పొటాటో ద్వారా కలిగే స్కిన్ కేర్ బెనిఫిట్స్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

పొటాటోస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే ముఖ్యమైన మినరల్స్ తో పాటు శరీరానికి అవసరమైన విటమిన్స్ కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తాయి.

ఈ హెల్త్ బెనిఫిట్స్ తో పాటు పొటాటోస్ ద్వారా సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? అవును, మీరు చదివింది నిజమే. పొటాటోస్ ని ఫేస్ మాస్క్స్ రూపంలో వాడి యూత్ ఫుల్ అలాగే బ్యూటిఫుల్ స్కిన్ ని పొందవచ్చు.

స్కిన్ ట్యాన్, బ్లేమిషెస్, డ్రై స్కిన్ వంటి కొన్ని స్కిన్ ప్రాబ్లెమ్స్ అనేవి ఈ మధ్యకాలంలో సాధారణ సమస్యలుగా మారిపోయాయి. ఇటువంటివాటికి ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ గా పొటాటోని పేర్కొనవచ్చు. పొటాటో అనేది ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా లభ్యమయ్యే వెజిటబుల్. కాబట్టి, మీరీసారి వంటగదిలోకి వెళ్ళినప్పుడు పొటాటోతో మీ స్కిన్ ని ప్యాంపర్ చేసుకోవడం మరచిపోకండి.

Benefits Of Potato For Skin Care

ఇప్పుడు, పొటాటోని చర్మ సంరక్షణకై ఎలా వాడాలో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీరు సరైన ప్లేస్ కే వచ్చారు. ఈ ఆర్టికల్ ద్వారా పొటాటోస్ ని ఉపయోగించి చర్మాన్ని ఎలా సంరక్షించుకోవచ్చో మీరు తెలుసుకోబోతున్నారు. వీటిని తెలుసుకుని ఫేస్ ప్యాక్స్ అలాగే మాస్క్స్ రూపంలో పొటాటోస్ ని వాడి అందమైన అలాగే మచ్చలేని చర్మాన్ని పొందండి మరి.

1. కాంతివంతమైన చర్మం కోసం:

1. కాంతివంతమైన చర్మం కోసం:

పొటాటోస్ లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు తోడ్పడతాయి. పొటాటోస్ ని ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా కూడా కోమలమైన అలాగే ఆరోగ్యవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు, పొటాటోస్ ని చర్మంపై ప్యాక్స్ రూపంలో ఎలా వాడాలో తెలుసుకుందాం.

ఇందుకోసం, తురిమిన పొటాటోని తేనెతో కలపాలి. దీనిని ముఖంపై ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత చర్మాన్ని శుభ్రపరచుకొని తడిని తుడుచుకోవాలి. ఈ పద్దతిని వారానికి రెండుసార్లు పాటిస్తే మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

2. డ్రై స్కిన్ ను అరికడుతుంది:

2. డ్రై స్కిన్ ను అరికడుతుంది:

డ్రై స్కిన్ తో మీరు సతమతమవుతున్నట్టయితే, ఈ సింపుల్ పొటాటో ఫేస్ మాస్క్ తో ఈ సమస్యను మీరు అరికట్టవచ్చు. ఈ ఫేస్ మాస్క్ యాంటీ ఏజింగ్ మాస్క్ లా కూడా ఉపయోగపడుతుంది.

కావాల్సిన పదార్థాలు:

2-3 టేబుల్ స్పూన్ల పొటాటో జ్యూస్

1 టేబుల్ స్పూన్ సోర్ క్రీమ్

ఎలా వాడాలి:

అన్ని పదార్థాలని బాగా కలిపి పేస్ట్ లా తయారుచేసుకోండి. ఈ పేస్ట్ ను ముఖంపై అలాగే మెడపై అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని అలాగే మెడను శుభ్రపరచుకోండి. ఈ మాస్క్ ద్వారా చర్మం స్మూత్ గా మారి హైడ్రేటెడ్ అవుతుంది. తద్వారా, డ్రై నెస్ అనేది తగ్గుముఖం పడుతుంది.

3. ఆయిలీ స్కిన్ కోసం:

3. ఆయిలీ స్కిన్ కోసం:

ఈ మాస్క్ అనేది చర్మాన్ని శుభ్రంగా అలాగే స్మూత్ గా ఉంచేందుకు తోడ్పడుతుంది. ఆయిలీ స్కిన్ అనేది ఎక్కువగా మొటిమలను ఆకర్షిస్తుంది. ఈ మాస్క్ అనేది ముఖంపైనున్న అదనపు ఆయిల్ ను తొలగించేందుకు తోడ్పడుతుంది.

కావాల్సిన పదార్థాలు:

3 టేబుల్ స్పూన్ల పొటాటో జ్యూస్

1 టేబుల్ స్పూన్ మజ్జిగ

2 టేబుల్ స్పూన్ల గ్రామ్ ఫ్లోర్

1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

ఎలా వాడాలి:

పైన చెప్పిన పదార్థాలన్నిటినీ బాగా కలిపి పేస్ట్ ను తయారుచేయాలి. ఈ పేస్ట్ ను మెడపై అలాగే ముఖంపై అప్లై చేయాలి. ముప్ఫై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరచాలి. తడిని తుడిచేయాలి. ఈ మాస్క్ అనేది ఆయిలీ స్కిన్ కి ఉపయోగకరంగా ఉంటుంది. చర్మాన్ని యంగ్ గా మారుస్తుంది.

4. ట్యాన్ ను తొలగిస్తుంది:

4. ట్యాన్ ను తొలగిస్తుంది:

ఈ ప్యాక్ అనేది సన్ ట్యాన్ ను తొలగించి ఈవెన్ స్కిన్ టోన్ ని అందిస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ చర్మంపై పేరుకుపోవడం వలన ట్యాన్ ఏర్పడుతుంది. ఈ ప్ యాక్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ పొటాటో జ్యూస్

1 టేబుల్ స్పూన్ ఎగ్ వైట్

1 టేబుల్ స్పూన్ పెరుగు

ఎలా వాడాలి:

ఈ పదార్థాలని బాగా కలిపి ముఖంపై అలాగే మెడపై అప్లై చేయాలి. ఆ తరువాత 20 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరచుకోవాలి. ఈ మాస్క్ అనేది నేచురల్ గ్లో ను పొందేందుకు తోడ్పడుతుంది. ఈ రెమెడీని వారానికి రెండు సార్లు పాటిస్తే మంచి ఫలితం లభిస్తుంది.

English summary

Benefits Of Potato For Skin Care

Benefits Of Potato For Skin Care, Potatoes are packed with antioxidants and they contain some important minerals and essential vitamins. But did you know that apart from its health benefits, potatoes can even help in enhancing your beauty? Yes, you just read that right!