మెరిసే చర్మం కోసం అమేజింగ్ మయోన్నైస్ పేస్ మాస్క్ రెసిపీస్!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మీకు తెలుసా! సోయాబీన్ నూనె మరియు గుడ్డు తో తయారుచేసిన మయోన్నైస్ మీరు కళలు కన్న చర్మాన్ని పొందడం లో సహాయపడుతుంది మరియు చర్మాన్ని రక్షిస్తుంది.

గతంలో, దీనిని కేవలం కేశ సంరక్షణ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించబడేది. కానీ కొన్ని సంవత్సరాలుగా, చర్మ సంరక్షణా పదార్ధంగా మయోన్నైస్ జనాదరణలో మంచి గుర్తింపు పొందింది.

అందమైన మెరిసే చర్మం కోసం మయోన్నైస్ పేస్ మాస్క్స్ రెసిపీస్

మయోన్నైస్లో వుండే అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మం యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి మరియు దాని మొత్తం రూపాన్ని మెరుగుపర్చడానికి ఇది ఒక అద్భుతమైన అంశంగా చేస్తుంది.

Amazing Mayonnaise Face Mask Recipes You Need For Flawless Skin

అంతేకాకుండా, ఈ పదార్ధము వివిధ రకాల చర్మ వ్యాధులకు చికిత్స చేయటానికి వివిధ మార్గాలలో ఉపయోగించవచ్చు.

ఇవాళ బోల్ద్స్కీ లో, మేము మాయోనైస్ పేస్ మాస్క్స్ రెసిపీ లను మీకోసం వివరించడం జరిగింది. ఇది వికారమైన చర్మ సమస్యలకు మాత్రమే కాదు, మేకప్ అనే మాట లేకుండా కూడా అందంగా కనిపించే ఒక మెరిసే చర్మాన్ని పొందడానికి మీకు సహాయం చేస్తుంది.

అందమైన మెరిసే చర్మాన్ని కావాలనుకుంటున్నారా అయితే ఈ క్రింది రెసిపీ లను ప్రయత్నించి మీరు కోరుకున్న చర్మాన్ని పొందండి.

1. మయోన్నైస్ మరియు వోట్మీల్ ఫేస్ మాస్క్

1. మయోన్నైస్ మరియు వోట్మీల్ ఫేస్ మాస్క్

- ఒక చిన్న గిన్నెలో వండిన వోట్మీల్ ని 1 టీస్పూన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మయోన్నైస్ ని కలపండి.

- బాగా కలిపిన తరువాత ఈ మాస్క్ ని మీ ముఖానికి రాసుకోండి.

- 10-15 నిమిషాల పాటు ఉండనిచ్చి తర్వాత, గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

- మీ చర్మ రంధ్రాల నుండి మృతకణాలని మరియు మలినాలను తొలగించడానికి వారానికి ఒకసారి ఈ

మాస్క్ ని వాడండి.

2. మయోన్నైస్ మరియు ఆరెంజ్ పీల్ పౌడర్ ఫేస్ మాస్క్

2. మయోన్నైస్ మరియు ఆరెంజ్ పీల్ పౌడర్ ఫేస్ మాస్క్

- 1/4 టీస్పూన్ నారింజ తొక్క పొడి లో 2 టీస్పూన్ల మయోన్నైస్ కలపండి.

- దీనిని మీ ముఖానికి రాసుకోండి.

- 15 నిమిషాల పాటు ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- హైపర్పిగ్మెంటేషన్ చికిత్స కోసం ప్రతి వారం ఈ మాస్క్ ని వాడండి.

3. మయోన్నైస్ మరియు ఆల్మాండ్ ఆయిల్ ఫేస్ మాస్క్

3. మయోన్నైస్ మరియు ఆల్మాండ్ ఆయిల్ ఫేస్ మాస్క్

-½ టీస్పూన్ బాదం నూనె లో 1 టీస్పూన్ మయోన్నైస్ ని వేసి బాగా కలపండి.

- ఇప్పుడు ఈ మాస్క్ ని మీ ముఖానికి రాసుకోండి.

- 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

- పొడి చర్మంను నివారించడానికి ప్రతి వారంలో ఈ మయోన్నైస్ ముసుగు ఉపయోగించండి.

