For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాక్టివేటెడ్ చార్కోల్: ఇటీవలి కాలంలో బహుళ ప్రాచుర్యం పొందిన సౌందర్య పోషక పదార్ధం

ఇటీవలి కాలంలో బహుళ ప్రాచుర్యం పొందిన సౌందర్య పోషక పదార్ధం

|

చర్మ సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు, ఈ మధ్య కొత్తగా ఏక్టివేటెడ్ చార్కోల్ (కర్ర బొగ్గు) వెంట పడుతున్నారు. అందానికి దగ్గర దారి చూపే, ఈ శక్తివంతమైన పదార్ధం పేరే ఇప్పుడు ప్రతిఒక్కరి నోట్లో నానుతుంది. బ్యూటీ బ్లాగర్ల నుండి సినీ ప్రముఖులు మోడళ్ల వరకు, ప్రతి ఒక్కరూ తమ దైనందిన చర్మ సంరక్షణ ప్రణాళికలో, దీనిని భాగంగా చేసుకున్నారు.

ఇటీవలి కాలంలో, ఈ పదార్ధం ఇంతగా ప్రాచుర్యం పొందడానికి, అది చర్మంలో పేరుకున్న విషతుల్యాలను తొలగించి, తాజాగా, మెరిసేలా మార్చడమే ముఖ్య కారణం. ఇది కాంతిహీనంగా కనిపించే చర్మానికి, తక్షణ పరిష్కారం అందిస్తుంది.

Activated Charcoal: The Most Talked-about Beauty Ingredient These Days

ఎన్నో ఉన్నత-శ్రేణికి చెందిన చర్మ సంరక్షణ బ్రాండ్లు యాక్టివేటెడ్ చార్కోల్ కలిగి ఉన్న తమ సొంత ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశాయి. మీరు ఇప్పటి వరకు ఈ అద్భుతమైన పదార్ధాన్ని, చర్మంపై పరీక్షించి ఉండకపోతే, ఈ వ్యాసం మీ కొరకే! దీనిని ఉపయోగించి మీ చర్మానికి ఏ విధంగా ప్రయోజనం చేకూర్చగలరో,ఇప్పుడు మీకు ఇక్కడ తెలియజేస్తున్నాము:
ఇది చర్మం నుండి మలినాలను తొలగిస్తుంది

ఇది చర్మం నుండి మలినాలను తొలగిస్తుంది

ఇది చర్మం నుండి మలినాలను, విష పదార్థాలను మరియు ధూళి రేణువులను వెలికితీసి, తొలగిస్తుంది. మలినాలను తొలగించడం ద్వారా, చర్మరంధ్రాలను శుభ్రపరచి మరియు ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేకుండా సోకనివ్వకుండా సహాయపడుతుంది.

 మొటిమల సమస్య నివారిస్తుంది

మొటిమల సమస్య నివారిస్తుంది

యాక్టివేట్ చార్కోల్, మొటిమల సమస్య యొక్క చికిత్సలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అది మొటిమలను కలిగించే బ్యాక్టీరియాపై దాడి చేయడమే కాక, వాపు మరియు ఎరుపుదనంను కూడా తగ్గిస్తుంది.

జిడ్డుచర్మంపై ఈ పదార్ధం అద్భుతంగా పనిచేస్తుంది.

జిడ్డుచర్మంపై ఈ పదార్ధం అద్భుతంగా పనిచేస్తుంది.

జిడ్డుచర్మంపై ఈ పదార్ధం అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని చర్మం యొక్క ఉపరితలంపై పూసుకుంటే, అదనపు సెబమ్ ను తొలగించి, తాజా అయిన మరియు స్పష్టమైన చర్మాన్ని అందిస్తుంది.

దీనిని బ్లాక్ హెడ్స్ చికిత్సలో కూడా ఉపయోగించవచ్చు

దీనిని బ్లాక్ హెడ్స్ చికిత్సలో కూడా ఉపయోగించవచ్చు

దీనిని బ్లాక్ హెడ్స్ చికిత్సలో కూడా ఉపయోగించవచ్చు. సాధారణ బ్లాక్ హెడ్స్-రిమూవల్ స్ట్రిప్స్ కంటే మెరుగ్గా చర్మం నుండి బ్లాక్ హెడ్స్ ను, యాక్టివేట్ చార్కోల్ తొలగిస్తుంది మరియు తిరిగి పునరావృతమవకుండా చేస్తుంది.

 యాక్టివేట్ చార్కోల్ చర్మంలో చైతన్యం నింపి,

యాక్టివేట్ చార్కోల్ చర్మంలో చైతన్యం నింపి,

యాక్టివేట్ చార్కోల్ చర్మంలో చైతన్యం నింపి, మోటిమల యొక్క మచ్చలు తొలగిపోయేట్టు చేస్తుంది.

అసలు చార్కోల్ ఫేస్ మాస్క్ ను ఎందుకు ఉపయోగించాలి?

అసలు చార్కోల్ ఫేస్ మాస్క్ ను ఎందుకు ఉపయోగించాలి?

