For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకాశవంతమైన ముఖ సౌందర్యానికి యోగర్ట్ - హనీ ఫేస్ ప్యాక్.

|

మన చర్మం తరచుగా సూర్యుడి నుండి జనించే హానికరమైన అతినీల లోహిత కిరణాలు, అధికంగా మేకప్ అనుసరించడం, పర్యావరణ కాలుష్యం వంటి కారకాల ద్వారా ప్రతికూల ప్రభావాలకు లోనవుతుంది. దీని ఫలితంగా, మన చర్మం నిర్జీవంగా, నిస్తేజంగా మారుతుంది మరియు చర్మంలో అసమాన ఛాయలను సైతం సృష్టిస్తుంది. దీనికి ప్రధాన కారణం చర్మం మీద పేరుకొనే మృత చర్మ కణాలు. ఇవి వ్యక్తి ఆత్మ విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంటాయి.

కేవలం రెడీమేడ్ కాస్మోటిక్స్ ఎటువంటి ప్రయోజనాలను అందివ్వలేవు, క్రమంగా సహజ నివారణా పద్దతులను అనుసరించడం ఉత్తమంగా సూచించబడుతుంది. అంతేకాకుండా, రెడీమేడ్ ఉత్పత్తుల మితిమీరిన వినియోగం చర్మానికి మరింత నష్టం కలిగిస్తుంది. ఇవి తాత్కాలికంగా ఉపయోగపడినా, భవిష్యత్తులో డిపెండెన్సీ లేదా ఇతర దుష్ప్రభావాలకు దారితీస్తుంది. ఇక్కడ మనం ఒక తేలికైన డై – రెమిడీ (సహజ నివారణా పద్దతి) గురించి చర్చించి పరిశీలిద్దాం. ఈ ప్యాక్, కేవలం పెరుగు, తేనె మాత్రమే కాకుండా, దాల్చిన చెక్క మరియు జాజికాయ పొడి వంటి ఇతర సహజ సిద్దమైన పదార్ధాలను కూడా కలిగి ఉంటుంది.

ఇప్పుడు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడం కోసం ఈ సహజ సిద్దమైన డై రెమిడీ సిద్ధం చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం.

ప్రకాశవంతమైన చర్మానికి డై - యోగర్ట్ అండ్ హనీ ఫేస్ ప్యాక్ :

కావలసిన పదార్ధాలు :

కావలసిన పదార్ధాలు :

1) 1 టేబుల్ స్పూన్ సాదా పెరుగు(యోగర్ట్)

2) 1 స్పూన్ తేనె

3) చిటికెడు దాల్చిన చెక్క పొడి

4) చిటికెడు జాజికాయ పొడి

తయారుచేయు విధానం :

ఒక శుభ్రమైన గిన్నెలో యోగర్ట్ తీసుకోండి. ఈ యోగర్ట్ ఏ ఇతర ఫ్లేవర్స్ కలిగి లేదని నిర్ధారించుకోండి. దీనికి కారణం మార్కెట్లో గ్రీన్ యాపిల్ యోగర్ట్, పైనాపిల్ యోగర్ట్ అంటూ ఫ్లేవర్డ్ యోగర్ట్స్ అధికంగా లభిస్తుంటాయి. తరువాతి దశలో, ఈ సాధారణ యోగర్ట్లో ముడి తేనెను కలిపి మిశ్రమంగా చేయండి. ఈ మిశ్రమంలో దాల్చిన చెక్క పొడి, మరియు జాజికాయ పొడిని చేర్చి మరలా మిశ్రమంగా చేయండి. అధిక మోతాదులో వీటిని జోడించడం కారణంగా మీ చర్మానికి చికాకు కలిగించవచ్చు. కావున ఈ రెండూ చిటికెడు మాత్రమే జోడిస్తున్నారని నిర్ధారించుకోండి. చివరిగా, గిన్నెలో అన్ని పదార్ధాలను మిళితం చేసి, మృదువైన పేస్ట్ వలె తయారుచేయండి.

అప్లై చేసే విధానం :

అప్లై చేసే విధానం :

మీరు మీ ముఖం మీద దరఖాస్తు చేసుకునే ముందు, ఆ పదార్ధాల కారణంగా అలెర్జీ కలగదని నిర్ధారించుకోవడానికి, మీ చేతి మీద ఒక ప్యాచ్ వలె మిశ్రమాన్ని రాసి, పరీక్ష చేయండి. ఎటువంటి దుష్ప్రభావాలు (సాధారణంగా చికాకు) లేవని నిర్ధారించుకున్న తర్వాతనే, ముఖానికి దరఖాస్తు చేసుకోండి.

