For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలు మన చర్మానికి ఎంత మేలు చేస్తాయో మీకు తెలుసా!

పాలు మన చర్మానికి ఎంత మేలు చేస్తాయో మీకు తెలుసా!

|

పచ్చిపాల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలే కాక, పాల వలన అనేక సౌందర్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

ఇది చర్మంపై అద్భుతంగా పని చేస్తుంది. పాలల్లో లాక్టోజ్ ఉండటం వలన వివిధ చర్మ సమస్యలకు ఏకైక పరిష్కారంగా పనిచేస్తాయి.

పాలను ఎండవేడికి ముఖం కమిలిపోకుండా ఉండటానికి, నలుపుదనాన్ని తొలగించడానికి, మచ్చలు తేలికపడటానికి మరియు చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి ఉపయోగించవచ్చు. ఇది చర్మం పై పేరుకున్న మృతకణాలు తొలగించి కొత్త కణాలను పునరుద్ధరించి,చర్మానికి ఆరోగ్యకరమైన మరియు శుభ్రమైన రూపునిస్తుంది.

Did You Know Milk Can Do So Much For The Skin?

ఇది చర్మం మృదువుగా మారడానికి మరియు తేమ సంతరించుకోడానికి సహాయపడుతుంది. అంతేకాక చర్మం పై జిడ్డు అధికంగా స్రవించకుండా తోడ్పడుతుంది.

ఇప్పుడు మీరేమి ఆలోచిస్తున్నారో మాకు తెలుసు! మనం సౌందర్య పోషణకై పాలను ఏ విధంగా ఉపయోగించాలో అనేకదా! ఇంట్లోనే కూర్చుని పాలతో సులభంగా వివిధ రకాల మాస్కులు, ప్యాకులు తయారు చేసుకుని వాడుకోవచ్చు. అనాదిగా పాల వలన చర్మానికి ఏ విధమైన మేలు జరుగుతుందో, దానికై ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మొటిమల నివారణకు:

1. మొటిమల నివారణకు:

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ పాలు

చిటికెడు పసుపు

అర టీ స్పూన్ నిమ్మరసం

తయారీ విధానం:

1. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ పాలు, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ బాగా నిమ్మరసంలను కలపండి.

2. దీనిని ముఖం శుభ్రపరుచుకుని తరువాత నిదానంగా ముఖమంతటా రాసుకోండి.

3. మునివేళ్ళతో వలయకార కదలికలతో మృదువుగా మర్దన చేసుకోండి.

4. పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వండి.

5. తరువాత చల్లని నీటితో ముఖం కడుక్కుని, పొడిగా ఒత్తుకోండి.

చిట్కా: మీ ముఖం పై రంధ్రాలు తెరుచుకునేట్టు చేయడానికి , ఈ ప్యాక్ ను ఉపయోగించే ముందు ముఖానికి ఆవిరి పట్టించండి.

2. మృతకణాలను తొలగించే మాస్కు:

2. మృతకణాలను తొలగించే మాస్కు:

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ తేనె

1 టేబుల్ స్పూన్ పాలు

1 టేబుల్ స్పూన్ ఓట్ మీల్

తయారీ విధానం:

1. ఓట్ మీల్ ను బ్లెండర్ లో పొడి చేయండి.

2. దీనికి 1 టేబుల్ స్పూన్ తేనె మరియు 1 టేబుల్ స్పూన్ పాలు జత చేర్చి బాగా కలపండి.

3. దీనిని శుభ్రపరచుకున్న ముఖం మీద రాసుకుని, మునివేళ్ళతో వలయకార కదలికలతో మర్దన చేసుకోండి.

4. 20 నిమిషాలు వేచి ఉన్నాక, సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.

చిట్కా: మీరు ఉపయోగించే తేనె ఆర్గానిక్ ఉత్పత్తి అయ్యి ఉంటే మంచిది, లేని యెడల మీ చర్మానికి నష్టం జరిగే అవకాశం ఉంది.

3. చర్మానికి పోషణ అందివ్వడానికి:

3. చర్మానికి పోషణ అందివ్వడానికి:

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ పాలు

పావు ముక్క పండిన అవకాడో

తయారీ విధానం:

1. పండిన అవకాడో చిదిమి మెత్తని గుజ్జుగా చేయండి.

2. దీనికి 1 టేబుల్ స్పూన్ పాలు బాగా కలపండి.

3. దీనిని శుభ్రపరచుకున్న ముఖం మీద సమానంగా రాసుకోండి.

4. పదిహేను నిమిషాలు ఆరనివ్వండి..

5. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిని తడిపి, మీ మునివేళ్ళతో మర్దన చేసుకోండి.

6. తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.

4. మెరుగైన మేనిఛాయకై:

4. మెరుగైన మేనిఛాయకై:

కావలసిన పదార్థాలు:

తాజా గులాబీ రేకులు

2 టేబుల్ స్పూన్ల పాలు

తయారీ విధానం:

1. తాజా గులాబీ రేకులను ముద్దగా చేయండి.

2. దీనికి కొన్ని పచ్చిపాలను కలపడం వలన గులాబీ పూల ఎసెన్స్ పాలలో బాగా కలిసిపోతుంది.

3. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట ఆరనివ్వండి.

4. ముప్ఫై నిమిషాలు తరువాత చల్లని నీటితో ముఖం కడుక్కోండి.

5. ఇలా చేస్తే మెరిసే గులాబీ రంగు మేనిఛాయను సొంతం చేసుకోవచ్చు.

5. మచ్చలు తొలగించడానికి:

5. మచ్చలు తొలగించడానికి:

కావలసిన పదార్థాలు:

4-5 బాదం గింజలు

పాలు

తయారీ విధానం:

1. కొన్ని పాలు లో 4-5 బాదంపప్పులు వేసి రాత్రంతా నానబెట్టండి.

2. మరుసటిరోజు,తొక్క తొలగించిన తర్వాత బాదం పప్పును రుబ్బండి.

3. మీ ముఖానికి ఈ బాదం -పాలు పేస్ట్ రాసుకోండి.

4. పదిహేను నిమిషాల పాటు బాగా ఆరిన తరువాత చల్లని నీటితో ముఖం కడుక్కోండి.

5. ఈ మాస్కు వలన మీ ముఖం మీద మచ్చలు తొలగిపోతాయి.


English summary

Did You Know Milk Can Do So Much For The Skin?

Raw milk has several benefits. It helps to soften the skin and hydrates it, thus controlling the excess oil production on the skin. Some ingredients like pumpkin, honey, oats, turmeric, etc., when mixed with honey can solve many of your skin-related issues.Did You Know Milk Can Do So Much For The Skin?
Story first published:Friday, May 25, 2018, 12:13 [IST]
Desktop Bottom Promotion