4. మయోన్నైస్ మరియు బియ్యం పిండి ఫేస్ మాస్క్

4. మయోన్నైస్ మరియు బియ్యం పిండి ఫేస్ మాస్క్

- 1 టీస్పూన్ బియ్యం పిండి లో 1 టేబుల్ స్పూన్ మయోన్నైస్ లో బాగా కలపండి.

- ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద అప్లై చేయండి.

- గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయడానికి ముందు సుమారు 10 నిమిషాలు పొడిగా ఉండనివ్వండి.

- ఈ పేస్ మాస్క్ తో మీ ముఖం మీద వున్న సన్ టాన్ ని తొలగించండి.

5. మయోన్నైస్ మరియు అలో వెరా జెల్ ఫేస్ మాస్క్

5. మయోన్నైస్ మరియు అలో వెరా జెల్ ఫేస్ మాస్క్

-1 టీస్పూన్ మయోన్నైస్ లో 2 టీస్పూన్ల అలో వెరా జెల్ ని కలిపి పేస్ట్ లాగ సిద్ధం చేయండి.

- ఈ పేస్ట్ ని మీ ముఖానికి రాసుకోండి సుమారు 20 నిమిషాలు పాటు ఆరనివ్వండి.

- తర్వాత, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- మీ చర్మానికి ప్రతిరోజూ ఈ పేస్ మాస్క్ ని ఉపయోగించడం ద్వారా హైడ్రేషన్ యొక్క మేజర్ బూస్ట్ ని అందించండి.

6. మయోన్నైస్ మరియు బేకింగ్ సోడా ఫేస్ మాస్క్

6. మయోన్నైస్ మరియు బేకింగ్ సోడా ఫేస్ మాస్క్

- ఒక గిన్నె లో 1 టేబుల్ స్పూన్ మయోన్నైస్ మరియు ½ టీస్పూన్ బేకింగ్ సోడా ని కలపండి.

- పైన కలిపిన ఫేసుమాస్క్ ని మీ ముఖం మీద అప్లై చేసుకోండి.

- గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడానికి ముందు మీ చర్మాన్ని కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయండి.

- బ్లాక్ హెడ్-ఫ్రీ చర్మం కోసం వారానికి ఒకసారి ఈ పేస్ మాస్క్ ని ప్రయత్నించండి.

7. మయోన్నైస్ మరియు ఆలివ్ ఆయిల్ ఫేస్ మాస్క్

7. మయోన్నైస్ మరియు ఆలివ్ ఆయిల్ ఫేస్ మాస్క్

- మజ్జిగ మరియు ఆలివ్ నూనె ని 1 టీస్పూన్ ని తీసుకొని రెండింటిని బాగా కలపండి.

- ఇప్పుడు దీనిని మీ ముఖం మీద అప్లై చేసుకొని కాసేపు మర్దనా చేయండి.

- కాస్సేపటి తరువాత, మీ చర్మాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

- వృద్ధాప్య సంకేతాలను నివారించడానికి వారానికి ఒకసారి ఈ పేస్ మాస్క్ ని ఉపయోగించండి.

8. మయోన్నైస్ మరియు నిమ్మ రసం ఫేస్ మాస్క్

8. మయోన్నైస్ మరియు నిమ్మ రసం ఫేస్ మాస్క్

- కేవలం 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం లో 2 టీస్పూన్ల మయోన్నైస్ ని కలపండి.

- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసుకొని 10-15 నిమిషాల పాటు వదిలేయండి.

- తరువాత మైల్డ్ క్లీన్సర్ మరియు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

- మీరు కలలుకన్న చర్మాన్ని మీ సొంతం చేసుకోవడానికి ప్రతిరోజూ ఈ మయోన్నైస్ ఫేస్ మాస్క్ ని ప్రయత్నించండి.

English summary

Amazing Mayonnaise Face Mask Recipes You Need For Flawless Skin

Mayonnaise is a highly valued skin care ingredient that can help you achieve the kind of skin you've always dreamt of. The high content of protein in mayonnaise makes it an incredible ingredient for boosting skin's health and improving its overall appearance. There are perfect mayo face mask recipes that can help one attain flawless skin.
Subscribe Newsletter