For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మగవారికోసం ప్రత్యేకమైన DIY ఫెయిర్ స్కిన్ ఫేస్ మాస్క్స్

  |

  మన దేశంలోని చాలా మంది మగవారు ఫెయిర్ స్కిన్ టోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసినదే. ఇందుకోసం, మార్కెట్ లో లభ్యమయ్యే అనేక కమర్షియల్ క్రీమ్ లను వాడుతున్నారు. కొన్ని సార్లు ఈ క్రీమ్ లు అలాగే లోషన్లు చర్మాన్ని మరింత దెబ్బతీస్తాయి. వాటిలో ఎక్కువగా కెమికల్స్ ఉండటం వలన ఇలా జరుగుతుంది. అందువలన, నేచురల్ హోమ్ రెమెడీని వాడటం ద్వారా చర్మం దెబ్బతినదు. ఇంకా చెప్పాలంటే, హెర్బల్ ప్రోడక్ట్స్ లో స్కిన్ డేమేజింగ్ కెమికల్స్ ఉండవు.

  మార్కెట్ లో లభ్యమయ్యే కమర్షియల్ క్రీమ్స్ అనేవి కాస్తంత ఖరీదైనవే. వీటిని ప్రిఫర్ చేయడం వలన జేబుకు చిల్లు ఏర్పడుతుందే తప్ప ఆశించిన ఫలితం లభించదనే చెప్పుకోవాలి. కంగారు పడకండి. ఈ ప్రోడక్ట్స్ కు నేచురల్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. వాటి గురించే ఇవాళ ప్రస్తావించబోతున్నాము. నేచురల్ ఫేస్ పాక్స్ ను వాడటం ద్వారా మగవారు తమ చర్మాన్ని మరింత ఫెయిర్ గా మార్చుకోవచ్చు.

  DIY Face Masks For Men To Get Fairer Skin ,

  చర్మ సౌందర్యం దెబ్బతినడానికి పొల్యూషన్ కూడా తన వంతు పాత్ర పోషిస్తుంది. రోజంతా పొల్యూషన్ బారిన పడటం వలన చర్మ సౌందర్యం దెబ్బతింటుంది. చర్మ రంధ్రాలలో దుమ్ము పేరుకుపోతుంది. తద్వారా, చర్మం డల్ గా మారుతుంది. కాబట్టి చర్మ సంరక్షణకై మొదటి అడుగు చర్మాన్ని శుభ్రపరచుకోవడంతోనే ప్రారంభమవుతుంది.

  మీ చర్మం డ్రై గా ఉంటే మీరు ఫేస్ వాష్ లేదా మాయిశ్చరైజర్ ను ప్రయత్నించవచ్చు. ఇవి పోర్స్ లో ఇరుక్కున్న దుమ్మూ ధూళిని తొలగిస్తాయి. తేనెని వాడటం ద్వారా చర్మాన్ని క్లీన్స్ చేసుకోవచ్చు. అలాగే, చర్మాన్ని హైడ్రేటెడ్ గా అలాగే సాఫ్ట్ గా ఉంచుకోవచ్చు.

  ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే శనగపిండిని స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా చేసుకోవడం. ఇది చర్మంలోని అదనపు నూనెను తొలగిస్తుంది. చర్మంపై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నూ కలిగించదు.

  ఇప్పుడు, మనం మగవారి చర్మాన్ని ఫెయిర్ గా మార్చే కొన్ని అద్భుతమైన ఫేస్ మాస్క్స్ ల గురించి తెలుసుకుందాం. మరి ఈ ఫేస్ ఫ్యాక్స్ ను పరిశీలించండి మరి.

  1. హనీ లెమన్ ఫేస్ మాస్క్:

  ఇది మగవారి చర్మాన్ని మరింత ఫెయిర్ గా మార్చేందుకు ఉపయోగపడే ఫేస్ మాస్క్. మగవారి చర్మం ఆడవారి చర్మంతో పోలిస్తే కాస్తంత కఠినంగా ఉంటుంది. అందువలన ఈ ఫేస్ ప్యాక్ మగవారి చర్మానికి సరిగ్గా సరిపోతుంది. నిమ్మలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది, చర్మంపైన డెడ్ స్కిన్ ను తొలగించి కొత్త సెల్ గ్రోత్ ను పెంపొందించడానికి తోడ్పడుతుంది. తద్వారా చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

  విటమిన్ సి అనేది మెలనిన్ స్థాయిని తగ్గిస్తుంది. తద్వారా ప్రకాశవంతమైన కొత్త స్కిన్ సెల్స్ గ్రోత్ కు తోడ్పడుతుంది. తేనె సహజమైన మాయిశ్చరైయిజర్ గా పనిచేస్తుంది. చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. చర్మంలోని పొడిబారే తత్వాన్ని తగ్గిస్తుంది. స్కిన్ బర్న్స్ తీవ్రతరం కాకుండా ఉండేందుకు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ ను వాడటాన్ని ప్రిఫర్ చేయండి.

  కావలసిన పదార్థాలు:

  నిమ్మ : ఒక టేబుల్ స్పూన్

  తేనె : ఒక టేబుల్ స్పూన్

  తయారుచేసే విధానం :

  తేనెని అలాగే నిమ్మరసాన్ని ఒక పాత్రలోకి తీసుకుని ఈ రెండిటినీ బాగా కలపండి. ఈ మాస్క్ ను ముఖంపై అప్లై చేయండి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచండి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోండి. ఈ ప్రాసెస్ ను వారానికి ఒకసారి వాడితే మంచి ఫలితాలను పొందవచ్చు.

