For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ DIY టర్మరిక్ ఫేస్ ప్యాక్ తో మచ్చలేని చర్మాన్ని పొందండి

ఈ DIY టర్మరిక్ ఫేస్ ప్యాక్ తో మచ్చలేని చర్మాన్ని పొందేందుకు

|

చర్మసౌందర్యాన్ని పరిరక్షించుకోవడంతో మన అఫియరెన్స్ ప్లెజంట్ గా ఉంటుంది. అయితే, చర్మ సంబంధిత సమస్యలు ఎదురవడం సహజమే. పింపుల్స్, స్కార్స్, యాక్నే, బ్లేమిషెస్ మరియు డార్క్ స్పాట్స్ వంటి చర్మ సమస్యలు సాధారణంగా ఎదురవుతూ ఉంటాయి. వీటిని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తూ ఉండటం కూడా రొటీన్ లో భాగంగా మారిపోతుంది.

మార్కెట్ లో ఈ సమస్యలకై ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డ ప్రోడక్ట్స్ అనేకం అందుబాటులో ఉంటాయి. అయితే, వాటిలో వాడే కెమికల్స్ వలన చర్మంపై దుష్ప్రభావం పడుతుంది. అంతేకాక, ఈ ప్రోడక్ట్స్ ఖరీదైనవి కూడా.

DIY Turmeric Face Pack For Spotless Skin

కాబట్టి, చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రకృతి మాత ప్రసాదించిన కొన్ని నేచురల్ ప్రోడక్ట్స్ పై ఆధారపడటం మంచిది. ఎందుకంటే, కెమికల్ ప్రోడక్ట్స్ ని వాడటం వలన చర్మ సౌందర్యం దెబ్బతింటుంది. నేచురల్ ఇంగ్రిడియెంట్స్ ని వాడటం వలన చర్మ సౌందర్యం దెబ్బతినే ఆస్కారం లేదు. అటువంటి చర్మ సంరక్షణ పదార్థాలలో పసుపు ముఖ్య స్థానం పొందుతుంది. మన పూర్వీకులు కూడా పసుపును సౌందర్య ప్రయోజనాల కోసం వాడటం మనకి తెలిసిన విషయమే. అంతేకాక, అనేక చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు పసుపును వాడేవారు. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్, మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలవు. ఈ సుగుణాలు డార్క్ స్పాట్స్, బ్లేమిషెస్, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలపై పోరాటం జరిపేందుకు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తద్వారా, చర్మ నిగారింపుని సహజంగానే మెరుగుపరుస్తాయి. తరచూ వాడినట్లయితే, పసుపు ద్వారా ఛాయ మెరుగుపడటాన్ని గమనించవచ్చు. మచ్చలేని చర్మాన్ని పొందేందుకై పసుపును ఏ విధంగా వాడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

గమనిక: కొంతమంది పసుపుకు అలర్జిక్ గా ఉండవచ్చు. కాబట్టి, వారు ఈ ఫేస్ ప్యాక్ ను వాడేముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

3 టీస్పూన్ల టర్మరిక్ పౌడర్

1 టేబుల్ స్పూన్ యోగర్ట్

1 టీస్పూన్ రా హనీ

1 టీస్పూన్ కొబ్బరి నూనె

ఎలా తయారుచేయాలి?

ఎలా తయారుచేయాలి?

1. అన్ ఫ్లేవర్డ్ తాజా పెరుగును ఒక పాత్రలోకి తీసుకోండి.

2. ఇప్పుడు, కొంత ఆర్గానిక్ తేనెను అందులోకి జోడించండి.

3. ఇప్పుడు కొంత కొబ్బరి నూనెను ఆ పాత్రలోకి తీసుకోండి. ఒకవేళ కొబ్బరి నూనె సాలిడ్ గా ఉంటే వేడి చేసి కరగబెట్టండి.

4. చివరగా పసుపును జోడించండి.

5. ఈ పదార్థాలని చాలా బాగా కలపండి. ఎటువంటి లంప్స్ లేకుండా బాగా కలపండి.

6. ఈ మిశ్రమం మెత్తటి పేస్ట్ లా రూపుదిద్దుకోవాలి.

7. ఈ ప్యాక్ మరీ చిక్కగా అనిపిస్తే కాస్తంత పెరుగును జోడించండి.

