చర్మంపై ముడతలు ఏర్పడుటకు కారణం ఈ 13 చెడు అలవాట్లే !

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

చర్మసంరక్షణ విషయానికొచ్చేసరికి, తక్కువ నిజంగానే చాలా ఎక్కువ.

మీకు ఏం చేయాలో తెలుసుగా; మేకప్ ను తీసేసి, రోజూ మాయిశ్చరైజర్ రాసుకోండి. ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నా కూడా, మీరు కొన్ని సాధారణ పొరపాట్లు చేస్తుండవచ్చు, అవి మంచి కన్నా ఒక్కోసారి చెడు చేస్తాయి.

1.లైనర్ వేసుకునేటప్పుడు కంటిని పట్టి ఉంచడం

1.లైనర్ వేసుకునేటప్పుడు కంటిని పట్టి ఉంచడం

మాకు తెలుసు మీకు మీ కళ్ళు పర్ఫెక్ట్ గా కన్పించాలి, కానీ దాని కోసం మీ కంటి చుట్టూ ఉన్న సున్నితమైన చర్మంను కష్టపెట్టాలని కాదు. అతిగా లాగటం వలన ఆ చర్మం వాచినట్లయి, రక్తనాళాలు తెగి, ముడతలు వస్తాయి. “పట్టి ఉంచే అవసరం లేకుండా, అలా మెత్తగా కదిలే ఐ లైనర్లు వాడండి,”

2. ఒక ఫర్ఫెక్ట్ కాంబినేషన్లో యాంటీ-ఏజింగ్ ఉత్పత్తులన్నీ లభ్యమవుతాయనుకోవడం

2. ఒక ఫర్ఫెక్ట్ కాంబినేషన్లో యాంటీ-ఏజింగ్ ఉత్పత్తులన్నీ లభ్యమవుతాయనుకోవడం

చాలామంది చర్మసంరక్షణ గురించి ఆలోచించేవారు మేకప్ రిమూవర్, ఫేస్ వాష్, టోనర్, సెరం, మాయిశ్చరైజర్, ఫేస్ ఆయిల్, కంటి క్రీమ్, కంటి జెల్, సన్ స్క్రీన్ మరియు ముడతలను నింపే ఫిల్లర్ - ఇవన్నీ పర్ఫెక్ట్ చర్మం కోసం ప్రతి రోజూ వాడతారు. కానీ మనం అనుకునేట్టు అన్నీ అలానే జరగవు.

యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కి చెందిన డర్మటాలజీ అసోసియేట్ క్లినికల్ ప్రొఫెసర్ డా. మోనా గోహ్రా మాట్లాడుతూ "పెద్ద చర్మ సంరక్షణ పొరపాటు ఏం చేస్తారంటే తక్కువే చాలు అని గ్రహించరు," అని అన్నారు. "అందరూ ఈ ఉత్పత్తులన్నిటినీ వాడేస్తారు, దాని వల్ల చర్మం మంటకి గురై, వాస్తుంది," అలా వయస్సు మీరే లక్షణాలను మరింత వేగం చేస్తుంది. మరి మంచిది ఏమిటి? గోహ్రా సూచించేది, ముందుగా ప్రయత్నించిన - నిజమైన ఉత్పత్తులను వాడండని, మరియు రెటినాల్స్, యాంటిఆక్సిడెంట్లు ఇంకా ఎస్ పిఎఫ్ ఉన్న ఉత్పత్తులను వాడండి.

3.కార్లో ప్రయాణించేటప్పుడు ఎస్పిఎఫ్ ను దాటేయడం

3.కార్లో ప్రయాణించేటప్పుడు ఎస్పిఎఫ్ ను దాటేయడం

మీరు వాహనం లోపల ఉన్నంతమాత్రాన మీరు సురక్షితం అని అర్థం కాదుః యునైటెడ్ స్టేట్’స్ లో ఎడమవైపు చర్మ క్యాన్సర్లు మరియు ముడతలు చాలా సాధారణం ఎందుకంటే మీరు డ్రైవ్ చేసేటప్పుడు అటువైపు చర్మంవైపే ఎండ పడుతుంది. మీరు తరచుగా డ్రయివ్ చేసే వారైతే ప్రత్యేకంగా, లేకపోతే మామూలుగా కూడా ఎప్పుడూ సన్ స్క్రీన్ వాడండి.

