For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నల్లమచ్చలను ప్రభావవంతంగా పరిష్కారించుకోవడానికి ఐదు గృహ చికిత్సా పద్ధతులు

నల్లమచ్చలను ప్రభావవంతంగా పరిష్కారించుకోవడానికి ఐదు గృహ చికిత్సా పద్ధతులు

|

మీరు ఎంతో ఖర్చు పెట్టి మార్కెట్ నుండి కొనుక్కొచ్చిన డార్క్ స్పాట్ రిమూవర్ మిమ్మల్ని నిరుత్సాహపరచిందా? మనందరికీ ఏదో ఒక సమయంలో ఈ అనుభవం ఎదురై ఉంటుంది ఎందుకంటే నల్లమచ్చలను తగ్గిస్తాయని చెప్పుకునే వాణిజ్య ఉత్పత్తులు చాలావరకు ప్రభావవంతంగా ఈ మచ్చలను తెలికపరచవు.

అంతేకాక, ఈ ఉత్పత్తులలో ఉండే హానికారక రసాయన మంచి కన్నా ఎక్కువ చెడు చేసే అవకాశం ఉంది.కనుకనే, చాలామంది ఈ ఉత్పత్తుల కన్నా మన ఇంట్లో సులభంగా లభించే పదార్ధాలతో, సురక్షితంగా మరియు ప్రభావవంతంగా సమస్యను పరిష్కారించుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు.

5 Easy And Effective Homemade Treatments For Dark Spots

మీకు కనుక ఈ గృహ చికిత్సా పద్ధతుల పై అవగాహన లేనట్లయితే, ఆ సమాచారం మీ కోసం మేము అందిస్తున్నాము. బోల్డ్ స్కై ద్వారా మేము, నల్లమచ్చల నివారణకు ఉపయోగపడే పదార్థాల జాబితాను సిద్ధం చేసాం. చదివి, తెలుసుకోండి!

చాలాసార్లు సూర్యుని ప్రభావం వలన, మెలనిన్ అధికంగా ఉత్పత్తి అవడం మూలాన నల్లమచ్చలు ఏర్పడతాయి. వీటిని సులభంగానే తొలగించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం, రండి!

1. పసుపు పేస్టు:

1. పసుపు పేస్టు:

అనాదిగా పసుపును నల్ల మచ్చల నివారణకు వాడుతున్నారు. పసుపులో ఉండే కుర్కుమిన్ పిగ్మెంటేషన్ ను సమర్ధవంతంగా ఎదుర్కుంటుంది.

వాడే విధానం:చిటికెడు పసుపును ఒక టీ స్పూన్ పచ్చిపాలతో కలిపి మచ్చలపై రాయండి. పదిహేను నిమిషాల తరువాత నీటితో కడిగేయండి.ఇలా రోజుకు పలుసార్లు చేయడం వలన ఫలితాలు త్వరగా పొందవచ్చు.

2. నిమ్మరసం:

2. నిమ్మరసం:

మచ్చలు నివారణకు నిమ్మరసం వాడటం ప్రసిద్ధిలో ఉన్న పరిష్కారం. నిమ్మరసం బ్లీచింగ్ ఏజంట్ గా పనిచేసి నల్లమచ్చలను తొలగిస్తుంది. నిమ్మరసం పలు చర్మ సమస్యలను అద్భుతంగా నివారిస్తుంది.

వాడే విధానం: నిమ్మరసంలో దూది ఉండను ముంచి మచ్చలున్న ప్రదేశంలో రాసుకోవాలి. నిమ్మరసంను మచ్చలు తగ్గించే వివిధ స్క్రబ్లు మరియు మాస్కుల తయారీలో వాడవచ్చు. ప్రభావవంతమైన పరిష్కారానికి ఈ పద్ధతిని తరచుగా ఆచరించండి.

3. గంధం మాస్కు:

3. గంధం మాస్కు:

గంధం పొడిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గంధం పొడిలో రోజ్ వాటర్ కలిపి రాసుకుంటే మీ చర్మం పై నల్లని మచ్చలు తగ్గుముఖం పడతాయి.

వాడే విధానం: అర టీ స్పూన్ గంధం పొడిలో రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముద్దగా చేయండి. ఈ ముద్దను ముఖమంతటా రాసుకుని పది నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుంది.

4. బంగాళదుంపల రసంతో చికిత్స:

4. బంగాళదుంపల రసంతో చికిత్స:

బంగాళదుంపల రసంలో ఉండే బ్లీచింగ్ ఏజంట్లు నల్లని మచ్చల చికిత్సలో సహాయపడతాయి.

వాడే విధానం: తాజా బంగాళదుంపల రసంలో దూది ఉండను ముంచి మచ్చలున్న ప్రదేశంలో రాసుకుని రాత్రంతా వదిలేయాలి. పొద్దుట లేచాకా, చల్లని నీటితో కడిగేయండి. ప్రతి రోజు ఇలా చేస్తే, నల్లని మచ్చలు తేలిక అవుతాయి.

5. పెరుగు:

5. పెరుగు:

పెరుగులో లాక్టిక్ ఆమ్లం, మచ్చలపై అద్భుత ప్రభావం చూపిస్తుంది.

వాడే విధానం: పెరుగును ముఖమంతటా దట్టంగా రాసుకుని 30-35 నిమిషాలు పాటు ఆరనివ్వండి. తరువాత గోరువెచ్చని నీళ్లతో కడుక్కోండి. ఈ పద్ధతిని పదేపదే వాడటం వలన మచ్చలు త్వరగా మాయమవుతాయి.

English summary

5 Easy And Effective Homemade Treatments For Dark Spots

Often, a result of excess production of melanin or sun damage, dark spots can be effectively treated with homemade treatments. These treatments include turmeric paste, lemon juice, mask made of sandalwood, potato juice, or even yogurt. These ingredients work well for helping you get rid of those unsightly dark spots.
Desktop Bottom Promotion