For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టానింగ్ సమస్యలకు చెక్ పెట్టే రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్స్ :

|

మనలో ఎక్కువ శాతం, శీతాకాలంలో సన్స్క్రీన్ పెద్దగా వినియోగించరు. కానీ, టానింగ్ సమస్యలకు వేసవి కాలం, శీతాకాలాలతో సంబంధం లేదు. సన్ స్క్రీన్ వాడకాన్ని నిలిపివేసిన ఎడల, తిరిగి టానింగ్ బారినపడే అవకాశాలు లేకపోలేదు. పైగా ఇప్పుడు పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా సన్స్క్రీన్ తప్పనిసరిగా ఉంటుంది.

Amazing Rose Water Face Packs For Tan Removal

టానింగ్ క్రమంగా నల్ల మచ్చలు(డార్క్ స్పాట్స్), పిగ్మెంటేషన్, మొటిమలు, ఇన్ఫెక్షన్స్ మొదలైన అనేకరకాల చర్మ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కానీ, వీటన్నిటికీ చెక్ పెట్టేలా, టానింగ్ సమస్యను తగ్గించడంలో ఎంతగానో దోహదపడే చక్కటి పరిష్కారం అందుబాటులోనే ఉంది. అది మరేమిటో కాదు, రోజ్ వాటర్.

రోజ్ వాటర్ వలన చర్మానికి చేకూరే ప్రయోజనాలు :

రోజ్ వాటర్ వలన చర్మానికి చేకూరే ప్రయోజనాలు :

రోజ్ వాటర్ చర్మాన్ని శాంతపరచే స్వభావాన్ని కలిగి ఉండడంతో పాటు, సహజసిద్దమైన గ్లో అందివ్వడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, యాంటీఆక్సిడెంట్స్ యొక్క గొప్ప వనరుగా ఉండటం మూలాన, చర్మం యొక్క pH స్థాయిలను క్రమబద్దీకరిస్తూ తేమను మెరుగుపరుస్తూ, చర్మానికి స్వాంతన చేకూరుస్తుంది.

టానింగ్ వదిలించుకోవడానికి రోజ్ వాటర్ ఉపయోగించే విధానం గురించిన వివరాలు మరియు రోజ్ వాటర్ తో కూడిన వివిధ రకాల ఫేస్ పాక్స్ :

రోజ్ వాటర్ – సెనగ పిండి :

రోజ్ వాటర్ – సెనగ పిండి :

ప్రతి ఇంటిలోనూ సర్వసాధారణంగా కనిపించే పదార్ధం బేసన్ (సెనగ పిండి). ఇది టానింగ్ సమస్యను తీసివేయడంలో సహాయపడుతుంది, అంతేకాకుండా చర్మపు సున్నితత్వం, మొటిమలు, పిగ్మేంటేషన్ వంటి అనేక ఇతర సమస్యలను సైతం పరిష్కరిస్తుంది.

కావలసిన పదార్ధాలు :

1 టేబుల్ స్పూన్ శనగ పిండి.

2 స్పూన్ల గులాబీ నీరు.

తయారుచేయు విధానం :

ఒక శుభ్రమైన గిన్నెలో పదార్ధాలను తీసుకుని ఒక పేస్ట్ వలె మిశ్రమంగా కలపండి. ఈ పేస్ట్ ని మీ ముఖం మీద నలువైపులా విస్తరించునట్లు సమానంగా వర్తించండి. పొడిగా మారిన తర్వాత, సాధారణ నీటితో శుభ్రపరచి తువాలుతో తడిని తీసివేసి, అవసరమైతే మాయిశ్చరైజర్ను వర్తించండి. ఈవిధంగా వారంలో కనీసం 1 నుండి 2 మార్లు అనుసరించిన ఎడల మెరుగైన ఫలితాలను పొందగలరు.

 రోజ్ వాటర్ మరియు శాండల్వుడ్ పౌడర్ (గంధం) :

రోజ్ వాటర్ మరియు శాండల్వుడ్ పౌడర్ (గంధం) :

గంధం పొడి మరియు రోజ్ వాటర్ మిశ్రమం, టానింగ్ సమస్యను తొలగించడంతో పాటు, చర్మం మీద తేమను సమతుల్యం చేయడానికి ఉత్తమంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, చర్మాన్ని పగుళ్ళ బారిన పడకుండా, బిగుతుగా చేసే లక్షణాలకు కూడా ప్రసిద్ది చెందింది.

ఒక శుభ్రమైన గిన్నెను తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల గంధపు పొడి మరియు 3 నుండి 4 టేబుల్ స్పూన్ల గులాబీ నీటిని కలిపి మిశ్రమంగా చేయండి. ముఖం మీద ఈ ప్యాక్ పొరను నలువైపులా విస్తరించునట్లు వర్తించి, సుమారు 20 నిముషాల పాటు అలాగే గాలికి ఉండనివ్వండి. 20 నిముషాల తర్వాత సాధారణ నీటిని ఉపయోగించి ముఖాన్ని శుభ్రపరచండి.

రోజ్ వాటర్ మరియు అలోవెరా జెల్ (కలబంద) :

రోజ్ వాటర్ మరియు అలోవెరా జెల్ (కలబంద) :

అలోవేరా, వృద్దాప్య చాయలను నివారించడంతో పాటుగా, చర్మానికి ఉపశమనం అందించేలా సహజ సిద్దమైన మాయిశ్చరైజర్ లక్షణాలను కలిగి ఉంటుంది. కలబంద మరియు రోజ్ వాటర్ ఉపయోగించి, టాన్ తొలగించటానికి తేలికపాటి ఫేస్ ప్యాక్ తయారుచేయవచ్చు. ఒక గిన్నెలో గులాబీ నీరు మరియు కలబంద జెల్ వేసి కలపాలి. దీన్ని మీ ముఖం మీద పూర్తిగా వర్తించండి. సుమారు 15 నుండి 20 నిముషాల పాటు ఉండనిచ్చిన తర్వాత, సాధారణ నీటితో కడిగి శుభ్రం చేయండి.

రోజ్ వాటర్ ముల్తానీ మట్టి :

రోజ్ వాటర్ ముల్తానీ మట్టి :

ముల్తానీ మట్టి ఖనిజాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది, క్రమంగా చర్మానికి మంచి పోషణను అందివ్వడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఆరోగ్యంగా మరియు మృదువుగా ఉంచుతుంది. దీనికి 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి మరియు 2 స్పూన్ల రోజ్ వాటర్ అవసరం. పదార్థాలను మిశ్రమంగా కలిపి ముఖం మీద వర్తించండి. పూర్తిగా ఆరిపోయే వరకు లేదా కనీసం 20 నిమిషాలు వేచి చూసిన తర్వాత, చల్లని నీటితో శుభ్రం చేసి మాయిశ్చరైజర్ను వర్తించండి. ముల్తానీ మట్టి, చర్మాన్ని పూర్తిగా పొడిగా చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. కావున మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వినియోగించండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

Amazing Rose Water Face Packs For Tan Removal

Suntan happens not only during the summers but also in the winters. Rose water has soothing properties that will help calm the skin and return the natural glow. Also, being a great source of antioxidants it will help in moisturising and rejuvenating the skin along with balancing the skin's pH level. Rose Water Face Packs For Tan Removal
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more