వివిధ రకాలుగా దొరికే క్లెన్సర్లు

Subscribe to Boldsky

క్లెన్సర్లు చర్మసంరక్షణలో ప్రాథమికంగా అవసరమైన వస్తువులు. మనందరి దగ్గరా తప్పక ఒకటో రెండో క్లెన్సర్లు ఉండి ఉంటాయి. అప్పుడే మొదలుపెట్టినవారు సాధారణంగా ఒకే రకం క్లెన్సర్ ను వాడతారు, కానీ ఈ విషయాల్లో పండిపోయినవారు అన్ని రకాల క్లెన్సర్లను కలిగివుంటారు.

మీకు ఈ పాటికి రోజువారీ వాడే షవర్ జెల్ లేదా సబ్బును ముఖానికి వాడకూడదని తెలిసే ఉంటుంది. ఇవి ముఖంపై ఉండే సున్నితమైన చర్మానికి చాలా కఠినంగా ఉండి, ఎండిపోయేలా చేస్తాయి. ఇవి మొహంపై చర్మంలో కొల్లాజెన్ ను ఉత్పత్తి చేసే, సాగే గుణాన్ని పట్టి ఉంచే సహజనూనెలన్నిటినీ లాగేసి మంచి కన్నా చెడే ఎక్కువ చేస్తాయి.

Different Types Of Cleansers Available

అందుకే ముఖంపై చర్మం కోసమే ప్రత్యేకంగా తయారుచేసిన క్లెన్సర్లను వాడతారు.

ఇంతకుముందు మనందరం ముఖానికి సబ్బును వాడి పొరపాటు చేసేసాం, ఆ తప్పు ఎప్పటికీ చేయవద్దు. మనకి ఫేస్ వాష్ లే క్లెన్సర్స్ గా తెలుసు, కానీ ఇప్పుడైతే ప్రత్యేక స్థితులకి కూడా వేరే వేరే క్లెన్సర్లు మార్కెట్లో దొరకటం సులభమైపోయింది.

రోజుకి రెండు సార్లు క్లెన్సర్ తో శుభ్రపర్చుకోవాలి. పొద్దున ఒకసారి వాడటం వలన, మేకప్ కి చర్మం తాజాగా, శుభ్రంగా ఉంటుంది, అలాగే రాత్రి ఒకసారి మొత్తం మురికి, మొహంపై మిగిలిపోయిన మేకప్ తొలగించుకోటానికి వాడాలి.

అయితే ఇక ఆలస్యం లేకుండా, మార్కెట్లో లభించే వివిధ రకాల క్లెన్సర్లు ఏమిటో చూడండి.

Different Types Of Cleansers Available

1.నురగనిచ్చే క్లెన్సర్లు ; ఇవే సాధారణంగా దొరికే క్లెన్సర్లు. మనకి మిగతా రకాలు కూడా ఉంటాయని తెలీక ముందు అందరం ఈ రకమైన క్లెన్సర్లతోనే మొదలుపెడతాం. వీటిల్లో ఎక్కువగా సర్ఫెక్టెంట్లు ఉండి, చర్మాన్ని మెత్తపరిచే పదార్థాలు తక్కువ ఉంటాయి.

ఇవి బాగానే నురగనిచ్చి అన్నిరకాల మురికి, నీటికి కరగని మేకప్ ను కూడా తొలగిస్తాయి. కానీ కంటి మేకప్ కోసం దీన్ని వాడలేం ఎందుకంటే కంటికి దగ్గరగా ఈ పదార్థాలు కానీ చేరితే, కంటిలో మంట, నొప్పి కలిగిస్తాయి.

వివిధ రకాల క్లెన్సర్లు దొరుకుతాయి

ఇవి చర్మంపై ఏ పదార్థం వదిలేయకుండా, చర్మాన్ని చక్కగా శుభ్రపర్చినట్టు అన్పిస్తాయి. చాలాసేపు అలా వదిలేస్తే మాత్రం చర్మంను ఎండిపోయేలా చేస్తాయి. ఇవి అన్ని రకాల చర్మాలకి సరిపోతాయి, అన్ని రకాలు కూడా దొరుకుతాయి, కానీ జిడ్డు చర్మం ఉన్నవారికి బాగా పనిచేస్తాయి.

Different Types Of Cleansers Available

2.నూనె క్లెన్సర్లు ; వీటిల్లో ముఖాన్ని శుభ్రపర్చి, తేమపర్చే నూనె పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నీటికి కరగని మేకప్ ను చక్కగా తీసేస్తాయి ఇంకా వీటిని కంటి ప్రాంతంలో కూడా వాడవచ్చు. నీటికి కరగని మస్కారాలను వాడేవారికి ఇది శుభవార్త. ఇవి చర్మానికి పోషణనందిస్తాయి కానీ తమ పదార్థాలను చర్మంపై కొంతవరకూ వదిలేస్తాయి.

ఇవి నురగనివ్వవు, అలాగే చర్మంపై సున్నితంగా కూడా ఉంటాయి. ఈ క్లెన్సర్ పొడి చర్మం ఉన్నవారికి, ముఖంపై అదనంగా తేమ ఉండాలనుకునే వారికి చాలా సరిపోతుంది.

