మీ చర్మానికి పోషణను నిమిషాల్లో అందించే బీట్ రూట్ ప్యాక్స్

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

వివిధ రకాల చర్మ సమస్యల నుండి సంరక్షణ కొరకు శతాబ్దాలగా బీట్ రూట్ ను విరివిగా వాడటం కలదు.

బీట్ రూట్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని మీకు తెలుసు. దీనిలో ఉండే లుటైన్ అనే యాంటీఆక్సిడెంట్ చర్మానికి ఫ్రీ రాడికల్స్ కలిగించే నష్టాలతో పోరాడుతుంది. చర్మానికి నష్టం కలిగించే ఫ్రీ-రాడికల్స్ తో పోరాడి అనేక రకాలుగా సహాయపడుతుంది.

చర్మానికి పోషణను అందించడానికి బీట్ రూట్ ను వివిధ పద్ధతుల్లో వాడవచ్చు. అంతే సమర్ధవంతమైన ఇతర పదార్థాలను కలిపి ఫేస్ ప్యాకులుగా వాడటం అన్నిటికంటే ఉత్తమం.

Beetroot Face Packs That Can Nourish Your Skin In Minutes

ఇక్కడ బీట్ రూట్ ను ఇతర పదార్థాలతో కలిపి చర్మ పోషణకు ఫేస్ ప్యాకులుగా ఎలా వాడాలో తెలుసుకుందాం. వీటిని ఉపయోగించి మీ చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.

బీట్ రూట్ - నిమ్మరసం ఫేస్ ప్యాక్:

బీట్ రూట్ - నిమ్మరసం ఫేస్ ప్యాక్:

తయారీ పద్ధతి: ఒక టీ స్పూన్ తాజా బీట్ రూట్ రసానికి అర టీ స్పూన్ నిమ్మరసం కలపండి. ఒక దూది ఉండను దీనిలో ముంచి ముఖమంతటా రాసుకోండి. పది నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా కనీసం వారానికి రెండు రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

2.బీట్ రూట్ - కలబంద ఫేస్ ప్యాక్:

2.బీట్ రూట్ - కలబంద ఫేస్ ప్యాక్:

తయారీ పద్ధతి: ఒక బీట్ రూట్ ను బాగా తురిమి రెండు టీ స్పూన్ల తాజా కలబంద గుజ్జును కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పది-పదిహేను నిమిషాల తరువాత నీటితో కడిగేయండి. దీన్ని వారానికి ఒకసారి వాడితే చర్మానికి పోషణ అంది చర్మం అంతా ఏకరీతిగా మెరుగైన ఛాయ సంతరించుకుంటుంది.

3. బీట్ రూట్- వరిపిండి ఫేస్ ప్యాక్:

3. బీట్ రూట్- వరిపిండి ఫేస్ ప్యాక్:

తయారీ పద్ధతి: రెండు టీ స్పూన్ల బీట్ రూట్ రసానికి అర టీ స్పూన్ వరిపిండి కలపండి. దీనిని ముఖమంతటా రాసుకోండి. బాగా ఆరాక పదిహేను నిమిషాల తరువాత తేలికపాటి క్లెన్సర్ మరియు గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా కనీసం నెలకి 3-4సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

4. బీట్ రూట్- తేనె ఫేస్ ప్యాక్:

4. బీట్ రూట్- తేనె ఫేస్ ప్యాక్:

తయారీ పద్ధతి: రెండు టీ స్పూన్ల తేనెకి ఒక టీ స్పూన్ బీట్ రూట్ రసాన్ని కలపండి. దీనిని బాగా ముద్దలాగా కలిపి ముఖమంతటా రాసుకోండి. బాగా ఆరనిచ్చి పదిహేను నిమిషాల తరువాత ఫేస్ వాష్ మరియు గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా కనీసం వారానికి రెండుసార్లు చేస్తే పోషణ అంది మృదువైన చర్మం మీ సొంతం.

5. బీట్ రూట్- చందనం ఫేస్ ప్యాక్:

5. బీట్ రూట్- చందనం ఫేస్ ప్యాక్:

తయారీ పద్ధతి: రెండు టీ స్పూన్ల బీట్ రూట్ రసానికి అర టీ స్పూన్ చందనాన్ని కలపండి. దీనిని బాగా కలిపి ముఖమంతటా పట్టించి పదిహేను నిమిషాలపాటు బాగా ఆరనిచ్చి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా కనీసం వారానికి ఒకసారి చేస్తే మీరు కోరుకున్న లక్షణాలు ఉన్న చర్మం మీ సొంతం.

 6. బీట్ రూట్- రోస్ వాటర్ ఫేస్ ప్యాక్:

6. బీట్ రూట్- రోస్ వాటర్ ఫేస్ ప్యాక్:

తయారీ పద్ధతి: ఒక మందపాటి బీట్ రూట్ ముక్కను తురిమి ఒక టీ స్పూన్ రోస్ వాటర్ ని కలపండి. దీనిని ముఖం మరియు మెడ అంతటా పట్టించి, బాగా ఆరనిచ్చి పది నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. తరువాత ముఖానికి టోనర్ రాసుకుంటే ఉత్తమ ఫలితాలుంటాయి. ఇలా కనీసం వారానికి ఒకసారి చేస్తే చర్మానికి పోషణ అందటంతో పాటుగా మొటిమలు తగ్గుతాయి.

7. బీట్ రూట్- ఆలివ్ ఆయిల్ ఫేస్ ప్యాక్:

7. బీట్ రూట్- ఆలివ్ ఆయిల్ ఫేస్ ప్యాక్:

తయారీ పద్ధతి: ఒక టీ స్పూన్ తురిమిన బీట్ రూట్ కు అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ని కలపండి. దీనిని ముఖం మరియు మెడ అంతటా పట్టించి, బాగా ఆరాక ఇరవై నిమిషాల తరువాత తేలికపాటి క్లెన్సర్ మరియు గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా కనీసం వారానికి ఒకసారి చేస్తే చర్మానికి పోషణ అంది నునుపుగా మారుతుంది .

English summary

Beetroot Face Packs That Can Nourish Your Skin In Minutes

Beetroot is laden with powerful antioxidants that can benefit your skin in numerous ways. From providing nourishment to combating skin-damaging free radicals, beetroot can help your skin in ways you cannot possibly fathom.Some of the best natural ingredients that are the best combination with beetroot are honey, lemon, sandal powder etc