For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దోసకాయ రసం కలుగజేసే ఎనిమిది అద్భుత చర్మ సౌందర్య ప్రయోజనాలు.

|

దోసకాయ వేసవిలో విరివిగా ఉపయోగించే కూరగాయ అయినప్పటికీ, అది ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. తక్షణమే సలాడ్ తయారీ కోసం లేదా అలానే తినడం కోసం, లేదా జ్యూస్ తయారు చేయడం కోసం ప్రతిఒక్కరు దోసకాయను రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచుకుంటారు.

దోసకాయ రసం అమృతంలా మీ ఆరోగ్య, చర్మ మరియు కేశ సంరక్షణలో మీకు సహాయమందిస్తుంది. అన్ని సహజ చర్మ పరిష్కారాలలో, దోసకాయ చాలాకాలంగా విశేష పాత్ర పోషిస్తుంది.

విటమిన్ సి, విటమిన్ కె, ఫాస్పరస్, మెగ్నీషియం, బి -6, రిబోఫ్లావిన్, ఇనుము, సిలికా, ఫోలేట్, కాల్షియం మరియు జింక్ సమృద్ధిగా కలిగి ఉన్న దోసకాయ మీ ఆరోగ్యం మరియు చర్మంపై అద్భుతాలు చేస్తుంది.

సౌందర్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, దోసకాయ రసం త్రాగటం వల్ల మీరు లోపలినుండి ఆరోగ్యకరమైన చర్మం పొందగలరు మరియు దాని చర్మంపై బాహ్యంగా ఉపయోగించడం వలన దాని సౌందర్య పరిరక్షణ విలువను రెట్టింపు చేసుకుంటుంది.

మీ కళ్ళ మీద చల్లగా ఉండే దోసకాయ ముక్కలు ఉంచడం వల్ల నల్లని వలయాలు మరియు కళ్ళు ఉబ్బడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో ఉన్న విటమిన్లు మరియు ఖనిజాలు మీ చర్మంలో చైతన్యం నింపుతాయి.

దోసకాయలో ఉన్న అధిక యాంటీఆక్సిడెంట్లు, చర్మంపై ఎరుపుదనం మరియు మచ్చలను తొలగించడమే కాకుండా, శరీరంలో మంటను తగ్గించగలవు.

దోసకాయ అంతులేని ప్రయోజనాల కలిగివుంది. మీ కొరకు ఇప్పుడు దోసరసం అందించే అద్భుతమైన చర్మ ప్రయోజనాలను మీకోసం అందిస్తున్నాం. చదవండి ఇక!

1. చర్మాన్ని పునరుత్తేజితం చేస్తుంది

1. చర్మాన్ని పునరుత్తేజితం చేస్తుంది

దోసకాయ రసంతో మీ చర్మంకు తాజాదనం అందించి, పునరుత్తేజితం చేయడానికి ఒక సులభమైన మార్గం, మీకోసం:

• ఒక దోసకాయ చెక్కు తీసి, గింజలను వేరుచేయండి. కలబంద ఆకులోని గుజ్జును వేరుచేయండి.

• ఇప్పుడు రెండింటిని కలిపి బ్లెండర్లో 3 నుండి 5 నిముషాలు పాటు బ్లెండ్ చేసి, ముఖంపై పూసుకోండి.

• ముప్ఫై నిమిషాల పాటు ఆరనిచ్చి నీటితో కడిగేయాలి.

• ఇలా వారానికి ఒకసారి చేస్తే మీ చర్మం పునరుత్తేజితం అవుతుంది.

2. మేనిఛాయను తెలికపరుస్తుంది:

2. మేనిఛాయను తెలికపరుస్తుంది:

దోసకాయ మేనిఛాయను తెలికపరిచే ప్రభావాలకు ప్రసిద్ధి చెందింది. యాంటీ ఆక్సిడెంట్లు మరియు సిలికా సమృద్ధిగా ఉన్నందున, చర్మం యొక్క రంగు తేలికబడి తాజాగా మారుతుంది.

• దోసకాయపై చెక్కు తీసి, బ్లెండ్ చేసి జ్యూస్ తీయండి.

• బంగాళదుంపపై చెక్కు తీసి, బ్లెండ్ చేసి జ్యూస్ తీయండి.

• సమాన పరిమాణంలో తీసుకుని,ఈ రెంటినీ కలపండి.

