For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయిలీ స్కిన్ సమస్యలకు గుడ్ బై చెప్పేందుకు DIY రైస్ ఫ్లోర్ మరియు గ్రీన్ టీ ఫేస్ ప్యాక్

ఆయిలీ స్కిన్ సమస్యలకు గుడ్ బై చెప్పేందుకు DIY రైస్ ఫ్లోర్ మరియు గ్రీన్ టీ ఫేస్ ప్యాక్

|

స్కిన్ డేమేజ్ ను అరికట్టడం సాధ్యం కాదు. మీరు చర్మ సంరక్షణకై తగిన చర్యలు తీసుకోకపోతే ఏజింగ్ లక్షణాలు త్వరగా చర్మంపై దర్శనమిస్తాయి.

కెమికల్ రిచ్ ప్రోడక్ట్స్ అనేవి చర్మ సంరక్షణకు తోడ్పడతాయని ప్రకటనలలో కనిపిస్తుంది. అయితే, వాటిని వాడటం ద్వారా చర్మం దెబ్బతినే ప్రమాదం మరింత ఎక్కువవుతుంది. రోజు వారి లైఫ్ లో కాస్తంత సమయాన్నిస్కిన్ కేర్ కు కేటాయిస్తే చర్మ సమస్యలను అరికట్టవచ్చు. మీ స్కిన్ టైప్ ను దృష్టిలో పెట్టుకుని వాటికి తగిన పదార్థాలను మీరు స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగిన పదార్థాలను స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా చేసుకోవాలి.

ప్రీమెచ్యూర్ ఏజింగ్ ను అరికట్టేందుకు హెల్తీ స్కిన్ కేర్ రొటీన్ ను పాటించాలి. ప్రతి ఇంట్లో సాధారణంగా లభ్యమయ్యే పదార్థాలతో ఫేస్ ప్యాక్స్ ను తయారుచేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించే పదార్థాలు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం గ్రీన్ టీ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి.

DIY Rice Flour And Green Tea Face Pack For Oily Skin

రైస్ ఫ్లోర్ తో గ్రీన్ టీను కలపడం వలన అద్భుతమైన ఫేస్ ప్యాక్ తయారవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను వాడితే చర్మానికి తగిన పోషణ లభించడంతో పాటు చర్మం నిగనిగలాడుతుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ కలిగిన వారికి ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆయిలీ స్కిన్ కై రైస్ ఫ్లోర్ మరియు గ్రీన్ టీ ఫేస్ ప్యాక్

ఆయిలీ స్కిన్ కై రైస్ ఫ్లోర్ మరియు గ్రీన్ టీ ఫేస్ ప్యాక్

కావలసిన పదార్థాలు:

రెండు టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్

ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ

ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం

తయారుచేసే విధానం :

తయారుచేసే విధానం :

ఈ పదార్థాలని బాగా కలిపి మెత్తటి పేస్ట్ ను తయారుచేసుకోండి.

ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకోండి.

కంటి చుట్టూ అలాగే నోటి చుట్టూ ఈ ప్యాక్ ను అప్లై చేసుకోకండి.

పదిహేను నిమిషాల పాటు లేదా ఈ మిశ్రమం ఆరేంతవరకు దీనిని తొలగించవద్దు.

ఇప్పుడు చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోండి తడిని టవల్ తో తుడుచుకోండి.

ఈ ప్రాసెస్ ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు పాటించాలి.

ఈ మిశ్రమంలో వాడిన రైస్ ఫ్లోర్

ఈ మిశ్రమంలో వాడిన రైస్ ఫ్లోర్

ఈ మిశ్రమంలో వాడిన రైస్ ఫ్లోర్ లో నూనెను గ్రహించే గుణాలు ఎక్కువగా గలవు. అందువలన, ఆయిలీ స్కిన్ కు ఇది మంచి ఎక్స్ఫోలియేటర్ లా పనిచేస్తుంది. చర్మాన్ని ఎక్స్ఫోలియెట్ చేయడంతో పాటు ట్యాన్ ను తొలగించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా, దీనిని ఫేస్ ప్యాక్ లో వాడటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.

విటమిన్ బి రైస్ ఫ్లోర్ లో పుష్కలంగా లభిస్తుంది. ఇది కొత్త స్కిన్ సెల్స్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అందువలన, రైస్ ఫ్లోర్ ను అనేక ఫేస్ ప్యాక్ లలో ప్రముఖంగా వాడతారు. పిగ్మెంటేషన్ మరియు యాక్నే స్పాట్స్ ను తొలగించేందుకు ఇది తోడ్పడుతుంది.

