For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరుగు ఫేస్ ప్యాక్ తో చర్మంలోని నిగారింపు..!!

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబితే.. తక్కువ ఖరీదులో అందాన్ని మెరుగుపరుచుకోవడానికి పెరుగు చాలంటారు సౌందర్య నిపుణులు. తక్కువ సమయంలో ముఖాన్ని తాజాగా మెరిపించాలి. ఏం చేయాలంటా

|

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబితే.. తక్కువ ఖరీదులో అందాన్ని మెరుగుపరుచుకోవడానికి పెరుగు చాలంటారు సౌందర్య నిపుణులు.ప్రతి ఇంట్లో తప్పకుండా లభించే పెరుగు ముఖ్యమైన బ్యూటీ ఇంగ్రీడియెంట్ అన్న విషయం మరచిపోకూడదు. కాంతివంతమైన చర్మం కోసం ప్రయత్నిస్తుంటే, కచ్చితంగా మీ బ్యూటీ ప్యాక్స్ లో పెరుగుకి స్తానం కలిపించాలి. వెడ్డింగ్ సీజన్ లో ఆరోగ్యవంతమైన చర్మం కోసం పెరుగుకు మొదటి స్థానాన్ని కల్పించడం ప్రధానం.

పెరుగుతో చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో పెరుగు ముఖ్యపాత్ర పోషిస్తుంది. కేవలం పెరుగునే ఫేస్ మాస్క్ గా అప్లై చేసుకున్నా మెరుగైన ఫలితముంటుంది. పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్ లు అత్యధిక స్థాయిలో లభిస్తాయి. అంతే కాకుండా, విటమిన్స్, మినరల్స్ కూడా లభిస్తాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే, పెరుగులో ఉండే యాంటి మైక్రోబియాల్ ప్రాపర్టీస్ చర్మ సమస్యలకు రెమిడీగా పని చేస్తాయి.

తక్కువ సమయంలో ముఖాన్ని తాజాగా మెరిపించాలి. ఏం చేయాలంటారా. పెరుగుకి మరికొన్ని పదార్థాలు కలిపి చకచకా పూతలు వేసేయండి. ఎలాగంటారా..మరిదాన్ని ఎలా ఉపయోగించాలంటే..

పావుకప్పు పెరుగులో, రెండు చెంచాల ఓట్స్‌ పొడి

పావుకప్పు పెరుగులో, రెండు చెంచాల ఓట్స్‌ పొడి

పావుకప్పు పెరుగులో, రెండు చెంచాల ఓట్స్‌ పొడి, చెంచా తేనె, కొద్దిగా నిమ్మరసం చేర్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకుని మర్దన చేసుకోవాలి. పూర్తిగా ఆరాక కడిగేయాలి. దీనివల్ల మృతకణాలు పోవడమే కాదు, చర్మం కూడా తాజాగా కనిపిస్తుంది. ముఖంపై నల్లటి మచ్చలూ తగ్గుముఖం పడతాయి.

 పావుకప్పు పెరుగులో, టేబుల్‌ స్పూను నిమ్మరసం,

పావుకప్పు పెరుగులో, టేబుల్‌ స్పూను నిమ్మరసం,

పావుకప్పు పెరుగులో, టేబుల్‌ స్పూను నిమ్మరసం, కాస్త బాదం నూనె వేసి ఓ గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. దీన్ని చేతులూ గోళ్లకు సవ్య, అపసవ్య దిశలో మర్దన చేయాలి. ఇరవై నిమిషాలయ్యాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. గోళ్లచుట్టూ ఉండే చర్మం మృదువుగా మారుతుంది. గోళ్లూ, చేతులూ ఆరోగ్యంగా కనిపిస్తాయి.

రెండు చెంచాల పెరుగులో అరచెంచా తేనె

రెండు చెంచాల పెరుగులో అరచెంచా తేనె

రెండు చెంచాల పెరుగులో అరచెంచా తేనె కలిపి ముఖానికి రాసి ఆరాక కడిగేయండి. తేనె చర్మాన్ని తేమగా ఉంచితే, పెరుగు తాజాదనం అందిస్తుంది. ఇది పొడిచర్మతత్వం ఉన్నవారికి ఉపయోగపడుతుంది.

రెండు చెంచాల పెరుగులో చెంచా ముల్తానీమట్టి

రెండు చెంచాల పెరుగులో చెంచా ముల్తానీమట్టి

మొటిమలూ, వాటి తాలూకు మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా? రెండు చెంచాల పెరుగులో చెంచా ముల్తానీమట్టి కలిపి ముఖానికి పూతలా వేయండి. పదిహేను నిమిషాల తరవాత కడిగేసుకుంటే చాలు.

పెరుగూ, అరటిపండు గుజ్జూ

పెరుగూ, అరటిపండు గుజ్జూ

చెంచా చొప్పున పెరుగూ, అరటిపండు గుజ్జూ, కొద్దిగా గుడ్డుసొన కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ పూత చర్మాన్ని మెరిపించేలా చేస్తుంది.

 పెరుగులో ఒకటిన్నర చెంచా ఓట్‌మీల్‌పొడి,

పెరుగులో ఒకటిన్నర చెంచా ఓట్‌మీల్‌పొడి,

ఎండకారణంగా ముఖం నల్లగా మారిందా. చెంచా పెరుగులో ఒకటిన్నర చెంచా ఓట్‌మీల్‌పొడి, కొద్దిగా సెనగపిండి కలపాలి. దీన్ని ముఖం, మెడకూ పూతలా రాసి మృదువుగా మర్దన చేసి ఆరాక కడిగేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మార్పు కనిపిస్తుంది.

సన్ టాన్, జుట్టు సమస్యలు తగ్గిస్తుంది

సన్ టాన్, జుట్టు సమస్యలు తగ్గిస్తుంది

రోజంతా బయట గడిపేవారిపై ఎండ ప్రభావం ఉంటుంది. చర్మం నల్లగా మారడం, జుట్టు చిట్లడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటివారు పెరుగులో పావుకప్పు నిమ్మరసం, మూడు టేబుల్‌స్పూన్ల ఆలివ్‌నూనె కలిపి తలకు పట్టించాలి... ముఖానికీ పూతలా రాసుకోవాలి. అరగంటయ్యాక స్నానం చేయాలి. చిట్లిన జుట్టు సమస్య తగ్గుతుంది. చర్మం కాంతిమంతంగా మారుతుంది. పెరుగులోని జింక్‌, లాక్టిక్‌ యాసిడ్‌లే అందుకు కారణం.

English summary

What Happens When You Apply Curd On Your Skin?

When you have a good look at your complexion in the mirror and realise that you have to work on getting back a healthy radiant skin, your first impulse would be to go to the cosmetic store and buy makeup or chemical-based skin care products.
Desktop Bottom Promotion