• దూది ఉండను ఈ రసంలో ముంచి చర్మంపై రాసుకుని సహజంగా ఆరనివ్వాలి.

• తరువాత నీటితో కడిగేయండి.

దోసకాయ మరియు బంగాళాదుంపల రెండింటిలోను ఉండే బ్లీచింగ్ లక్షణాలు మెలనిన్ ఉత్పత్తిని నిరోధించి, హైపెర్పిగ్మెంటేషన్ ను తొలగిస్తాయి.

3. చర్మంపై టోనర్ లా పనిచేస్తుంది

3. చర్మంపై టోనర్ లా పనిచేస్తుంది

దోసకాయ రసం మంచి టోనర్ లా పనిచేస్తుంది. ఇది ముఖాన్ని శుభ్రపరిచి,తేమనందించి, సాధారణ మోటిమలతో పోరాడి, చర్మాన్ని తెలికబరుస్తుంది. దీని యొక్క సామర్థ్యం మరియు దీని వలన కలిగే చర్మం సౌందర్య ప్రయోజనాలను విస్మరించలేము. దీనిలో ఖనిజాలు మరియు విటమిన్లు రోజ్ వాటర్ వంటి సహజ పదార్ధాలను సమృద్దిగా కలిగి ఉన్న కలిపితే, గొప్ప చర్మ టోనర్ లా పనిచేస్తుంది.

• కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను దోసకాయ రసంలో కలపండి.

• మీ ముఖం శుభ్రపరుచుకుని, ఒక దూది ఉండ సహాయంతో దీనిని టోనర్ లా రాసుకోండి.

• 15 నిముషాలు ఆరనిచ్చి, కడిగేయాలి.

4. సూర్యుని వలన కమిలిన చర్మంను బాగుచేస్తుంది

4. సూర్యుని వలన కమిలిన చర్మంను బాగుచేస్తుంది

సూర్యుని ప్రభావం వలన కమిలిన చర్మ భాగంపై దోసకాయ అద్భుతంగా పనిచేస్తుంది. . ఇది యాస్ట్రిజెంట్ గా పనిచేసి, మేనిఛాయను తేలికపరుస్తుంది.

• తురిమిన తాజా కీరాదోసకాయ రసాన్ని తీయండి.

• ఈ రసంను, మీ చేతులు మరియు ముఖంపై లేదా శరీరం పై ప్రభావిత ప్రదేశంలో రాసుకోవాలి.

• 20 నిముషాలు ఆరాక, కడిగేయాలి.

• ప్రత్యామ్నాయంగా, ప్రభావిత ప్రదేశంలో చల్లబరచిన దోసకాయ ముక్కలు లేదా ముద్దగా చేసిన దోసకాయను రాసుకుని, మీకు నచ్చినంత సమయం ఉంచండి.

5. నల్లని వలయాలను తగ్గిస్తుంది:

5. నల్లని వలయాలను తగ్గిస్తుంది:

అలసిపోయిన కళ్ళు మరియు నల్లని వలయాలకు, దోసకాయ కంటే మెరుగైన నివారణ లేదు. దోసకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు సిలికా, నల్లని వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి. దీనిలోని ఆస్కార్బిక్ ఆమ్లం నీరు నిలుపుదలను నిరోధిస్తుంది, తద్వారా కళ్ళు ఉబ్బడాన్ని కూడా తగ్గిస్తుంది.

• తాజా కీరాదోసకాయ రసాన్ని తీయండి.

• దూది ఉండను దానిలో ముంచి కళ్ళ చుట్టూ ఉన్న నల్లని వలయాలకు రాసుకోవాలి.

• ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి కడిగేయండి.

• లేదంటే, ఫ్రిజ్ లో చల్లబరచిన దోసకాయ ముక్కలను కళ్లపై పెట్టుకోండి.

• పదిహేను నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోండి.

English summary

8 Amazing Skin Benefits Of Cucumber Juice

Although cucumber is a popular summer veggie, it is available all-round the year, and most of us stock it up in our refrigerators for an instant salad recipe or for a quick munch, or to just juice it up. Cucumber juice is that magical elixir which can help you immensely in your health, skin and hair care. Among all the natural skin care remedies, cucumber holds a time-tested place in the skin care segment.
Story first published: Tuesday, July 10, 2018, 18:00 [IST]