ఈ అద్భుతమైన యాస్పిరిన్ ఫేస్ మాస్కులను మీరూ ప్రయత్నించవచ్చు

Subscribe to Boldsky

మనందరం చాలా తలనొప్పిగా,జ్వరంగా ఉన్నప్పుడు యాస్పిరిన్ తీసుకుంటాం. ఇది చాలా సర్వసాధారణంగా అందరికీ తెలిసిన, దొరికే పెయిన్ కిల్లర్ మందు.

కానీ మీకు ఈ సింపుల్ పెయిన్ కిల్లర్ ఎన్ని చర్మ సంబంధ సమస్యలను పరిష్కరించగలదో తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ యాస్పిరిన్ ను రెగ్యులర్ గా వాడితే చక్కని, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చన్నది నిజం.

యాస్పిరిన్లో ఉండే ఎసిటైల్ సాలిసిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా ఇందులో బీటా హైడ్రాక్సిల్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మంపై దురద, మంటను నయం చేస్తుంది.

యాస్పిరిన్ చర్మ రంథ్రాలు పేరుకుపోకుండా, మూసుకుపోకుండా చేసి మొటిమలు తగ్గిస్తుంది. కళ్ల కింద ఉబ్బే చర్మాన్ని తగ్గించి మీరు తాజాగా కన్పించేలా చేస్తుంది.యాస్పిరిన్ ను ఫేస్ మాస్క్ గా వాడటం వలన మరో ఉపయోగం ఏంటంటే అది మృత చర్మకణాలను తొలగించి చర్మం రంగు తగ్గిపోవటాన్ని తగ్గిస్తుంది.

Amazing Aspirin Face Masks That You Can Try,

చర్మానికి యాస్పిరిన్ వలన ఈ లాభాలన్నీ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఫేస్ ప్యాక్ గా దీన్ని ఎలా వాడచ్చో చూద్దాం. చదవండి!

పొడి చర్మానికి యాస్పిరిన్- తేనె ఫేస్ ప్యాక్

పొడి చర్మానికి యాస్పిరిన్- తేనె ఫేస్ ప్యాక్

యాస్పిరిన్, తేనెల కాంబినేషన్ చర్మంపై తేమను నిలిపివుంచి మొటిమలు రాకుండా చేస్తుంది. కొన్నిసార్లు పొడిచర్మంపై కూడా మొటిమలు రావచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుండే తేనె వాపును, మొటిమల మచ్చలను నయం చేసి, చర్మం బాగయ్యేలా చేస్తుంది.

కావాల్సిన పదార్థాలు

5-6 యాస్పిరిన్ టాబ్లెట్లు

1చెంచా తేనె

కొన్ని చుక్కల ఆలివ్/బాదం నూనె

ఎలా వాడాలి

1.మొదట 5-6 యాస్పిరిన్ టాబ్లెట్లు తీసుకుని పొడి చేయండి.

2.ఈ టాబ్లెట్ల పొడిలో కొన్ని చుక్కల నీరు పోసి పేస్టులా చేయండి. ఈ పేస్టు మరీ పల్చగా ఉండకూడదు.

3.ఈ పేస్టుకి ఒక చెంచా తేనెను జతచేసి బాగా కలపండి.

4.కొన్ని చుక్కల ఆలివ్/బాదం నూనెను ఈ యాస్పిరిన్ పేస్టులో వేయండి.

5.ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై సమంగా పట్టించి ఒక 15 నిమిషాలు అలానే వదిలేయండి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

యాస్పిరిన్ టోనర్

యాస్పిరిన్ టోనర్

యాస్పిరిన్ ను ముఖంపై టోనర్ గా కూడా వాడవచ్చు. ఇది టోనర్ గానే కాక, చనిపోయిన కణాలను తొలగించి రంగుపోవటాన్ని తగ్గిస్తుంది. ఇది ఉబ్బిన చర్మాన్ని కూడా మామూలు చేస్తుంది.

కావాల్సిన పదార్థాలు

8-10 యాస్పిరిన్ టాబ్లెట్లు

4చెంచాల వైట్ వెనిగర్

నీరు

ఎలా వాడాలి

1. 8-10 యాస్పిరిన్ టాబ్లెట్లను 1/2 కప్పు నీళ్ళలో కరిగించండి.

2.4 చెంచాల వెనిగర్ ను అందులో వేయండి.

3. మొహం ఒకసారి కడుక్కున్నాక దీన్ని ముఖంపై దూదితో రాసుకోండి.

4.10 నిమిషాలు అలా వదిలేసి గోరువెచ్చని నీటితో కడిగేయండి.

5. తర్వాత వాడుకోటానికి కూడా మీరు దీన్ని తయారుచేసి స్ప్రే బాటిల్ లో నిల్వ చేసుకోవచ్చు.

ఎండ వల్ల పాడైన చర్మానికి యాస్పిరిన్

ఎండ వల్ల పాడైన చర్మానికి యాస్పిరిన్

ఈ మాస్క్ ఎండవల్ల చర్మం పాడవటాన్ని తగ్గిస్తుంది. యాస్పిరిన్ చనిపోయిన చర్మకణాలను ఎక్స్ ఫోలియేట్ చేయటంలో సాయపడుతుంది.

కావాల్సిన వస్తువులు

5-6 యాస్పిరిన్ టాబ్లెట్లు

1 చెంచా పెరుగు

కొన్ని చుక్కల నిమ్మరసం

కొన్ని చుక్కల ఆలివ్ నూనె

ఎలా వాడాలి

1.5-6 యాస్పిరిన్స్, 1 చెంచా పెరుగు, కొన్ని చుక్కల తాజా నిమ్మరసాన్ని కలపండి.

2.ఇప్పుడు దీనికి కొన్ని చుక్కల ఆలివ్ నూనెను వేసి కలపండి.

3.సమస్య ఉన్న చోట్ల ఈ మిశ్రమాన్ని పట్టించి 20 నిమిషాలు ఆగండి.

4.20 నిమిషాల తర్వాత మామూలు నీళ్ళతో కడిగేసి పొడిగా తుడుచుకోండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Amazing Aspirin Face Masks That You Can Try

    We all take aspirin when we get severe headache, fever, etc. It's known as one of the best pain relievers that are most commonly available. But have you ever wondered how a simple painkiller can solve several skin-related issues? Surprising, isn't it? But it is true that we can get a clear and healthy skin with regular use of aspirin.
    Story first published: Wednesday, July 18, 2018, 11:43 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more