ఈ మధ్యకాలంలో మీరు, సౌందర్య సంరక్షణ ఉత్పత్తుల దుకాణాలను సందర్శించినట్లయితే, టన్నుల కొద్దీ యాక్టివేట్ చార్కోల్ తో తయారైన, వివిధ రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులు అమ్ముడవటం గమనించవచ్చు. అన్ని ఉత్పత్తుల్లోకి, యాక్టివేట్ చార్కోల్ ఫేస్ మాస్కులు అధికంగా ప్రాచుర్యం పొందాయి. ఎందుకంటే, వీటిని సులభంగా ఉపయోగించవచ్చు మరియు ఇవి అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయి.

చర్మం ఆరోగ్యవంతంగా, అందంగా కనిపించాలనుకుంటే, యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ మాస్కులు ఉపయోగించడం మంచిది. అయితే, ధరల అధికంగా ఉండే మార్కెట్ లోని వాణిజ్య ఉత్పత్తులు ఉపయోగించటానికి బదులుగా, సహజమైన పదార్ధాలను ఉపయోగించి ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ మాస్కులు ఎల్లప్పుడూ ఉత్తమమైనవి. ఈ ఫేస్ మాస్కులు, మీ చర్మానికి సెలూన్ చికిత్సల ద్వారా పొందే మెరుపు మరియు స్పష్టతలను సాధించటానికి సహాయపడుతుంది. వీటిని ఉపయోగించాక, మీ చర్మం చూడటానికి, మృదువుగా మరియు ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

ఈ స్పష్టమైన ప్రభావాలు మాత్రమే కాకుండా, చార్కోల్ ఫేస్ మాస్క్, మొటిమలు మరియు మచ్చలు లాంటి సమస్యలను పరిష్కరించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది మచ్చలను తగ్గించడానికి మరియు మేనిఛాయను తేలికపరచడానికి కూడా ఉపయోగపడుతుంది.

చార్కోల్ ఫేస్ మాస్క్ ఎలా పని చేస్తుంది?

చార్కోల్ ఫేస్ మాస్క్ ఎలా పని చేస్తుంది?

చార్కోల్ ఫేస్ మాస్క్, చర్మం యొక్క లోతైన పొరలలోకి సులభంగా చేరుకుని, ప్రక్షాళన చేసి, సాధారణ క్లెన్సర్ తో తొలగించడానికి కష్టతరమైన విషతుల్య పదార్థాలను, మలినాలను మరియు సూక్ష్మ కణాలను తొలగించవచ్చు.

ఇది చర్మం నుంచి మలినాలను తొలగించడమే కాక, చర్మం రంధ్రాలలో పేరుకున్న వ్యర్ధాలను కూడా తొలగించి, వాటిలో ఎటువంటి అడ్డు లేకుండా చేయడంలో సహాయపడుతుంది. అందువలన, మీ చర్మం ప్రకాశవంతంగా, కాంతులీనుతూ చూడటానికి తాజాగా కనిపిస్తుంది. యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ మాస్క్ యొక్క సూక్ష్మ శోషక సామర్ధ్యము, ఇతర ఫేస్ మాస్కుల కంటే మెరుగైన పనితీరు కలిగి ఉంటుంది.

DIY చార్కోల్ ఫేస్ మాస్క్:

DIY చార్కోల్ ఫేస్ మాస్క్:

మీరు ప్రయత్నించదగిన అనేక రకాల యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ మాస్కులు ఉన్నాయి. కానీ మీ చర్మాన్ని పునరుత్తేజితం చేయగలిగే మాస్కు,మీ ప్రాధాన్యత అయినట్లయితే, మలినాలను తొలగించి మేనిఛాయను ప్రకాశవంతం మార్చడానికి, ఈ కింది పద్ధతిని ప్రయత్నించండి.

కావలసిన పదార్థాలు:

1 గుళిక ఏక్టివేటెడ్ చార్కోల్

1 టేబుల్ స్పూన్ ఆకుపచ్చ బంక మట్టి

1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు

3-4 చుక్కలు జొజోబా తైలం

తయారీ పద్ధతి మరియు వాడే విధానం:

తయారీ పద్ధతి మరియు వాడే విధానం:

• ఒక గాజు గిన్నెను తీసుకుని,అందులో అన్ని పదార్థాలు వేయండి.

. అన్ని కలిసి మృదువైన పేస్టుగా మారేంత వరకు ఒక చెంచాతో కలపాలి.

• కడిగిన ముఖానికి ఈ మాస్కును వేసుకోవాలి.

• 15-20 నిముషాల పాటు ఆరనివ్వాలి.

• ఎండిపోయి ఒక పొరగా ఏర్పడటం మీరు గమనించవచ్చు. దీనిని జాగ్రత్తగా తొలగించండి.

• తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

• మీ చర్మం పొడిగా తుడుచుకుని, టోనర్ ను రాసుకోండి.

మీ చర్మానికి పునరుత్తేజం మరియు దాని అందమైన రూపం ఇవ్వడానికి, ఈ DIY ఏక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ మాస్క్ తప్పక ఉపయోగపడుతుంది.

English summary

Activated Charcoal: The Most Talked-about Beauty Ingredient These Days

Because of its detoxifying powers, activated charcoal has become one of the most talked-about beauty ingredients of recent times. Activated charcoal draws out impurities, toxins and dirt particles from the skin. By eliminating impurities, it helps the skin pores to stay clean and free of infections.
Story first published:Thursday, August 23, 2018, 14:52 [IST]
Desktop Bottom Promotion