TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
వివిధ రకాల చర్మ సమస్యలను తొలగించే సమర్థవంతమైన 7 కిచెన్ ఇంగ్రీడియెంట్స్
ఖరీదైన బ్యూటీ ప్రోడక్ట్స్ ని వాడటం ద్వారా చర్మ సమస్యల నుంచి రక్షణ లభిస్తుందనుకుంటే పొరపాటే. ఇవి మీ జేబులకు చిల్లులు చేయడంతో పాటు మీ చర్మంపై కొన్ని రకాల ప్రతికూల ప్రభావాలను కూడా చూపిస్తాయి.
సాధారణంగా, మొటిమలు, బ్లాక్ హెడ్స్, లార్జ్ పోర్స్, డార్క్ సర్కిల్స్ వంటి కొన్ని రకాల చర్మ సమస్యలను తొలగించేందుకై చాలా మంది మార్కెట్ లో లభ్యమయ్యే సౌందర్య సాధనలపై ఆధారపడతారు. వీటిని వాడే బదులు, మీ కిచెన్ కేబినెట్ ను ఒక్కసారి బాగా పరిశీలిస్తే ఈ చర్మసమస్యలకు చక్కటి రెమెడీస్ లభ్యమవుతాయి. తద్వారా, మీ అందంపై ప్రతికూల ప్రభావం చూపే ఈ చర్మసమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఈ రోజు బోల్డ్ స్కై లో చర్మ సమస్యల నుంచి రక్షణని అందించే అటువంటి శక్తివంతమైన బ్యూటీ ఇంగ్రీడియెంట్స్ గురించి తెలుసుకుందాం. అదృష్టవశాత్తూ, ఇవన్నీ మీ కిచెన్ లో సాధారణంగా లభ్యమయ్యే పదార్థాలే. ఇవి, మార్కెట్ లో లభించే కమర్షియల్ ప్రాడక్ట్స్ కంటే అత్యద్భుతంగా పనిచేస్తాయి.
కాబట్టి, ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవడం ద్వారా ఇటువంటి అద్భుతమైన బ్యూటీ ఇంగ్రీడియెంట్స్ గురించి తెలుసుకుని వాటిని సరైన విధంగా ఉపయోగించడం ద్వారా వివిధ చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
1. లార్జ్ పోర్స్ ని నివారించే ఎగ్ వైట్
ఎగ్ వైట్ లో స్కిన్ బెనెఫిటింగ్ ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి. లార్జ్ పోర్స్ ని శుభ్రపరచి వాటిని మూసివేసే సామర్థ్యం ఎగ్ వైట్ కు కలదు.
ఎలా వాడాలి:
ఎగ్ వైట్ ని పేషియల్ స్కిన్ పై ఒక సన్నటి పొరలా అప్లై చేయండి. ఈ పొరని సహజంగా ఆరనివ్వండి. ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోండి. వారానికొకసారి ఈ విధంగా అప్లై చేయడం ద్వారా గొప్ప ఫలితాలను పొందవచ్చు.
2. డార్క్ సర్కిల్స్ ని నివారించే కుకుంబర్:
యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కుకుంబర్ లో పుష్కలంగా లభిస్తాయి. అందువలన, కంటి కింద నల్లటి వలయాలను తొలగించే సామర్థ్యం కుకుంబర్ కు కలదు.
ఎలా వాడాలి:
రెండు సన్నటి కుకుంబర్ స్లైసెస్ ను తీసుకుని మూసివున్న కనురెప్పలపై అమర్చండి. 20-25 నిమిషాల తరువాత ఈ స్లైసెస్ ను తొలగించి గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రపరుచుకోండి. బెస్ట్ రిజల్స్ట్స్ కోసం ఈ కిచెన్ ఇంగ్రీడియెంట్ ని రోజుకు మూడు నాలుగు సార్లు వాడాలి.
3. స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారించే పొటాటోస్:
పొటాటోలో సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్స్ కలవు. ఇవి స్కిన్ పిగ్మెంటేషన్ ను తగ్గించేందుకు సమర్థవంతంగా పనిచేస్తాయి.
ఎలా వాడాలి:
పొటాటో రసంతో చర్మాన్ని రిన్స్ చేయాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో చర్మాన్నిశుభ్రపరచుకోవాలి. ఈ పద్దతిని వారానికి రెండుసార్లు పాటించడం ద్వారా మంచి రిజల్స్ట్స్ ని పొందవచ్చు.
4. డెడ్ స్కిన్ ని తొలగించే బేకింగ్ సోడా:
బేకింగ్ సోడా శక్తివంతమైన ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది.
ఎలా వాడాలి:
అర టీస్పూన్ బేకింగ్ సోడాను రెండు టీస్పూన్ల నీళ్ళల్లో కలిపి ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేయాలి. ఆ తరువాత రెండు లేదా మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రపరచుకోవాలి. వారానికొకసారి ఈ హోంమేడ్ పేస్ట్ ను వాడటం వలన స్కిన్ పోర్స్ లో పేరుకున్న డెడ్ స్కిన్స్ తొలగిపోతాయి.
5. సన్ ట్యాన్ ని నివారించే టమాటో:
టమాటోలో హీలింగ్ ప్రాపర్టీస్ పుష్కలంగా లభిస్తాయి. అందువలన, సన్ ట్యాన్ ని తగ్గించడంలో మార్కెట్ లో లభ్యమయ్యే బ్యూటీ ప్రాడక్ట్స్ కంటే అద్భుతంగా పనిచేస్తుంది.
ఎలా వాడాలి:
తాజా టమాటా పల్ప్ ని తీసుకుని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. పదిహేను నుంచి ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ రెమెడీని వారానికి రెండు లేదా మూడు సార్లు పాటించడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు.
6. యాక్నే బ్రేక్ అవుట్స్ ని అరికట్టే టర్మరిక్ పౌడర్:
ఈ ఏజ్ ఓల్డ్ రెమెడీ ద్వారా యాక్నే సమస్యను ప్రభావవంతంగా అరికట్టవచ్చు. నిజానికి, ఈ రెమెడీ కెమికల్ బ్యూటీ ప్రాడక్ట్స్ కంటే సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ నేచురల్ ఇంగ్రిడియెంట్ ని తరచూ వాడటం ద్వారా యాక్నే బ్రేక్ అవుట్స్ ని నివారించవచ్చు.
ఎలా వాడాలి:
చిటికెడు టర్మరిక్ పౌడర్ ని ఒక టీస్పూన్ రోజ్ వాటర్ లో కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేషియల్ స్కిన్ పై అప్లై చేయాలి. అయిదు నుంచి పది నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరచుకోవాలి.
7. ఆయిలీ స్కిన్ సమస్యను నివారించే శెనగ పిండి:
యాంటీఆక్సిడెంట్స్ శెనగపిండిలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మంలోనున్న అదనపు నూనెని తొలగించడం ద్వారా జిడ్డులేని చర్మాన్ని అందిస్తాయి.
ఎలా వాడాలి:
అర టీస్పూన్ శెనగపిండిని ఒక టేబుల్ స్పూన్ నీటిలో కలిపి ఓ మిశ్రమాన్ని తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి పదినిమిషాల తరువాత తేలికపాటి ఫేస్ వాష్ తో అలాగే గోరువెచ్చటి నీటితో శుభ్రపరచుకోవాలి.