అందాన్ని ఇనుమడింపజేయడానికి గ్రీన్ టీని ఎలా వాడాలి? గ్రీన్ టీ DIY ఫేషియల్ గైడ్

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

గ్రీన్ టీ ని తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. గ్రీన్ టీ మీ అందాన్ని ఇనుమడింపజేయడానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? అవును, ఈ అద్భుతమైన పదార్థంను స్క్రబ్, మాస్క్, క్లెన్సర్ మొదలైన వాటి తయారీలో వినియోగిస్తారు.

యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నందున ఇది వయస్సు పైబడిన ఛాయాలను తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైస్ చేసి, ఎండ దెబ్బ నుండి కాపాడి, కొల్లాజన్ ఉత్పత్తి చేసిచర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.

ఈ మధ్య కాలంలో సౌందర్య నిపుణులు మరియు బ్యూటీ క్లినిక్ లలో గ్రీన్ టీ మస్కులను ఎక్కువగా సిఫార్సు చేయడం వలన, గ్రీన్ టీ ప్రయోజనాల గురించి ప్రతిఒక్కరికి తెలియవచ్చింది.

 3-Step DIY Green Tea Facial Guide

అన్ని చర్మ సమస్యలకు గ్రీన్ టీ ఏకైక నివారణ అని చెప్పొచ్చు. ఇంట్లో కూర్చుని మచ్చలేని చర్మాన్ని పొందగలిగితే, అంతకన్నా ఇంకేమి కావాలి? ఇప్పుడు మనం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉండే చర్మం గ్రీన్ టీతో ఫేషియల్ ఎలా చేసుకోవాలో ఒక్కో అడుగు క్షుణ్ణంగా తెలుసుకుందాం.

1. క్లెన్సింగ్: ఇది ఫేషియల్ క్రమంలో ఇది మొదటి అడుగు.ఇలాక్ఆ చేయటం వలన ముఖం మీద పేరుకున్న మురికి, జిడ్డు మరియు ఇతర మలినాలు తొలగి చర్మం శుభ్రపడుతుంది.

ఎలా చేసుకోవాలి: క్లెన్సింగ్ కు మీకు కావలసినదల్లా కొంచెం గ్రీన్ టీ మరియు కొంచెం రోజ్ వాటర్. కొంత గ్రీన్ టీని తీసుకుని ఫ్రిజ్ లో పెట్టి చల్లబరచండి.దీనికి కొంచెం రోజ్ వాటర్ కలపండి. ఈ ద్రావణంతో ముఖానికి రెండు నిమిషాలు వలయాకారంలో మర్దన చేసుకోండి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే మీ రెండో అడుగు పూర్తైనట్లే.

2. స్క్రబ్బింగ్: క్లెన్సింగ్ తరువాత స్క్రబ్బింగ్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ వలన ముఖం మీద పేరుకున్న మృతకణాలు తొలగి చర్మం తేటుగా కనిపిస్తుంది.

ఎలా చేసుకోవాలి: ఒక గిన్నెలో, ఒక టేబుల్ స్పూన్ పంచదార, 2-3 టేబుల్ స్పూన్ల కాచిన గ్రీన్ టీ తీసుకుని, దీనికి తేమనందించడానికి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలపాలి. ఈ మిశ్రమంతో ముఖానికి 5-6 నిమిషాలు వలయాకారంలో మర్దన చేసుకోండి. ఈ ప్రక్రియ వలన మృతకణాలు తొలగి చర్మం మృదువుగా, మెరుస్తుంది. ఐదు నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. ఫేస్ మాస్కు: మీరు ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. ఇది చాలా కీలకమైన ప్రక్రియ. మాస్కుల వలన చర్మానికి తేమ అంది మెరుగ్గా తయారవుతుంది. ఇప్పుడు మీకు కొన్ని గ్రీన్ టీ ఫేస్ మాస్కుల గురించి వివరిస్తున్నాం

గ్రీన్ టీ మరియు తేనె ఫేస్ ప్యాక్:

ఎలా తయారు చేసుకోవాలి: ఒక గిన్నెలో 2-3 టేబుల్ స్పూన్ల కాచిన గ్రీన్ టీ తీసుకుని, దానికి 1ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఈ మాస్కుతో ముఖానికి మృదువుగా వలయాకారంలో మర్దన చేసుకోండి. దీనిని పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి కడిగేయండి. తేనెలోని మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. దీనిని గ్రీన్ టీ తో కలిపినప్పుడు చర్మానికి తేమ అందటమే కాక మెరుస్తుంది.

గ్రీన్ టీ మరియు పెరుగు ఫేస్ ప్యాక్:

ఎలా చేసుకోవాలి: ఒక టీ బ్యాగ్ ను తీసుకుని వేడి నీటిలో ముంచండి. అది చల్లబడే వరకు వేచి ఉండండి. చల్లబడ్డాక టీ బ్యాగ్ ను తెరచి ఆకులను ముఖమంతటా పూసుకోండి. మరీ గట్టిగా రుద్ధకండి. కళ్ళకు తగలనివ్వకండి.

పదినిమిషాల తరువాత తేయాకులు అద్దిన ముఖమంతటా పెరుగు రాసుకోండి. మరొక పది నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ సులువైన గ్రీన్ టీతో మీ ఇంట్లోనే చేసుకునే ప్రక్రియలు మీ చర్మం పై అద్భుతాలు చేస్తాయి. క్రమం తప్పకుండా పై జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే 1-2 నెలలో మీరే గొప్ప మార్పును కనిపెడతారు.

English summary

3-Step DIY Green Tea Facial Guide

Green tea can help you gain beauty in the form of a scrub, mask, cleanser, etc. It is best known as an antioxidant that tightens the skin and protects it from free radicals. It exfoliates the skin, thus making it look brighter. There are 3 simple steps - Step 1: Cleansing; Step 2: Scrubbing and Step 3: Facial Mask.
Story first published: Monday, April 9, 2018, 14:00 [IST]