  పింపుల్స్ కలిగిన వారు అలాగే డార్క్ స్కిన్ కలిగిన వారు ఈ ప్యాక్ ను వాడటం ద్వారా ఆశించిన ఫలితం పొందుతారు.

  2. అలోవెరా మరియు ఆరెంజ్ జ్యూస్:

  ఈ ప్యాక్ అనేది అన్ని రకాల చర్మాలకు నప్పుతుంది. డ్రై స్కిన్ ను మాయిశ్చరైయిజ్ చేయడానికి అలాగే ఆయిలీ స్కిన్ లో అదనపు నూనెను తొలగించడానికి ఈ ప్యాక్ సహకరిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి లభ్యమవుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. అలోవెరా పల్ప్ లో మెడిసినల్ ప్రాపర్టీలు కలవు. ఇవి ఏ రకమైన చిన్నపాటి స్కిన్ ఇన్ఫెక్షన్ నైనా లేదా ఇరిటేషన్ నైనా తగ్గించేందుకు తోడ్పడతాయి. ఆయిలీ స్కిన్ కలిగిన వారికి ఇది ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదం వంటిది. ఎందుకంటే, ఇది చర్మంపైన ఉండే అదనపు ఆయిల్ ను తొలగించేందుకు తోడ్పడుతుంది.

  కావలసిన పదార్థాలు:

  అలోవెరా : రెండు టేబుల్ స్పూన్లు

  ఆరెంజ్ జ్యూస్ : పావు కప్పు

  తయారుచేసే విధానం:

  అలోవెరా మరియు ఆరెంజ్ జ్యూస్ లను బాగా కలిపి ప్రభావిత ప్రాంతంపై ఈ సొల్యూషన్ ను అప్లై చేయండి. పదిహేను నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత శుభ్రమైన నీటితో రిన్స్ చేయండి.

  3. అరటి మరియు పెరుగు ప్యాక్:

  అరటిలో విటమిన్స్ ఏ, బీ, సీ, మరియు ఈ లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఫాస్ఫరస్, కాపర్, జింక్ వంటి మినరల్స్ కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. పెరుగు అనేది స్కిన్ లైటెనింగ్ ఏజెంట్ గా వ్యవహరిస్తుంది. ఇది పొడిబారిన అలాగే జిడ్డు చర్మాలకు తగిన విధంగా ఉపయోగపడుతుంది. అయితే, పెరుగులో ఫ్యాట్ కంటెంట్ లేకుండా చూసుకోండి.

  కావలసిన పదార్థాలు :

  అరటి : ఒక చిన్న ముక్క

  పెరుగు : ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు

  తయారుచేసే విధానం:

  అరటిని మ్యాష్ చేసి అందులో పెరుగును జోడించండి. ఈ రెండిటినీ బాగా కలిపి స్మూతీగా తయారుచేసుకోండి. దీనిని ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల వరకు అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత చల్లటి నీటితో రిన్స్ చేయండి.

  ఫెయిరెర్ స్కిన్ టోన్ కోసం పాటించవలసిన చిట్కాలు

  నీటిని తాగాలి : శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి. నీళ్ల్లు చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. ఆ విధంగా పింపుల్స్ అనేవి కూడా తగ్గుముఖం పడతాయి.

  స్క్రబ్ : మీ చర్మాన్ని వారానికి రెండు సార్లు స్క్రబ్ చేసుకోవాలి. తద్వారా, చర్మంపై పేరుకుపోయిన దుమ్ము పదార్థాలను తొలగించుకోవచ్చు. ఆ విధంగా, మీ చర్మం యొక్క సహజ కాంతిని వెలికితీయవచ్చు.

  ఫేస్ ప్యాక్ : తరచూ క్రమబద్ధంగా ఫేస్ ఫ్యాక్స్ ను అప్లై చేసుకోవడం ద్వారా బ్రేక్ అవుట్స్ ను అవాయిడ్ చేయవచ్చు. చర్మాన్ని శుభ్రంగా అలాగే కాంతివంతంగా మార్చుకోవచ్చు. అలాగే, ఎండలో బయటికి వెళ్లాల్సి వచ్చిన ప్రతీసారి సన్ స్క్రీన్ ను అప్లై చేసుకోవడం మంచిది. ఆ విధంగా డార్క్ స్కిన్ ను అరికట్టవచ్చు.

  డైట్ : బాలన్స్డ్ డైట్ ను తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ తో కూడిన బాలన్స్డ్ డైట్ ను మీరు ప్రిఫర్ చేయాలి. ఈ విధంగా చేస్తే మీ స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది. మీ చర్మం మంచి కండిషన్ లో ఉంటుంది.

  మాయిశ్చరైజింగ్ : చర్మాన్ని రేయి పగలూ మాయిశ్చరైజ్ చేసుకోండి. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. చర్మంపై అదనపు నూనెను తొలగించుకునేందుకు అలాగే పొడిబారటాన్ని అరికట్టేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి.

  English summary

  DIY Face Masks For Men To Get Fairer Skin

  Majority of men in our country desire having a fair skin tone and hence try many commercially available creams and lotions to make themselves appear fair. Sometimes, these creams and lotions can cause more damage to the skin because of the chemicals present in them. Using a natural home remedy can never damage the skin, as it is completely herbal and is free of any skin-damaging chemicals.
  Story first published: Monday, May 21, 2018, 7:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more