Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
మొటిమలను గిల్లకూడదని చెప్పడానికి వెనుక దాగి ఉన్న నాలుగు ప్రధాన కారణాలు!
మొటిమలను గిల్లకూడదని చెప్పడానికి వెనుక దాగి ఉన్న నాలుగు ప్రధాన కారణాలు!
ఎటువంటి సమస్య లేని చర్మం మనలో ప్రతిఒక్కరు కలిగి ఉండటం సాధ్యం కాదనేది వాస్తవం. నిజానికి, మనలో చాలామంది, యుక్తవయసులో మొటిమల సమస్యను ఎదుర్కున్నవారే! కానీ కొందరిలో ఈ సమస్య అనేక సంవత్సరాల పాటు కొనసాగుతూనే ఉంటుంది.
మనని అధికంగా ఇబ్బంది పరచే విషయం ఏమిటంటే, కొన్నిసార్లు ఏదైనా పార్టీకి లేదా డేట్ కు వెళ్ళేటప్పుడు, ఈ మొటిమలు మరీ కొట్టొచ్చేటట్లు కనిపిస్తాయి. అటువంటప్పుడు, మీరు ఏమి చేస్తారు? మొటిమలను గిల్లేస్తే, అవి కనపడకుండా పోతాయని మీరునుకుంటే, మీరు పప్పులో కాలేసినట్లే!

ఒక మొటిమను గిల్లడమే మనం తీసుకోవాల్సిన తక్షణ చర్యగా కనిపించినప్పటికిని, దాని పర్యవసానాలు చాలా రకాలుగా ఉండవచ్చు. మొటిమలను గిల్లరాదని మీ తల్లులు మరియు చర్మవ్యాధినిపుణులు పలుమార్లు హెచ్చరించినప్పటికిని, అసలు ఎందుకు మొటిమలను గిల్లకూడదు? అనేది మీకొక పెద్ద సందేహం.
అసలు మొటిమలను ఎందుకు గిల్లకూడదో తెలిపే 5 ప్రధాన కారణాలు ఇక్కడ మీ కోసం అందిస్తున్నాము.

1. వాపు అధికమవుతుంది:
తైల గ్రంథి పూడుకుపోవడం వలన మొటిమ ఏర్పడుతుంది. అదనపు తైలం, బ్యాక్టీరియా, మృతచర్మకణాలు, మరియు చీములతో మీ చర్మంరంధ్రం నిండినప్పుడు, అది వాపుకు దారి తీస్తుంది. చర్మరంధ్రం ఇప్పటికే చాలా ఒత్తిడికి గురై ఎర్రబడిఉంటుంది. దానిని మీరు గిల్లినప్పుడు, ఒత్తిడి మరీంత ఎక్కువై, లోపల ఉన్న పదార్థాలు అన్నీ తైల గ్రంథి గోడను చీల్చుకుని బయటపడతాయి. కొన్నిసార్లు ఈ పదార్థాలు డెర్మీస్ (చర్మం యొక్క అంతర్గత భాగం) లోకి చొరబడతాయి.
ఇప్పుడు మీ చర్మం బాగుంది అని మీరు అనుకుంటారు కానీ, మీరు చర్మరంధ్రాన్ని తెరుచుకునేలా చేసి లోపలి పదార్థాలు బయటకు పోయేలా మాత్రమే చేయగలిగారు. కానీ చీమును బయటకు పిండే సమయంలో, సూక్ష్మక్రిములను మరియు బ్యాక్టీరియాను ఇంకా లోతుగా డెర్మీస్ లోనికి నెట్టడం జరుగుతుంది.

2. కురుపులకు దారితీస్తుంది:
మీరు ఒక మొటిమను చిదిమినప్పుడు, విడుదల అయిన చీము ఒక చర్మ వ్యాధిని ఏర్పరుస్తుంది. దీనిని కన్సీలర్ తో దాచడానికి కూడా వీలుపడదు. అంతేకాక, ఇది దురదను కూడా కలిగించవచ్చు. ఆపై అది ఒక సమస్యా వలయంగా మారుతుంది.
మీరు ఒక మొటిమను పిండి వేసినప్పుడు, మీ చర్మం ఎర్రబడి వాపు వస్తుంది. దీని కన్నా మొటిమను దాని మానాన వదిలేయడం మంచిది. ఇది కేవలం దానికి దారి తీస్తుంది. మీరు సాధారణ మొటిమను గిచ్చడం వలన మచ్చ ఏర్పడుతుంది. ఇది చర్మంలోకి లోతుగా, ఎరుపుగా, గట్టిగా మరియు నొప్పితో కూడుకున్న కురుపుగా మారవచ్చు.

3. ఇన్ఫెక్షన్ కు దారితీయవచ్చు:
మీరు ఒక మొటిమను గిల్లినప్పుడు, బాక్టీరియాను చర్మంలోకి లోతుగా నెట్టడం జరుగుతుందని తెలుసుకోవాలి. అంతేకాక మొటిమలు తెరుచుకునప్పుడు, దాని లోనికి కాలుష్య కారకాలు ప్రవేశిస్తాయి. గిల్లేటప్పుడు, మీ చేతులు శుభ్రం లేకపోతే, మరీంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మొటిమలను గిల్లడం వలన అవి మరింత వ్యాప్తి చెంది, సమస్యను మరీంత తీవ్రతరం చేస్తుంది. అందువల్ల, మీ చేతులను మీ చర్మానికి దూరంగా ఉంచడమే, ఉత్తమమైన మార్గం.

4. శాశ్వతమైన్ మచ్చలను ఏర్పరుస్తుంది:
మీరు ఒక మొటిమను సరిగ్గా చిదమకపోతే, తప్పనిసరిగా మచ్చలు ఏర్పడతాయి. కొన్ని మచ్చలు కాలంతో పాటు మాయమైతే, కొన్ని మచ్చలు శాశ్వతంగా నిలిచిపోతాయి. మొటిమలు మానుతున్నప్పుడు, మచ్చలు ఏర్పడతాయి. మీ చర్మం దెబ్బతిన్న ప్రతిసారీ, చర్మం సాధారణ స్థితికి చేరుకునే ప్రయత్నం చేసినప్పటికీ, కొంతమేరకు కణజాలం దెబ్బతింటుంది. అందువల్ల, ముఖం మీద గుంటలు కూడా ఏర్పడతాయి.
చర్మం దెబ్బతినడం ఎక్కువయ్యే కొద్దీ, కణజాల నష్టం కూడా పెరుగుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, మొటిమను గిల్లడం వలన వాపు ఏర్పడుతుంది మరియు మొటిమలను నయం చేసే ప్రక్రియ పోస్ట్-ఇన్ఫ్లమేటరీ హైపెర్పిగ్మెంటేషన్ కు దారి తీస్తుంది.



Click it and Unblock the Notifications