగా కాంతివంతంగా చేయటంలో టీ బాగ్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి.

రెండు టీ బాగ్స్ ని తీసుకుని ప్రభావవంతమైన ప్రదేశంపై ఉంచండి. అయిదు నుండి పది నిమిషాల తరువాత టీ బాగ్స్ ని తీసి జాగ్రత్తగా గోరువెచ్చటి నీటితో కడగండి.

4. దోసకాయ:

4. దోసకాయ:

కంటి కింద ఉబ్బుని తొలగించడానికి దోసకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది.చర్మ సంరక్షణకు దోసకాయ చేసే మేలు వర్ణించలేనిది..

దోసకాయలో ఉండే అంటాక్సిడాంట్స్ కంటి కింద వాపును తగ్గించి చర్మాన్ని అందంగా తాజాగా మార్చడంలో తోడ్పడతాయి. దోసకాయని రెండు స్లైసెస్ గా కట్ చేసి వాటిని మీ కంటి పైన ఉంచండి. దాదాపు పదిహేను నిమిషాల వరకు అలా ఉంచితే కంటి కింద ఉబ్బు తగ్గుతుంది. ఆ తరువాత మెత్తటి వస్త్రాన్ని గోరువెచ్చటి నీటిలో ముంచి దానితో మీ కళ్ళను శుభ్రం చేసుకోండి.

5. అవకాడో:

5. అవకాడో:

అవకాడోకి చర్మాన్ని ఉపశమనం కలిగించే సహజ లక్షణం ఉంది.అందువల్ల, కంటి కింద ఉబ్బు త్వరగా తగ్గుతుంది. ఈ ఫ్రూట్ లో లభించే యాంటీఆక్సిడాంట్స్ కంటి కింద ఉబ్బుని తగ్గించే లక్షణం కలిగి ఉంటాయి.

అవొకాడో ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి గుజ్జుగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేసి పది నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో తొలగించండి.

6. ఐస్ కోల్డ్ వాటర్:

6. ఐస్ కోల్డ్ వాటర్:

కంటి కింద ఉబ్బుని తొలగించడానికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. కొంచెం ఐస్ కోల్డ్ వాటర్ ని ప్రభావిత ప్రాంతంపై చల్లుకోండి.

కోల్డ్ వాటర్ చర్మానికి ఉపశమనం కలిగించి కాంతిని పెంచుతుంది. రక్త ప్రసరణను అభివృద్ధి పరచి ప్రభావిత ప్రాంతంలో ఉబ్బుని తగ్గించడంలో ఎంతగానో తోడ్పడుతుంది.

7. మసాజ్:

7. మసాజ్:

కంటి కింద బ్యాగ్స్ ని తొలగించడానికి మసాజ్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ ఫింగర్ టిప్స్ తో ప్రభావిత ప్రాంతంపై సున్నితంగా మర్దనా చేయండి. ఈ పద్దతి ద్వారా రక్త ప్రసరణ వృద్ధి చెందుతుంది. తద్వారా తక్షణమే మీకు కంటి కింద బ్యాగ్స్ నుంచి విముక్తి లభిస్తుంది.

8. బంగాళాదుంప ముక్క:

8. బంగాళాదుంప ముక్క:

సౌందర్య పోషణలో బంగాళాదుంప ప్రధాన పాత్ర పోషిస్తుంది. బంగాళాదుంపని రెండు ముక్కలుగా తరిగి మీ కంటిపై ఉంచాలి. దాదాపు పదిహేను నిముషాలు ఉంచిన తరువాత గోరువెచ్చని నీతితో కడగాలి. ఈ చిట్కా ద్వారా తాజా కళ్ళు మీ సొంతం అవుతాయి.

English summary

Tricks To Get An Instant Relief From Puffy Eyes

Did you wake up with puffy eyes yet again? Are you wondering if you can fix it in an instant? If you're looking for tricks to draw out the puffiness from your eyes in an instant, then we've got you covered. Home remedies are the most effective ways to get an immediate relief from puffy eyes.
Story first published: Tuesday, November 28, 2017, 13:00 [IST]