For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కొబ్బరినూనెతో సులువుగా సౌందర్య పోషణ-తెలుసుకుందామా!

  |

  నేను కనుక మీకు ఇప్పుడు మీ సౌందర్య పోషణకు అన్ని రకాలుగా పనికొచ్చే ఒకేఒక పదార్ధం గురించి చెప్తే ఏమంటారు? అవును మీరు చదివినది నిజమే! కొబ్బరినూనె వంట చేయడానికి మొదలు జుట్టుకు రాసుకోవడం వరకు మనకు రకరకాలుగా ఉపయోగపడుతుంది.

  ఆధునిక జీవనశైలి జుట్టు రాలడం, చిన్నవయసులోనే జుట్టు నెరవడం, కాంతివిహీనమైన చర్మం వంటి అంతులేని సౌందర్య సమస్యలకు దారితీస్తుంది. ఏదేమైనప్పటికి, సహజసిద్ధమైన పద్ధతులను అనుసరించి ఈ సమస్యలను పరిష్కరించుకోవడం సర్వోత్తమం.

  కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం, విటమిన్ లోపాలు మొదలైన వాటి వలన ఇలా జరుగుతుంది. ఇటువంటి అనేక రకాలైన శిరోజ మరియు చర్మ సమస్యల నివారణకు కొబ్బరినూనె అద్భుతంగా పనిచేస్తుంది. మనము అందాన్ని కాపాడుకునేందుకు కొబ్బరినూనెను ఏ విధంగా వాడవచ్చో మీకు తెలుసా!

  Coconut Oil Beauty Hacks That You Didnt Know

  కొబ్బరినూనె వివిధ సౌందర్య ఉత్పత్తులలో విరివిగా వాడబడుతుంది. దీనిలో యాంటీబాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలు ఉన్నాయి. కొబ్బరినూనె అద్భుతమైన మాయిశ్చరైసర్ గా పనిచేస్తుంది. ఇది మిగిలిన నూనెలకంటే త్వరగా చర్మంలోనికి ఇంకిపోతుంది.

  ఇప్పుడు మనం కొబ్బరినూనెను చర్మసంరక్షణకు ఏ విధంగా వాడవచ్చో తెలుసుకుందాం!

  1. మేకప్ రిమూవర్:

  1. మేకప్ రిమూవర్:

  కొబ్బరినూనె మేకప్ తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది, పైగా ఇది వాటర్ ప్రూఫ్. ముఖ్యంగా చిక్కటి నలుపుగా ఉండే కంటి మేకప్ ను సులువుగా తొలగించడానికి కొబ్బరినూనె బాగా పనికొస్తుంది. కొంచెం దూదితో కొబ్బరినూనెను తీసుకుని ముఖం లేదా కళ్ళచుట్టూ తుడవండి. కొబ్బరినూనెలో మీ మేకప్ కరిగిపోతుంది. తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోండి. దీనిని మేకప్ తొలగించడానికి ప్రతిరోజు వాడవచ్చు.

  2. మాయిశ్చరైసర్:

  2. మాయిశ్చరైసర్:

  కొబ్బరినూనెలో సమృద్ధిగా ఉండే కొవ్వు ఆమ్లాలు దానిని ప్రభావవంతమైన మాయిశ్చరైసర్ గా చేస్తాయి. ఇది చర్మం లోనికి త్వరగా ఇంకిపోయి మేనిఛాయను సమతులం చేస్తుంది. ముఖం ఎర్రబడతాన్ని తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా మరియు కాంతివంతంగా చేస్తుంది. మార్కెట్లో దొరికే మాయిశ్చరైసర్ కన్నా కొబ్బరినూనె రాసుకుంటే మంచిది. ఇది చర్మాన్ని మెరిపిస్తుంది.

  3. ప్రైమర్:

  3. ప్రైమర్:

  మేకప్ వేసుకునేముందు అది ఎక్కువసేపు నిలిచి ఉండటానికి ముఖానికి బేస్ గా ప్రైమర్ వాడతారు. కొబ్బరినూనె అద్భుతమైన ప్రైమర్. ఫౌండేషన్ రాసుకోవడానికి ముందు ముఖమంతటా కొంచెం కొబ్బరినూనె మృదువుగా రాసుకోండి. కొబ్బరినూనె మేకప్ ఎక్కువసేపు నిలిచి ఉండటానికి మాత్రమే కాక తేమనందించడానికి కూడా పనికొస్తుంది.

   4. లిప్ బామ్:

  4. లిప్ బామ్:

  మీరు కనుక పెదవులకు కొబ్బరినూనె రాయడం మొదలుపెడితే ఇక పెదవులు పగలడమనే మాటే మర్చిపోవచ్చు. కొబ్బరినూనెను ఒక చిన్న డబ్బాలో వేసి ఎక్కడిికైనా తీసుకువెళ్లాడానికి సులువుగా ఉండేట్టు పెట్టుకోండి. దీనిని పెదాలకు రోజంతా ఎప్పటికప్పుడు రాసుకుంటుంటే పెదవులు తేమగా ఉంటాయి. కొబ్బరినూనె ప్లాస్టిక్ లేదా అల్యూమినియం డబ్బాలో నిల్వచేయడం మరవద్దు.

  5. సన్ స్క్రీన్:

  5. సన్ స్క్రీన్:

  కొబ్బరినూనె చర్మాన్ని అతినీలలోహిత కిరణముల దుష్ప్రభావాల నుండి కాపాడుతుంది. మార్కెట్లో పలురకాల ఉత్పత్తులు దొరుకుతున్నప్పటికీ, వాటిలో ఎదో ఒక రకమైన రసాయన పదార్థం ఉంటుంది. కొబ్బరినూనె ఎటువంటి హానికలిగించకుండా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇంటినుండి బయటకు అడుగుపెట్టేముందు ఒళ్ళంతా కొబ్బరినూనె రాసుకోండి. ఇది మీ చర్మాన్ని పొడిబారకుండా ఉంచి సూర్యుని ప్రతాపం నుండి సంరక్షిస్తుంది.

  6. పేళ్ల నివారణకు:

  6. పేళ్ల నివారణకు:

  తలలోని పేళ్లు కొన్ని సందర్భాలలో మనను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి నెడతాయి. వీటిని కొబ్బరినూనెతో సమర్థవంతంగా పేళ్లను అరికట్టవచ్చు. అది ఎలానో తెలుసుకోండి.

  కావలసిన పదార్ధాలు: కొబ్బరినూనె, యాపిల్ సిడర్ వెనిగర్

  తయారీ పద్ధతి: ముందుగా జుట్టును యాపిల్ సిడర్ వెనిగర్ గో కడగండి. ఇది క్లెన్సర్ గా పనిచేస్తుంది. యాపిల్ సిడర్ వెనిగర్ పూర్తిగా ఆరిన తరువాత జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు కొబ్బరినూనె రాసుకుని 12-24 గంటలు వదిలేయండి. తరువాత తేలికపాటి షాంపూతో శుభ్రపరచుకోండి. ఒక్కసారి చేయగానే పేళ్ళన్నీ తొలగిపోతాయి. రెండోసారి కూడా వాడితే మరీంత మంచి ఫలితముంటుంది.

  English summary

  Coconut Oil Beauty Hacks That You Didn't Know

  Coconut oil is used in many natural beauty products, and for a good reason. It's naturally antibacterial and antifungal in nature. Coconut oil for skin is an excellent moisturizer, it can penetrate hair better than other oils. It can also be used as a makeup remover, an under-eye cream, a primer, etc.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more