మీ చర్మాన్ని క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది!

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

చర్మాన్ని తేమగా ఉంచుకోవటమనేది మీ దినచర్యలో అస్సలు వదిలేయకూడని పని. చర్మనిపుణులు చర్మసంరక్షణలో దీని ప్రాముఖ్యతను పదే పదే నొక్కి చెప్తారు. ఈ పని చర్మానికి కావాలసిన తేమను అందించటమే కాదు, చర్మానికి నీటి ప్రసరణను పెంచి, మళ్ళీ జీవం పోస్తుంది.

ఇంత ప్రాముఖ్యత ఉన్నా,మనలో చాలామంది క్రమం తప్పకుండా తమ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసుకోరు. మీరు కూడా వారిలో ఒకరైతే ఈనాటి వ్యాసం మీకోసమే. ఈ రోజు బోల్డ్ స్కైలో మీరు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసుకోకపోతే వచ్చే సమస్యలను తెలియచేస్తున్నాం.

what happens if you don't moisturise your skin

చర్మంపై తేమ లేకపోతే జరిగేది ఇదే

ఈ ముఖ్యమైన చర్మసంరక్షణ స్టెప్ ను వదిలేయటం వలన డ్యామేజింగ్ ప్రభావాలు అనేకం జరుగుతాయి. చర్మం మొత్తంమీద ఆరోగ్యంగా ఉండాలంటే తేమగా ఉండటం తప్పనిసరి.

మీరు చర్మాన్ని తేమగా ఉంచుకోకపోతే వచ్చే సమస్యలేంటో తెలుసుకోవటానికి చదవండి.

పొడి చర్మం

పొడి చర్మం

మీరు మాయిశ్చరైజర్ వాడకపోతే జరిగే మొదటిది చర్మం పొడిబారటం. ఈ ముఖ్యమైన చర్మసంరక్షణ పనిని వదిలేయటం వలన మీ చర్మం చాలా పొడిగా తయారవుతుంది.

ఇక మీరు ఊహించుకోవచ్చు, పొడిచర్మం ఎంత బాధపెడుతుందో. ఏ రుతువు అయినా, మాయిశ్చరైజర్ రాసుకోకపోతే మీకు ఈ చర్మ సమస్య వస్తుంది.

కన్పించే ముడతలు

కన్పించే ముడతలు

మాయిశ్చరైజ్ చేసుకోకపోతే వచ్చే మరో సమస్య ఇది. దీన్ని వదిలేయటం వలన మీ చర్మంపై సురక్షిత గోడను తొలగించినట్లవుతుంది మరియు వయస్సుకి ముందే ముడతలుపడి, గీతలు పడుతుంది.

చర్మాన్ని క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేసుకుని మీ అందాన్ని ముడతలు పడకుండా చేసుకోండి.

నిర్జీవమైన చర్మం

నిర్జీవమైన చర్మం

తేమలేకపోవటం వలన చర్మం జీవంలేకుండా తయారవుతుంది.మంచిగా మాయిశ్చరైజ్ అయిన చర్మం సహజంగానే కాంతివంతంగా ఉంటుంది. మరోవైపు తేమలేని చర్మం నిర్జీవంగా, డల్ గా ఉంటుంది.

క్రమం తప్పకుండా చర్మాన్ని తేమగా ఉంచుకుని దీని నుంచి బయటపడండి.

మొటిమలు రావటం

మొటిమలు రావటం

తేమ లేకపోవటం వలన పొడి చర్మం మాత్రమే కాక చూడటానికి అసహ్యంగా ఉండే మొటిమలు కూడా రావచ్చు.

మంచిగా మాయిశ్చరైజ్ అయిన చర్మంపై గ్రంథులు తెరచుకుని ఉండి మొటిమలు ఏర్పడకుండా ఉంటుంది, అదే మీ చర్మంపై తేమ లేకపోతే తీవ్రంగా మొటిమలు వచ్చి మీ చర్మాన్ని అనారోగ్యకరంగా చూపిస్తాయి.

పొరలుగా ఊడిపోయే చర్మం

పొరలుగా ఊడిపోయే చర్మం

తేమ లేని చర్మం పొరలుకట్టి తరచుగా ఊడిపోతుంది. అందరికీ తెలిసిన విషయమే, పొరలుగా ఊడిపోయే చర్మాన్ని సంరక్షించటం అంత సులభం కాదు.

అందుకని అలా ఊడిపోయే చర్మాన్ని నియంత్రించటానికి మాయిశ్చరైజర్ రాసుకోవటం మీ దినచర్యలో భాగం చేసుకోండి.

పాడవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది

పాడవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది

తేమలేని చర్మం సులభంగా పాడవటానికి వీలుగా మారుతుంది. ఇలాంటి చర్మం అలర్జీని కలుగచేసే పదార్థాలు, విషపదార్థాలు, ఫ్రీ రాడికల్స్, ఇన్ఫెక్షన్లు కలిగించే బ్యాక్టీరియా ఇలాంటివాటన్నిటికీ ఆవాసంగా మారుతుంది,

చర్మం పాడవకుండా నియంత్రించాలంటంటే మీ చర్మాన్ని అన్నివేళలా తేమతో ఉంచుకోవాలని మరోసారి గుర్తుచేయనవసరం లేదుగా!

కొల్లాజెన్ నష్టం

కొల్లాజెన్ నష్టం

సరిగా తేమ లేని చర్మంపై కొల్లాజెన్, ఎలాస్టిన్ పదార్థాలు కూడా నిలవవు. ఇలా జరగటం వలన మీ చర్మం వయస్సు మీరినట్లు, సాగినట్లు కన్పిస్తుంది.

మీ చర్మం కొల్లాజెన్ స్థాయిని నిలకడగా ఉంచటానికి ఈ చర్మసంరక్షణ స్టెప్ ను ఎప్పుడూ మర్చిపోకండి.

కఠిన చర్మం

కఠిన చర్మం

ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసుకోకపోవటం వలన వచ్చే మరో దుష్ప్రభావం.

తమ చర్మాన్ని సరిగా మాయిశ్చరైజ్ చేసుకోని మహిళలకు కఠిన చర్మం ఉంటుంది, అదే సమయంలో క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ రాసుకునే స్త్రీలకి మెత్తని, మృదువైన చర్మం ఉంటుంది.

ఎండిపోయిన చర్మం

ఎండిపోయిన చర్మం

ఎంతో అవసరమైన ముఖ్యమైన చర్మ సంరక్షణ స్టెప్ ను తప్పించేయటం చర్మంలో నీటిప్రసరణ లేకుండా చేస్తుంది.. ఇది మరిన్ని చర్మ సమస్యలకు దారితీసి, మీ చర్మ రూపాన్ని, సౌందర్యాన్ని నాశనం చేస్తుంది.

అందుకని క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ రాసుకుంటూ మీ చర్మాన్ని తేమగా ఉంచుకుంటూ ఈ చర్మసమస్యలన్నిటికీ స్వస్తిపలకండి.

English summary

What Happens When You Don’t Moisturize Your Skin

Moisturizing your skin is an essential skin care step that you should never skip. Skin care experts often emphasize on the importance of this essential step. Not only does it provide your skin with the much-needed moisture but also gives it a hydration boost and revitalizes it. But what actually happens if you don't apply a moisturizer? Read to know.