చర్మానికి గ్రీన్ టీ ద్వారా అందే ప్రయోజనాలు

చర్మానికి గ్రీన్ టీ ద్వారా అందే ప్రయోజనాలు

• గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అందువలన, ఇది చర్మసంరక్షణలో పాపులర్ ఇంగ్రిడియెంట్ గా పేరొందింది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మాన్ని సంరక్షిస్తాయి. గ్రీన్ టీ ను వాడటం ద్వారా స్కిన్ సెల్స్ ఆరోగ్యవంతంగా పనిచేస్తాయి. తద్వారా, చర్మం నిగనిగలాడుతుంది.

• చర్మం యొక్క ఆరోగ్యం అలాగే చర్మం నిగారింపు అనేది గ్రీన్ టీను వినియోగించడం ద్వారా మెరుగవుతుంది. శరీరంలోని టాక్సిన్స్ ను ఎలిమినేట్ చేసేందుకు ఇది శక్తివంతంగా పనిచేస్తుంది. ఫేస్ ప్యాక్ లో గ్రీన్ టీను వాడటం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. స్కిన్ టెక్స్చర్ మెరుగవుతుంది.

• స్కిన్ సెల్స్ పనితీరు మెరుగవడం ద్వారా స్కిన్ సెల్ టర్నోవర్ సాధారణ స్థితికి చేరుతుంది. అందువలన ఏజింగ్ చిహ్నాలైన ఏజ్ స్పాట్స్, ముడతలు, సాగే చర్మం మరియు ఫైన్ లైన్స్ వంటివి త్వరగా చర్మంపై దర్శనమివ్వవు.

• గ్రీన్ టీ లో ట్యానిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి కంటి కింద డార్క్ సర్కిల్స్ మరియు పఫీనెస్ సమస్యను తగ్గించేందుకు తోడ్పడతాయి. కంటి కింద చర్మం లోపల బ్లడ్ వెజిల్స్ కుంచించుకుపోవడం వలన ఈ సమస్య తొలగుతుంది.

• గ్రీన్ టీలో కేట్చిన్స్ లభిస్తాయి. ఇందులో శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు కలవు. అందువలన, యాక్నే సమస్య తగ్గుతుంది. అలాగే బ్రేకవుట్స్ అరికట్టబడతాయి. (ఆయిలీ స్కిన్ అనేది ఎక్కువగా బ్రేకవుట్స్ అలాగే యాక్నే బారిన పడుతుంది).

• స్కిన్ పోర్స్ లో దాగున్న ఇంప్యూరిటీస్ ను గ్రీన్ టీను ఫేస్ ప్యాక్ రూపంలో వాడటం ద్వారా తగ్గించుకోవచ్చు. అలాగే, గ్రీన్ టీ అనేది స్కిన్ ను టోన్ చేసి పోర్ సైజ్ ను తగ్గిస్తుంది.

రైస్ ఫ్లోర్ మరియు గ్రీన్ టీ ను కలిపి తయారు చేసిన ఫేస్ ప్యాక్ ను వాడేటప్పుడు పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు

రైస్ ఫ్లోర్ మరియు గ్రీన్ టీ ను కలిపి తయారు చేసిన ఫేస్ ప్యాక్ ను వాడేటప్పుడు పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు

• తాజా లేదా వాడిన గ్రీన్ టీ బ్యాగ్స్ లేదా పౌడర్ రూపంలో ఉన్న గ్రీన్ టీను వాడవచ్చు. మీరు గ్రీన్ టీను ఏ విధంగా వాడినా గ్రీన్ టీ నుంచి వచ్చే చర్మసంరక్షణ ఫలితాలను మాత్రం పొందగలరు.

• ఈ ప్యాక్ ను వాడే ముందు ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. దీని వలన పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందువలన స్క్రబ్బింగ్ ప్రాసెస్ సజావుగా జరుగుతుంది. చర్మంలోని ఇంప్యూరిటీస్ అనేవి తొలగిపోతాయి.

• ఈ ప్యాక్ ను అప్లై చేసుకున్న తరువాత, ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి. దీని వలన పోర్స్ తిరిగి క్లోజ్ అవుతాయి. పోర్స్ సైజ్ కూడా తగ్గుతుంది.

English summary

DIY Rice Flour And Green Tea Face Pack For Oily Skin

Skin damage is something that cannot be avoided. If you do not do anything about maintaining your skin's health, then you are just making your skin age quicker than usual.Contrast to what chemical-rich products claim, maintaining a good skin care routine is not at all tough. It just requires a few minutes out of your daily life. A simple skincare routine should be designed based on your skin type and using ingredients that are rich in antioxidants.
Story first published:Thursday, June 21, 2018, 7:09 [IST]
Desktop Bottom Promotion