మొదటగా, మీ ముఖాన్ని శుభ్రంగా చల్లటి నీటితో కడగండి. క్రమంగా ముఖం మీద ఉన్న దుమ్ము, ధూళిని తొలగించండి. తువాలుతో శుభ్రపరచి, ముఖాన్ని పొడిగా ఉంచండి. తర్వాత, మీ ముఖం మీద యోగర్ట్ మరియు తేనె మిశ్రమాన్ని పొరలా సున్నితంగా వలయాకారంలో మర్దన చేస్తున్నట్లుగా వర్తించండి. సుమారు 7 నుండి 10 నిమిషాల పాటు అలాగే వదిలివేయండి. 10 నిముషాల తర్వాత మీరు ఆ మిశ్రమాన్ని వెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఉత్తమ ఫలితాలను పొందుటకై కొన్ని వారాల పాటు కనీసం వారానికి ఒకసారి అనుసరించడం మంచిదిగా సూచించబడుతుంది.

యోగర్ట్ (లేదా పెరుగు) యొక్క ప్రయోజనాలు :

యోగర్ట్ (లేదా పెరుగు) యొక్క ప్రయోజనాలు :

యోగర్ట్, మనకు తెలిసిన, మరియు ప్రతి ఇంటిలో కనిపించే సాధారణ వంటగది పదార్థాలలో ఒకటి ఉంటుంది. ప్రాచీన కాలం నుండి దీనిని చర్మ సంరక్షణ ప్రయోజనాల దృష్ట్యా అనుసరిస్తున్నారు అంటే ఆశ్చర్యం కలుగకమానదు. లాక్టిక్ యాసిడ్లో అధికంగా ఉండే యోగర్ట్, చనిపోయిన మృత కణాలను తీసివేయడం ద్వారా చర్మాన్ని తేజోమయంగా చేయడంలో చర్మానికి సహాయపడుతుంది. మరియు చర్మం జీవకళ సంతరించుకునేలా సహాయం చేస్తుంది. అంతేకాకుండా, ముఖం మీది నల్ల మచ్చలు, రంగు మారడం వంటి చికిత్సలో సహాయపడే ప్రోబయోటిక్స్ కలిగి ఉండడం దీని ప్రత్యేకత.

Most Read: రాత్రిపూట అల్లం -నిమ్మరసం జ్యూస్ తీసుకోవడం ద్వారా కలిగే 8 అద్భుతమైన ప్రయోజనాలు

తేనె యొక్క ప్రయోజనాలు :

తేనె యొక్క ప్రయోజనాలు :

తేనెను సహజమైన హీలర్ మరియు బ్లీచ్ వలె భావిస్తారు. ఇది చర్మాన్ని హైడ్రేటింగ్ చేయడం ద్వారా, ప్రకాశవంతంగా మెరుగుపరుస్తుంది. క్రమంగా తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, అధిక మొత్తంలో అనామ్లజనకాలు కలిగి ఉండడం ద్వారా చర్మం తిరిగి రూపాంతరం చెందడంలో, మరియు ఆరోగ్యకరమైన రీతిలో ఉంచడంలో సహాయపడుతుంది. తేనెలోని యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై వాపు వంటి సమస్యలకు సైతం చికిత్సను అందివ్వగలవు. ఉదాహరణకు మొటిమలు, ఆక్నే సమస్య, చారలు, గాయాలు మొదలైనవి. తేనెని క్రమం తప్పకుండా దరఖాస్తు చేయడం ద్వారా, ముఖం ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడగలదు.

దాల్చిన చెక్క యొక్క ప్రయోజనాలు :

దాల్చిన చెక్క యొక్క ప్రయోజనాలు :

దాల్చిన చెక్కను ముఖం మీద వాడడం గురించి వింటే, ఆశ్చర్యపోవడం సహజం. అయితే, దాల్చిన చెక్క పొడిని దరఖాస్తు చేయడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చునని బ్యూటీషియన్లు సూచిస్తుంటారు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మం యొక్క ఉపరితలంపై గల బ్యాక్టీరియాను చంపడంలో మరియు నిర్వీర్యం చేయడంలో సహాయపడుతుంది.

జాజికాయ యొక్క ప్రయోజనాలు :

జాజికాయ యొక్క ప్రయోజనాలు :

జాజికాయ చనిపోయిన చర్మం కణాలను తొలగించి, నిస్తేజమైన చర్మం పునః సంతరించుకునేలా చికిత్స చేయగల లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిలోని వైద్య లక్షణాలు మొటిమలు, ఆక్నే సమస్యలు, గాయాలు మొదలైన చర్మ సంబంధిత సమస్యలను చికిత్స చేయడంలో సహాయపడుతుంది. మీరు పొడి చర్మం కలిగి ఉంటే, జాజికాయ మీ చర్మానికి తేమను అందివ్వడంలో కూడా సహాయపడగలదు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Most Read: స్వర్గంలో తేలిపోయేలా చేస్తానంది, రోజూ నాతో హస్త ప్రయోగం చేయించుకుంటోంది,ఆ టైప్ కాదు #mystory284

English summary

DIY Yogurt And Honey Face Pack For Brighter Skin

Our skin is often exposed to certain factors like the harmful rays of the sun, overuse of facial make-up, environmental pollution, etc. You can make an easy DIY remedy using honey and yogurt that can help in getting a brighter skin naturally. This pack also contains other ingredients like cinnamon and nutmeg powder.
Story first published: Monday, October 29, 2018, 15:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more