4.ఆర్గానిక్ అని ఉన్న ప్రతిదీ మంచిది అనుకోవటం

4.ఆర్గానిక్ అని ఉన్న ప్రతిదీ మంచిది అనుకోవటం

అవును, ఆహారానికి సంబంధించినంతవరకు ఆర్గానిక్ పదార్థాలు మీ శరీరానికి చాలా మంచివి, కానీ మీ చర్మానికి అన్నివేళలా కాకపోవచ్చు. ‘ఆర్గానిక్’ ఉత్పత్తి అయినంతమాత్రాన అది తప్పక మీ ముడతలను, వయస్సు మీరే లక్షణాలను తొలగించేస్తుందనే భ్రమలో పడకండి- లేకపోతే అందులో అలర్జీనిచ్చే పదార్థాలు చూసుకోక లేనిపోని కష్టాలు తెచ్చుకుంటారు.”గోహ్రా మాట్లాడుతూ, “పాయిజన్ ఐవి సహజమైనది మరియు ఆర్గానిక్ కూడా, మీ చర్మానికి అస్సలు మంచిది కాదని అందరికీ తెలిసిందే.”

5.మేకప్ ను తొందరపాటుగా తీసేయడం

5.మేకప్ ను తొందరపాటుగా తీసేయడం

ప్రతిరాత్రి మీ మేకప్ తొలగించడం ముఖ్యం, కానీ మీరు మెల్లగా, నిదానంగా చేయాలి. కొంచెం మస్కారా మిగిలిపోయిందని రుద్దటమో, కంటి చుట్టూ చర్మాన్ని పట్టి లాగటమో అలాంటివి చేయవద్దు. “పొరపాటున మీరు రక్తనాళాలను విరిగేలా చేసి, వాచేలా చేస్తారు”,

6.బోర్లా పడుకోవడం లేదా పక్కకి తిరిగి పడుకోవడం

6.బోర్లా పడుకోవడం లేదా పక్కకి తిరిగి పడుకోవడం

“వెల్లకిలా పడుకోవడం వల్ల నిద్రతో వచ్చే ముడతలు రాకుండా ఉంటాయి,” బోర్లా పడుకోవటం మీకు ఇష్టమా? సాటిన్ దిండును వాడమని గోహ్రా సూచిస్తున్నారు – అవి కాటన్ దిండ్ల కన్నా మెత్తగా ఉండి చర్మాన్ని పాడుచేయవు.

7.మరీ ఎక్కువగా శుభ్రం చేయడం

7.మరీ ఎక్కువగా శుభ్రం చేయడం

ఒక ఒత్తిడికరమైన రోజు తర్వాత మీరు మీ చర్మంపై పట్టిన మురికి, జిడ్డు, దుమ్ము అంతా వదిలించుకుని చర్మాన్ని శుభ్రం చేసుకోవాలనుకుంటారు, కానీ ఈ పనే మీ యవ్వన సౌందర్యాన్ని, కాంతిని తగ్గించవచ్చు. “ చర్మం బాగా శుభ్రపడాలని కఠినమైన సబ్బును వాడటం వలన, అది మీ చర్మపు సహజ నూనెలను కూడా లాగేసి గీతలు, ముడతలు వచ్చేలా చేస్తుంది.” సున్నితమైన సబ్బునే వాడండి మరియు రుద్దవద్దు- మీ చర్మం బ్రతికిపోతుంది.

8.మొదలుపెట్టిన ఉత్పత్తులను త్వరగా వాడటం మానేయడం

8.మొదలుపెట్టిన ఉత్పత్తులను త్వరగా వాడటం మానేయడం

మీరు ఎప్పుడైనా ఒక కొత్త ఉత్పత్తి మొదలుపెట్టి, ఫలితాలు అంతగా కన్పించక,కొన్ని వారాలకే దానిని వాడటం మానేద్దామని అనుకున్నారా? దురదృష్టవశాత్తూ, దాని లాభాలు కన్పించేముందే మీరు వదిలేస్తున్నారేమో,

ప్రైస్టోవస్కీ వివరిస్తూ "విషయం ఏంటంటే, ఆ క్రీములు ఏమన్నా తేడా చూపించటానికి కొన్ని నెలల సమయం పడుతుంది." "అందుకని చర్మాన్ని అది పాడుచేయనంతవరకూ, కొత్తది కొనకుండా పాతదాన్ని వాడండి." ఈ చిట్కా మన చర్మానికి మరియు వాలెట్లకి ఉపయోగకరం కదూ? అవును,నిజమే.

