For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆముదం చర్మంపై పిగ్మెంటేషన్ తగ్గించడంలో ఉపయోగపడుతుందా?

|

చర్మంపై పిగ్మెంటేషన్ లేదా ముదురు రంగు మచ్చలు, మనని ఒక పీడకలలా వెంటాడి, మన చర్మాన్ని నిస్తేజంగా మరియు కాంతిహీనంగా కనిపించేలా చేస్తాయి.

మెలనోసైట్లు దెబ్బతిన్న ఫలితంగా నల్ల ప్యాచులు లేదా మచ్చలు చర్మంపై కనిపిస్తాయి. మెలనోసైట్లు మెలనిన్ ని ఉత్పత్తి చేస్తాయి. మెలనిన్ చర్మానికి రంగును ఇచ్చే కారకం. కనుక మెలనోసైట్లు దెబ్బతిన్నప్పుడు, ఇవి చర్మంపై నల్లని మచ్చలు మరియు ప్యాచులు ఏర్పడటానికి దోహదపడతాయి.

Does Castor Oil Help In Reducing Pigmentation?

సూర్య తపానికి అతిగా గురవడం, తరచుగా జుట్టును తొలగించుకుంటుండడం, అలెర్జీలు, హార్మోన్ల అసమతుల్యత, మద్యపానం మరియు ధూమపానం మొదలైన కారణాల వలన కూడా పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది.

అయితే, ఈ చర్మ సమస్యను గురించి అంతగా ఆందోళన చెందనవసరం లేదు. ఎందుకంటే, ఇది నివారణకు లొంగే సమస్య. ఆముదం ఈ విషయంలో మీకు సహాయపడుతుంది.

ఆముదం విత్తనాల నిండి తీయబడే ఆముదం, ఒక లేత పసుపు రంగు నూనె. దీనిలో మన చర్మానికి అవసరమైన ఖనిజాలు మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నందున, మచ్చలు మరియు ప్యాచులు నయం చేయటానికి వాడతారు. ఆముదంలో ఉండే ఉన్న కొవ్వు ఆమ్లాల సహాయంతో, చర్మం యొక్క పిగ్మెంట్ సమస్యలను నివారించవచ్చు.దీనిని ఇంట్లో కూర్చొని ఉపయోగిస్తూ, మన చర్మ సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆముదం మరియు పసుపు

1. ఆముదం మరియు పసుపు

పసుపు నల్లని మచ్చలను మరియు పిగ్మెంటేషన్ ను తగ్గించే లక్షణాలు కలిగి ఉంది. ఆముదంతో కలిపినప్పుడు, ఇది మేని ఛాయను మెరుగుపరుస్తుంది.

కావలసిన పదార్థాలు:

1 స్పూన్ ఆముదం

½ స్పూన్ పసుపు పొడి

తయారీ విధానం

మీరు చేయాల్సిందల్లా, ఆముదం మరియు పసుపులను కలిపి ఒక మృదువైన పేస్ట్ ను తయారు చేయండి. ఈ పేస్టును, మీ ముఖానికి రాసుకుని, సుమారు ఒక గంటపాటు ఆరనివ్వండి. ