ఆయిలీ స్కిన్ సమస్యని సమర్థవంతంగా తొలగించే నిమ్మరసం

Subscribe to Boldsky

నిమ్మరసమనేది చర్మ సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే, నిమ్మరసాన్ని చర్మసౌందర్యాన్ని పెంపొందించేందుకై వాడే అనేక హోమ్ రెమెడీస్ లో తప్పనిసరిగా జోడిస్తారు. ఈ ఇంగ్రిడియెంట్ ని మీ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకుంటే మీ చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది. చర్మంపైనున్న మచ్చలు తొలగుతాయి. అలాగే, చర్మ సౌందర్యం మరింత పెంపొందింపబడుతుంది.

ప్రాచీనకాలంనుంచి నిమ్మరసాన్ని స్కిన్ కేర్ ఇంగ్రిడియెంట్ గా వాడుతూనే ఉన్నారు. వివిధ చర్మతత్వాలకి ఈ పదార్థం ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మంపైనుండే అదనపు నూనెను గ్రహిస్తూ మొటిమలను అరికట్టేందుకు నిమ్మరసం ఉపయోగకరంగా ఉంటుంది.

lemon juice to get rid of oily skin

నిమ్మరసంలో లభించే సిట్రిక్ యాసిడ్ అనే పదార్థం వలన చర్మానికి సంరక్షణ లభిస్తుంది. చర్మసౌందర్యాన్ని కాపాడే లక్షణం ఈ పదార్థంలో అధికం.

నిమ్మ రసంతో 15 ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్..!

అంతేకాక, ఈ ఇంగ్రీడియెంట్ ని ఆయిలీ స్కిన్ వారు అనేకరకాలుగా వాడి తమ చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఈ రోజు బోల్డ్ స్కైలో, చర్మంపై నున్న అదనపు నూనెను తొలగించేందుకై నిమ్మరసాన్ని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం.

ఈ విధానాలలో ఎదో ఒక విధానాన్ని పాటించి చర్మంపై నున్న ఆయిలీనెస్ ను అలాగే గ్రీజీనెస్ ను తొలగించుకోండి.

1. నిమ్మరసం + ఎగ్ వైట్:

1. నిమ్మరసం + ఎగ్ వైట్:

ఎగ్ వైట్ లో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై సున్నితంగా అప్లై చేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ మిశ్రమాన్ని సహజంగా ఆరనివ్వండి. ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని కడగండి. వారానికి రెండు సార్లు నిమ్మరసాన్ని ఈ విధంగా వాడితే చర్మంపైన జిడ్డుతనం మటుమాయమవుతుంది.

2. నిమ్మరసం + టమాటో గుజ్జు:

2. నిమ్మరసం + టమాటో గుజ్జు:

ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకుని అందులో రెండు టీస్పూన్ల టమాటో గుజ్జును కలపండి. ఈ మిశ్రమంతో మీ ముఖంపై మసాజ్ చేయండి.

పది నిమిషాలపాటు ఈ మిశ్రమాన్ని సహజంగా ఆరనివ్వండి. ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి. వారానికి ఒకసారి ఇలా చర్మాన్ని సంరక్షించుకుంటే ఆయిలీనెస్ అనేది బాధపెట్టదు.

3. నిమ్మరసం + అలోవెరా జెల్

3. నిమ్మరసం + అలోవెరా జెల్

ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని అలాగే ఒక టీస్పూన్ అలోవెరా జెల్ ని కలిపి చక్కని మిశ్రమాన్ని తయారుచేసుకోండి. ఈ మిశ్రమాన్ని వాడటం ద్వారా చర్మంపైన అదనపు నూనెను తొలగించుకోవచ్చు.

ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసి పదినిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరచుకోండి. వారానికి రెండు సార్లు, ఈ పద్దతిని పాటించడం ద్వారా ఆయిలీ స్కిన్ వలన కలిగే ఇబ్బందులను తొలగించుకోవచ్చు.

4. నిమ్మరసం + గ్రీన్ టీ:

4. నిమ్మరసం + గ్రీన్ టీ:

రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ను కలపండి. ఒక కాటన్ ప్యాడ్ ను తీసుకుని ఈ మిశ్రమంలో ముంచి ఆ కాటన్ ప్యాడ్ ని మీ ఫిషియల్ స్కిన్ పై అద్దండి.

ఆ తరువాత పది నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ఆరనివ్వండి. వారానికి ఒకసారి ఈ పద్దతిలో చర్మాన్ని సంరక్షించుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

4. నిమ్మరసం + దోశకాయ:

4. నిమ్మరసం + దోశకాయ:

ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని తీసుకుని అందులో రెండు టీస్పూన్ల దోసకాయ పేస్ట్ ను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై బాగా అప్లై చేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఆరనివ్వండి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని కడగండి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేయడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు.

5. నిమ్మరసం + మిల్క్ పౌడర్ :

5. నిమ్మరసం + మిల్క్ పౌడర్ :

ఒక పాత్రని తీసుకుని అందులో ఒక టీస్పూన్ మిల్క్ పౌడర్ ని అలాగే రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని బాగా కలపండి. పేస్ట్ లాంటి మిశ్రమం తయారయ్యే వరకు బాగా కలపండి.

ఈ పేస్ట్ ని ఫిషియల్ స్కిన్ పై సున్నితంగా అప్లై చేయండి. అయిదు నుంచి పది నిమిషాల తరువాత, గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి. ఈ పేస్ట్ ని వారానికి ఒకసారి అప్లై చేయడం ద్వారా గుర్తించదగ్గ ఫలితాలను పొందవచ్చు.

6. నిమ్మరసం + తేనె :

6. నిమ్మరసం + తేనె :

రెండు టీస్పూన్ల తేనెని తీసుకుని అందులో ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసి అయిదు నిమిషాల వరకు ఆరనివ్వండి.

ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని కడగండి. ఈ హోమ్ మేడ్ మిశ్రమాన్ని వారానికి ఒకసారి వాడటం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.

చర్మం కాంతిని రెట్టింపు చేసే నిమ్మతొక్క

7. నిమ్మరసం + రోజ్ వాటర్ :

7. నిమ్మరసం + రోజ్ వాటర్ :

ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ ను కలపండి. ఈ మిశ్రమంతో మీ చర్మాన్ని కడగండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని కడగండి. ఈ హోంమేడ్ రిన్స్ ని వారానికి రెండు సార్లు వాడి చర్మంపైన ఆయిలీనెస్ ను తొలగించుకోండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Lemon Juice: Best Solution For Oily Skin

    Lemon juice is hailed as a must-use skin care ingredient. This home remedy is replete with skin-benefiting features that can effectively treat unsightly skin conditions and improve the overall health and appearance of your skin.
    Story first published: Thursday, January 4, 2018, 11:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more