9.వయస్సు మీరే లక్షణాలు రాకుండా ఒక ‘అద్భుత ఉత్పత్తి’పై ఆధారపడటం

9.వయస్సు మీరే లక్షణాలు రాకుండా ఒక ‘అద్భుత ఉత్పత్తి’పై ఆధారపడటం

చర్మాన్ని చక్కగా ఉంచుకోటానికి ఒక ఉత్పత్తి లేదా ఒక చిట్కా మాత్రమే లేదు- అదొక జీవనవిధానం. మీ ఆహారపు అలవాట్లు మరియు నిద్ర అలవాట్లు, వ్యాయామం, ఎండలో తిరిగే సమయం ఇవన్నిటిపై ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న క్రీము లేదా సిరం మీ చర్మ సమస్యలన్నిటినీ తీర్చేయలేవు.

10.కంప్యూటర్ స్క్రీన్ కు మరీ దగ్గరగా కూర్చోటం

10.కంప్యూటర్ స్క్రీన్ కు మరీ దగ్గరగా కూర్చోటం

స్క్రీన్ ను చూడటానికి అనుక్షణం కళ్ళు చిట్లించి చూడటం, మెడను వంచటం వలన కళ్ళచుట్టూ సన్నని ముడతలు వస్తాయి. అందుకని 1 ½ నుంచి 2 అడుగుల దూరంలో మీ కంటికి ఎలా సౌకర్యంగా ఉంటే అలా కూచోండి. మీ మెడను నిటారుగా వుంచి, మెడపై అడ్డగీతలు రాకుండా చూసుకోండి. ప్రైస్టోవ్స్కీ గంటకి రెండు మూడు సార్లు బ్రేక్ తీసుకుని కాళ్ళూ చేతులు కదిలించి సరిగా కూచోమని చెప్తున్నారు. రోజంతా కూడా మధ్యమధ్యలో కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉండటం మంచిది.

11.ఏడాదికోసారి కంటి చెకప్ దాటవేయడం

11.ఏడాదికోసారి కంటి చెకప్ దాటవేయడం

మీ కంటి చూపు ఏమాత్రం మారలేదని అన్పిస్తే చాలు, కంటి పరీక్ష చేయించుకోవడం మానేస్తారు. కానీ మీ కంటిచూపును సరిచేయకపోతే కనుబొమ్మల దగ్గర గీతలు వస్తాయి. అందుకని మీ కంటిపరీక్షను ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉండండి.

12.సిగరెట్లు కాల్చడం

12.సిగరెట్లు కాల్చడం

ఈపాటికి అందరికీ శరీరానికి పొగతాగడం మంచిది కాదని, అందాన్ని కూడా పాడుచేస్తుందని తెలుసుకున్నారు, కానీ 42.1 మిలియన్ల అమెరికన్లు ఇప్పటికీ సిగరెట్లు కాలుస్తారని తేలింది, దానివలన ప్రతి ఏడాదికి 480,000 మరణాలు సంభవిస్తున్నాయి. సిగరెట్లు మానేయండి – మీ శరీరం, చర్మం మరియు మిమ్మల్ని ప్రేమించేవారు నిజంగా మీకు థాంక్స్ చెప్తారు.

13.సన్ స్క్రీన్ రాసుకోకపోవడం

13.సన్ స్క్రీన్ రాసుకోకపోవడం

చాలామందికి దీర్ఘకాల చర్మసంరక్షణకి ఎస్ పిఎఫ్ ఎంత ముఖ్యమో తెలుసు, కానీ ఇంకా అందులో కూడా ఎక్కువమందే అక్కడక్కడ కొంచెం కమిలి ఉంటే ఫర్వాలేదని సన్ స్క్రీన్ రాసుకోకుండా వదిలేస్తారు. “వయస్సు మీరుతున్న లక్షణాలలో ఎక్కువశాతం చర్మాన్ని సరిగా రక్షించుకోకపోవటంతోనే వస్తాయి”, “అందుకని సన్ స్క్రీన్ వేసుకోకపోవటం వలన, మీరు నిజానికి వయస్సు మీరటాన్ని వేగవంతం చేస్తున్నారు.”

English summary

13 Really Bad Habits That Cause Wrinkles

You know the drill: Wash off your makeup and apply moisturizer daily. But despite those healthy habits, you're probably making some pretty common mistakes that might do more harm than good.