For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ కాంతికి ఇంట్లో తయారుచేసుకునే కాఫీ స్క్రబ్ ..!!

కాఫీని ఉపయోగించి మీరు ప్రతిరోజూ మీ చర్మాన్ని సంరక్షి౦చుకోడానికి ఎంచుకునే 7 అద్భుతమైన మార్గాలు!

By Lekhaka
|

కాఫీలో స్వతహాగా యాంటీఆక్సిడెంట్ లు సమృద్ధిగా ఉంటాయి. కాఫీ గింజలలో ఒక గొప్ప పెళుసు ఉంది, ఇతర పదార్ధాలలాగా ఇది చర్మానికి హానిచేయదు. కాఫీ గింజలు చర్మంలోని PH సమతుల్యతకు సహాయపడుతుంది తద్వారా స్వేదగ్రందులు శుభ్రపడతాయి.

ఒక కప్పు కాఫీ తాగందే యేరోజూ పూర్తి కాదు, మీరు కాఫీ తాగకపోతే మీరు ఎన్ని కధలు చెప్పారు అన్నది విషయం కాదు, అది చెడు కాదు. ఇన్స్టంట్ కాఫీ తయారు చేయడం చాలా తేలిక, ఎక్కువ సమయం కూడా పట్టదు, కాఫీ గింజలతో తయారుచేసిన కాఫీ తాగడం అనే భావన వర్ణించలేనిది.

Use Coffee Grounds In Your Skin Care Routine In These 7 Ways!,


రోజుకు రెండు కప్పుల కాఫీ పూర్తిగా మంచిదే. కాబట్టి, మార్కెట్లో, ఇంటర్నెట్ మొత్తం లో అందుబాటులో ఉండే ఎంత ఖరీదైనదో అంత ప్రయోజనకారి అయిన కాఫీ ని ఎందుకు దూరంగా విసురుతారు?

మీరు రోజువారి మీకు ఇష్టమైన పానీయాన్ని ఆనందించాలి అంటే, మీ ఉదయం కప్పు కాఫి తయారైన తరువాత, చల్లారే వరకు పక్కన పెట్టండి.

గ్రేయినీ కాఫీ మీ చర్మాన్ని గట్టిపరిచి మీ జుట్టు లేతరంగు పొందడానికి ఉపయోగపడుతుంది.

కాబట్టి, మీ చర్మం ఆరోగ్యంగా, బిగుతుగా ఉండడానికి ఇంట్లో తయారుచేసుకునే 7 అద్భుతమైన కాఫీ గింజల స్క్రబ్ లు ఇక్కడ ఉన్నాయి.

కాఫీ గింజలు మాత్రమే

కాఫీ గింజలు మాత్రమే

మీరు ఉదయం కప్పు కాఫీ తో ఆనందించాలి అంటే కాఫీ గింజలను చల్లబరచందో. కాఫీ గింజలు చల్లారిన తరువాత, మీ కళ్ళ కింద, కనుబొమల కింద వాటిని అప్లై చేయండి. అలా 10 నిముషాలు ఉంచితే, కాఫీ గింజల అద్భుత పని కనిపిస్తుంది. ఇది మృతచర్మాన్ని తొలగించి, ఆరెండు ప్రదేశాలను కాంతివంతం చేస్తుంది. మృదువుగా కూడా చేస్తుంది.

యాంటి సేల్యులైట్ స్క్రబ్

యాంటి సేల్యులైట్ స్క్రబ్

½ కప్పు కాఫీ గింజల పౌడర్, 1 టీస్పూన్ అల్లం రసం, 1 పించ్ సీ సాల్ట్, 1 టీస్పూన్ తేనె ను కలపండి. దీన్ని బాగా కలిపి, బాగా స్క్రబ్ చేయండి. కాఫీ గింజల పౌడర్ మంచి రక్తప్రసరణను మెరుగుపరిచి, ఆప్రాంతంలో ఉన్న నీటిని తొలగించి, ఆ ప్రాంతం అందంగా కనిపించేట్టు చేస్తుంది.

ముఖం మీద స్క్రబ్

ముఖం మీద స్క్రబ్

కాఫీ గింజల పొడి అద్భుతమైన యాంటీ టాన్ ఏజెంట్, చర్మం తేమకు మంచి ఉపకరణం. ½ కప్పు కాఫీ గింజల పొడితో పాటు 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 3 టేబుల్ స్పూన్ల కొవ్వు నిండిన పాలు, 1 టేబుల్ స్పూన్ తేనెను కలపండి. మీ మిశ్రమాన్ని మీ చర్మం, చేతులు, కాళ్ళ పై అప్లై చేసి 2 నిమిషాలు మృదువుగా మర్దనా చేయండి. మరో 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచి, పంపు నీళ్ళతో బాగా కడగండి. ఏవైనా కొన్ని ముఖ్యమైన ఈవెంట్లకు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ మాస్క్ ను వేసుకోండి.

 కాఫి, పెరుగు మాస్క్

కాఫి, పెరుగు మాస్క్

రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ కాఫీ గింజల పొడి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై పూసి, 20 నిమిషాల పాటు వదిలేయండి. పెరుగు చర్మానికి తేమను అందిస్తే, కాఫీ పొడి సమర్ధవంతమైన రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

కాఫీ ఐస్ క్యూబ్ లు

కాఫీ ఐస్ క్యూబ్ లు

ఒక ఐస్ క్యూబ్ ట్రే లో హాఫ్ టీ స్పూన్ కాఫీ గింజల పొడిని ఉంచండి, మిగిలినది నీటితో నింపండి. రాత్రంతా ఉంచి, రోజువారీ చల్లబరచ డానికి, రక్తప్రసరణకు మీ ముఖం మీద ప్రతిరోజూ ఒక క్యూబ్ తో రుద్దండి.

మీ పెదాలను తేమగా ఉంచుతుంది

మీ పెదాలను తేమగా ఉంచుతుంది

ఈ పెదాల స్క్రబ్ పెదాల మీద ఉన్న లిప్స్టిక్ మరకలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక టీ స్పూన్ తేనెతో ఒక టీ స్పూన్ కాఫీ గింజలను కలపండి. కొన్ని సెకండ్ల పాటు ఈ మిశ్రమంతో మీ పెదాలను సున్నితంగా మర్దనా చేయండి. దీనితరువాత, మీ రోజువారీ పెదాల సంరక్షణ లో లిప్ బామ్ రాయండి. మంచి ఫలితాల కోసం ఇలా ప్రతిరోజూ చేయండి.

ఆలివ్ ఆయిల్, కాఫీ గింజల స్క్రబ్

ఆలివ్ ఆయిల్, కాఫీ గింజల స్క్రబ్

½ కప్పు కాఫీ గింజలలో, 1టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపండి. ఆ మిశ్రమాన్ని మీ చర్మంపై మర్దనా చేసి, కళ్ళ ప్రదేశాన్ని వదిలేయండి. మరో 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, చల్లని నీటితో కడగండి. ఆలివ్ నూనె మంచి తేమను అందిస్తుంది కనుక, కాఫీ గింజలు చర్మాన్ని మెరుగుపరుస్తాయి.

English summary

Use Coffee Grounds In Your Skin Care Routine In These 7 Ways!

Opt for these 7 incredible ways to use coffee in your skin care routine! Read here to know all about it!
Story first published: Tuesday, May 9, 2017, 18:25 [IST]
Desktop Bottom Promotion