మచ్చలేని చర్మాన్ని పొందేందుకై DIY బొప్పాయి అరటి ఫేస్ స్క్రబ్

Subscribe to Boldsky

మచ్చలేని చర్మం కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, వివిధ కారణాల వలన చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఈ చర్మ సమస్యలకు స్పష్టంగా ఇదీ కారణమని మనం ప్రత్యేకించి చెప్పలేము. నిజానికి, ఒత్తిడితో పాటు కాలుష్యం వలన చర్మం తన సహజమైన మృదుత్వాన్ని అలాగే కోమలత్వాన్ని కోల్పోతుంది. చర్మంలోని సహజకాంతి దెబ్బతింటోంది. ఇక్కడ మనం లైఫ్ స్టయిల్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

బిజీ షెడ్యూల్స్ వలన ఏది పడితే అది తినడం జరుగుతోంది. ప్రశాంతంగా ఆరోగ్యకరమైన ఆహారానికి సమయం కేటాయించడం వీలు కావడం లేదు. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోడంతో పాటు కొన్ని సార్లు మీల్స్ ను స్కిప్ చేయడం కూడా చర్మ సౌందర్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. మీల్స్ ను స్కిప్ చేయడం వలన ఆకలిని తీర్చుకోవాటానికి జంక్ ఫుడ్ ను తరచూ తీసుకోవడం జరుగుతుంది. వీటికి తోడు, సరైన నిద్ర లేకపోవటం కూడా చర్మ సౌందర్యాన్ని దెబ్బతీయడంలో తనవంతు పాత్ర పోషిస్తోంది. నిద్రలేమి సమస్య ఈ మధ్య ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ఇది కూడా చర్మ సమస్యలకు దారితీస్తుంది. నిద్ర తగినంత లేకపోవటంతో శరీరంలోని బయలాజికల్ క్లాక్ పనితీరు దెబ్బతింటుంది. దీని వలన ముఖంలోని సహజ కాంతి తగ్గిపోతుంది.

DIY Papaya Banana Face Scrub For Flawless Skin

అయితే, ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని తగిన విధంగా లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులను చేసుకోవాలి. వాటితో పాటు స్కిన్ కేర్ రొటీన్ లో కొన్ని ముఖ్యమైన స్కిన్ ఫ్రెండ్లీ పదార్థాలని భాగం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మ సమస్యలను అరికట్టవచ్చు. చర్మంపై సహజ కాంతిని వెలికితీయవచ్చు. ప్రకృతి ప్రసాదించిన పదార్థాలను స్కిన్ కేర్ లో భాగంగా ఉపయోగించడం ద్వారా చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఈ ఆర్టికల్ లో బొప్పాయిలో దాగున్న చర్మ సంరక్షణ గుణాల గురించి తెలుసుకుందాం. అలాగే చర్మ సంరక్షణలో అరటి పండు పాత్రను కూడా తెలుసుకుందాం. ఈ బొప్పాయి అరటి ఫేస్ మాస్క్ ద్వారా చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

బాగా పండిన బొప్పాయి పండులో పావు భాగం

దోశకాయలో పావు భాగం

బాగా పండిన అరటిలో సగ భాగం

• అరటిపండు ప్రయోజనాలు:

• అరటిపండు ప్రయోజనాలు:

ఇది ఎన్నో యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ లో ముఖ్యమైన పదార్థంగా చోటు సంపాదించుకుంటోంది. దీనిలోనున్న హైడ్రేటింగ్ మరియు మాయిశ్చరైజింగ్ గుణాలు అరటిని చర్మ సంరక్షణకారిగా చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. అరటి, చర్మాన్ని ఫైన్ టోన్ చేసి మృదువుగా మారుస్తుంది. అలాగే, దీనిని రెగ్యులర్ గా వాడటం వలన ఫైన్ లైన్స్ ను అలాగే ముడతలను తగ్గిస్తుంది. మీ చర్మం యవ్వనంగా అలాగే కాంతివంతంగా మారుతుంది.

• దోశకాయ ప్రయోజనాలు:

• దోశకాయ ప్రయోజనాలు:

దోశకాయలో స్కిన్ లైటెనింగ్ ప్రాపర్టీలు అధికం. అందువలన, దీనిని రెగ్యులర్ గా వాడటంతో మొటిమల మచ్చలు అలాగే బ్లేమిషెష్ కనుమరుగవుతాయి. చర్మాన్ని సహజంగా రేడియేట్ చేస్తుంది. అందువలన, స్కిన్ టోన్ లైట్ గా మారుతుంది. ఇంఫ్లేమ్డ్ యాక్నేతో ఏవైనా సమస్యలు ఉంటే దోశకాయను ఉపయోగించడం ద్వారా ఆ సమస్యలను తగ్గించుకోవచ్చు. దోశకాయలోనున్న సూతింగ్ ఎఫెక్ట్స్ వలన సన్ బర్న్ కూడా తగ్గుముఖం పడుతుందన్న విషయం తెలిసినదే. అందువలన, స్కిన్ కేర్ రొటీన్ లో దోశకాయకు స్థానం కలిపిస్తే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

