Latest Updates
-
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.!
బేకింగ్‌సోడా, తేనె మాస్క్‌తో మీ ముఖం కాంతివంతం చేసుకోండిలా...
బేకింగ్‌సోడా, తేనె మాస్క్‌తో మీ ముఖం కాంతివంతం చేసుకోండిలా...
మీరు సడెన్‌గా ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలా ? ఎక్కువగా టైం లేదా.. మరి అలాంటప్పుడు ఏం చేయాలి ? అయితే ఇది చదవండి అతి తక్కువ సమయంలోనే మీ ముఖం కాంతివంతం అయ్యే ఇన్‌స్టంట్ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తాం. కేవలం బేకింగ్ సోడా, తేనె, ఆలివ్ ఆయిల్ ఉంటే చాలు మీ ముఖం కాంతి వంతం అవ్వడం నిమిషాల్లో పని.
మన ఇంట్లోనే దొరికే ఈ పదార్థాలతో మంచి ఫేషియల్ మాస్క్ రూపొందించి మీ ముఖాన్ని కాంతివంతం చేయవచ్చు. అప్పుడు మీ ముఖం కాంతి వంతం గానూ, ఫ్రెష్ గానూ కనిపిస్తుంది. మరి ఆ సీక్రెట్ ఏంటో చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు :
ఒక టీస్పూన్ ఆలివ్ నూనె
ఒకటిన్నర టీస్పూన్ తేనె
ఒక టీస్పూన్ బేకింగ్ సోడా

ఎలా చేయాలి
1. ముందుగా ఒక శుభ్రమైన పాత్రలో ఆలివ్ నూనె, తేనె తీసుకోవాలి
2. రెండింటిని బాగా కలపాలి.
3. మిశ్రమంలో బేకింగ్ సోడా కలపాలి. అన్నింటినీ బాగా కలిపి మిశ్రమంగా మార్చాలి
4. మిశ్రమం పలుచగా అనిపిస్తే మరింత బేకింగ్ సోడా కలపాలి
5. మిశ్రమాన్ని బాగా కలపాలి. ఎలాంటి పొడి పదార్థాలు లేకుండా ముద్దలా చేసుకోవాలి.

ఎలా అప్లై చేయాలి..
1. ముందుగా ముఖం, మెడను శుభ్రంగా కడగాలి
2. తర్వాత మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేయాలి
3. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు గుండ్రంగా మొఖం, మెడపై మసాజ్ చేయాలి
4. మసాజ్ అనంతరం 20 నిమిషాల పాటు వదిలేయాలి
5. గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి
6. మీ చర్మం కొద్దిగా జిడ్డుగా కనిపించవచ్చు. అందుకోసం టోనర్ వాడినట్లయితే మీ చర్మం మరింత సున్నితంగా, కాంతివంతంగా తయారవుతుంది.

బేకింగ్ సోడా ఉపయోగాలు :
బేకింగ్ సోడా చర్మంపై ఉన్న నిర్జీవ కణాలను తొలగించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఫలితంగా ముఖం కాంతి వంతం అవుతుంది. అలాగే బేకింగ్ సోడా యాంటి సెప్టిక్ కావడంతో చర్మంపై ఇన్ఫెక్షన్, అలాగే ఎర్రబారడం నుంచి కాపాడుతుంది. అలాగే చర్మంపై పొరలు తెరుచుకొని రక్త ప్రస్తరణ బాగా జరుగుతుంది. అలాగే మొటిమల వంటివి తొలగించేందుకు సైతం బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది.

ఆలివ్ ఆయిల్ ఉపయోగాలు :
ఆలివ్ ఆయిల్ వల్ల శరీరం కాంతివంతంగానూ మృదువుగా అయ్యేందుకు దోహదపడుతుంది. యాంటి ఆక్సిడెంట్లుగా పనిచేసే ఆలివ్ ఆయిల్ గుణం వల్ల చర్మ కణాలను బాగు చేస్తుంది. అలాగే నిర్జీవ కణాలను తొలగిస్తుంది. చర్మం కాంతి వంతంగా అవుతుంది.

తేనె ఉపయోగాలు :
తేనే వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. సహజంగా బ్లీచింగ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కాంప్లెక్సేషన్ బాగుపడేందుకు దోహదపడుతుంది. అలాగే చర్మాన్ని హైడ్రేట్ చేసేందుకు సైతం దోహదపడుతుంది. ఒక మృదువైన అనుభూతిని ఇవ్వడంలో తేనే దోహదం చేస్తుంది.
మీ విలువైన సలహాలు ఇచ్చేందుకు కింద కామెంట్ బాక్సులో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మరిన్ని బ్యూటీ టిప్స్ పొందండి.



Click it and Unblock the Notifications