3.క్లెన్సింగ్ మిల్క్ ; ఈ రకం క్లెన్సర్లలో తక్కువ సర్ఫెక్టెంట్లు ఉండి, చర్మాన్ని మెత్తపరిచే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంపై సున్నితంగా ఉండి, ఎక్కువ నురగను కూడా ఇవ్వవు. ఇవి మురికిని సమర్థవంతంగా తొలగిస్తాయి కానీ నీటికి కరగని మేకప్ ను, సాధారణ మేకప్ ను కూడా తొలగించటంలో మంచివి కావు.

వీటిని వాడుతూ మేకప్ ను తొలగించటం చాలా కష్టం కావచ్చు. అందుకని మీరు క్రమం తప్పకుండా మేకప్ వేసుకునే వారైతే, ఇవి వాడవద్దు. ఇవి పొడి చర్మం ఉన్నవారికి సరిపోతాయి అలాగే తమ పదార్థాన్ని కొంత చర్మంపై వదిలేస్తాయి కూడా.వివిధ రకాల క్లెన్సర్లు దొరుకుతాయి

Different Types Of Cleansers Available

4.క్లెన్సింగ్ బామ్ లు; ఇవి చర్మాన్ని శుభ్రపర్చి, తేమను అందించే నూనె పదార్థాలు ఎక్కువగా కలిగివుంటాయి, తక్కువ సర్ఫెక్టంట్లు ఉంటాయి. వీటిని ఘనరూపంలో బామ్ గా అమ్ముతారు, కాకపోతే ఒకసారి చర్మంపై రాయగానే, రుద్దగానే నూనెలాగా కరిగిపోతాయి. ఇవి మొండి మేకప్ ను, వాటర్ ఫ్రూఫ్ కంటి మేకప్ ను కూడా తొలగించటంలో చాలా బాగా పనిచేస్తాయి.

కొన్ని క్లెన్సింగ్ బామ్ లు చివరికి వచ్చేసరికి నురగనిస్తాయి. తర్వాత కన్పించే ప్రభావంతో మీకు అసలు క్లెన్సర్ ముఖానికి వాడినట్లు అన్పించదు కానీ ముఖం శుభ్రంగా, తేమగా కన్పిస్తుంది. కొంచెం క్లెన్సింగ్ పదార్థం ముఖంపైనే ఉండిపోవచ్చు. ఇలాంటి క్లెన్సర్లు చర్మం ఎండిపోయినవారికి, కాంబినేషన్ చర్మం ఉన్నవారికి ఉపయోగపడతాయి.

Different Types Of Cleansers Available

5.మిసెల్లార్ నీరు ; ఇందులో సున్నితమైన సర్ఫెక్టంట్లు, చర్మాన్ని మెత్తపరిచే లేపనాలు ఉంటాయి. అందుకని ఇవి అన్నిటికన్నా మంచి క్లెన్సర్లు. ఇవి నురగ ఏర్పడకుండా చేసి, దూది లేదా కాటన్ ప్యాడ్ తో వాడవచ్చు, అందుకని వీటిని కడిగేయక్కర్లేదు. ఇవి చర్మంపై సున్నితంగా ఉండి, మేకప్ ను, అన్నిరకాల మురికిని తొలగించేస్తాయి.

వివిధ రకాల క్లెన్సర్లు దొరుకుతాయి

మార్కెట్లో ఈ కాలంలో అనేక రకాల మిసెల్లార్ వాటర్ దొరుకుతున్నాయి. కొన్నిటిలో నూనెలు కూడా కలిపి వస్తున్నాయి. మీ నీటికి కరగని మేకప్ ను వీటితో సులువుగా తొలగించుకోవచ్చు.

ఇవి కేవలం మేకప్ ను కరిగించేస్తాయి. ఇంకోవైపు, మేకప్ ను తీసేయడానికి ఏ మిసెల్లార్ నీరు అయినా పనిచేస్తుంది. ఇది మేకప్ ను వదిలేయకుండా శుభ్రంగా తుడిచేస్తుంది, సున్నితమైన చర్మం ఉన్నవారు కూడా దీన్ని వాడవచ్చు.

6.క్లెన్సింగ్ వైప్స్ ; గుడ్డ ముక్కలపై శుభ్రపర్చే లోషన్లను కలిపి ఈ క్లెన్సింగ్ వైప్స్ తయారుచేస్తారు. ఇవి మురికిని తొలగించటానికి మంచివి, కానీ మేకప్ ను సరిగ్గా తీసేయలేవు. ఇంకా ఈ వైప్ ను మీ ముఖంపై రుద్దినప్పుడు జరిగే ఘర్షణ మీ చర్మానికి అంతమంచిది కాదు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Different Types Of Cleansers Available

    Using a regular soap or a gel for washing face might may your skin dry and rough. As these can rip off the natural oils from your face. By using cleanser can help your skin get back the glow and the softness. There are different types of cleansers such as oil cleansers, cleansing milk , cleansing bamls etc
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more