• బొప్పాయి వలన కలిగే ప్రయోజనాలు:

• బొప్పాయి వలన కలిగే ప్రయోజనాలు:

బొప్పాయిలో విటమిన్ ఏ మరియు సీ లు కలవు. విటమిన్ ఏ ఏజింగ్ సైన్స్ ను తగ్గించి చర్మాన్ని చక్కగా టోన్ చేస్తుంది. మరోవైపు, విటమిన్ సి కొలాజెన్ ప్రొడక్షన్ ను బూస్ట్ చేస్తుంది. అందువలన, డ్రై మరియు ఫ్లేకీ స్కిన్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో లభించే ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్స్ అనేవి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి తోడ్పడతాయి. తద్వారా, చర్మంలోని సహజ కాంతిని వెలికితీస్తాయి. చర్మాన్ని హైడ్రేట్ చేసి మాయిశ్చరైజ్ చేయడానికి పొటాషియం తోడ్పడుతుంది. యాక్నే, ఎగ్జిమా మరియు మొటిమల వంటి చర్మ సమస్యలను తగ్గించేందుకు బొప్పాయిలో ఉండే పపైన్ అనే పదార్థం తోడ్పడుతుంది. అందువలన, చర్మ సమస్యల నుంచి ఉపశమనం కోసం బొప్పాయిని చర్మ సంరక్షణలో భాగంగా చేసుకోవడంతో గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు. ఇది చర్మాన్ని హీల్ చేయడమే కాదు, ఇది మీ చర్మాన్ని మరింత కాంతివంతంగా అలాగే ప్రకాశవంతంగా మార్చేందుకు తోడ్పడుతుంది.

• తయారుచేసే విధానము:

• తయారుచేసే విధానము:

బొప్పాయి, దోశకాయ మరియు అరటిపండును పీల్ చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.

వీటిని బ్లెండర్ లో ఉంచి మెత్తటి ప్యూరీలా తయారుచేసుకోవాలి.

మీది సెన్సిటివ్ స్కిన్ అయితే, ఈ పేస్ట్ ను లైట్ గా అప్లై చేసుకోవడం మంచిది.

అటువంటి పరిస్థితులలో, పదార్థాలన్నిటినీ బ్లెండ్ చేసే సమయంలో కొంచెం నీళ్లను జోడించడం ద్వారా పేస్ట్ ను తయారుచేసుకోవచ్చు.

• అప్లై చేసుకునే విధానం:

• అప్లై చేసుకునే విధానం:

మీ ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ముఖంపై తడిని మెత్తని వస్త్రంతో తుడుచుకోండి.

ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ముఖంపై అప్లై చేసుకోండి.

ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లా అప్లై చేసే క్రమంలో కంటి కింద అలాగే నోటి చుట్టూ సెన్సిటివ్ ఏరియాస్ పై ఈ మిశ్రమాన్ని అప్లై చేయకండి.

ఈ మిశ్రమాన్ని ముఖంపై ఈవెన్ గా అప్లై చేసిన తరువాత పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ మిశ్రమాన్ని కదపవద్దు. కాసేపటి తరువాత, మాస్క్ ఎండిపోతుంది.

• అప్లై చేసుకునే విధానం:

• అప్లై చేసుకునే విధానం:

పదిహేను నుంచి ఇరవై నిమిషాల తరువాత ఈ మాస్క్ ను తొలగించండి.

మాస్క్ ను తొలగించేందుకు గోరువెచ్చటి నీటిని వాడండి. ఇది మాస్క్ ను వదులుగా చేస్తుంది. ఆ తరువాత చల్లటి నీటిని చల్లుకోండి.

శుభ్రమైన టవల్ తో ముఖాన్ని తుడుచుకోండి.

మీ స్కిన్ టోన్ డ్రై గా ఉంటే ఈ మాస్క్ ను అప్లై చేసిన తరువాత చర్మం డ్రైగా మారే ప్రమాదం ఉంది. అందువలన, తేలికపాటి మాయిశ్చరైజర్ ను వాడండి.

మాయిశ్చరైజర్ ను వాడటం ద్వారా ఈ మాస్క్ యొక్క సుగుణాలు ఏమీ తగ్గిపోవు. కాబట్టి, మాయిశ్చరైజర్ ను వాడండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    DIY Papaya Banana Face Scrub For Flawless Skin

    Face packs are a very good way of rejuvenating your body. And, they are cost-effective too, as they are homemade and often involve basic ingredients that are readily available in your kitchen shelves. To get radiant and flawless skin, you can try making a papaya-banana face pack at home and see the wonders for yourself.
    Story first published: Saturday, May 19, 2018, 13:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more