ఎలా అప్లై చేసుకోవాలి?

ఎలా అప్లై చేసుకోవాలి?

1. మొదటగా, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. ఈ మాస్క్ అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి.

2. ఈ టర్మరిక్ ఫేస్ ప్యాక్ ను ఈవెన్ గా ముఖంపై అప్లై చేసుకోండి. బ్రష్ తో ప్యాక్ ను అప్లై చేసుకోండి. లేదంటే, చేతులపై పసుపు రంగు అంటుకుని ఉంటుంది.

3. ఈ మాస్క్ ను 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి.

4. ఆ తరువాత సర్క్యూలర్ మోషన్ లో సున్నితంగా రబ్ చేసుకుంటూ మాస్క్ ను తొలగించండి.

5. మెత్తటి టవల్ తో మాస్క్ ను తొలగించండి. కొంత మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి.

పసుపు ద్వారా చర్మానికి అందే ప్రయోజనాలు:

పసుపు ద్వారా చర్మానికి అందే ప్రయోజనాలు:

అమ్మమ్మలు అలాగే బామ్మలు పసుపు ద్వారా అందే ప్రయోజనాల గురించి చిన్నప్పటి నుంచి చెప్పటాన్ని మీరు గమనించే ఉంటారు. తరతరాలుగా పసుపు అనేది ప్రతి ఇంట్లో సౌందర్య సంరక్షణకై ఉపయోగపడుతోంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ అలాగే యాంటీ సెప్టిక్ గుణాలు స్కిన్ ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తాయి. అలాగే ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ యాక్నే, డార్క్ సర్కిల్స్ మరియు ముడతలను నిరోధిస్తాయి. అందువలన, ఈ సుగుణాలు పసుపును అత్యంత ఉత్తమమైన బ్యూటీ ఇంగ్రిడియెంట్ ని చేసాయి.

తేనే వలన కలిగే ప్రయోజనాలు:

తేనే వలన కలిగే ప్రయోజనాలు:

తేనెలో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలవు. ఇవి ఇంఫ్లేమేషన్ ను తగ్గించి చర్మంపై రెడ్ నెస్ ను తగ్గిస్తాయి. పింపుల్ మరియు యాక్నే స్కార్స్ ను హీల్ చేయడానికి తేనె తోడ్పడుతుంది. తద్వారా, చర్మాన్ని స్మూత్ గా అలాగే సాఫ్ట్ గా మారుస్తుంది. అంతేకాక, తేనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చర్మానికి తగినంత తేమను అందిస్తుంది.

పెరుగు వలన కలిగే ప్రయోజనాలు:

పెరుగు వలన కలిగే ప్రయోజనాలు:

పెరుగులో లభించే లాక్టిక్ యాసిడ్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించేందుకు తోడ్పడుతుంది. తద్వారా, చర్మ సహజసిద్ధంగా తేటగా మారుతుంది. ఇది స్కిన్ ని ఎక్స్ఫోలియెట్ చేసేందుకు తోడ్పడుతుంది. డార్క్ స్పాట్స్, బ్లేమిషెస్ ను తొలగించేందుకు పెరుగు సహకరిస్తుంది. అలాగే, పీ హెచ్ బాలన్స్ ను మెయింటెయిన్ చేస్తుంది.

కొబ్బరి నూనె ద్వారా చర్మానికి అందే ప్రయోజనాలు:

కొబ్బరి నూనె ద్వారా చర్మానికి అందే ప్రయోజనాలు:

కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ కలవు. ఇవి చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ముడతలను తగ్గిస్తాయి. తద్వారా, మీరు యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అలాగే, చర్మాన్ని హైడ్రేట్ చేసే లక్షణాలు కొబ్బరి నూనెలో కలవు. చర్మానికి తగినంత మాయిశ్చర్ ని అందిస్తుంది.

English summary

DIY Turmeric Face Pack For Spotless Skin

All of us face skin-related issues ranging from like pimples, scars, acne to blemishes and dark spots. Though these issues are very common, it may end up bothering you. One such ingredient that can be used is turmeric. Turmeric has been used since ages by our ancestors for various skin-related issues. Its antibacterial, antiseptic
Story first published:Tuesday, August 7, 2018, 14:54 [IST]
Desktop Bottom Promotion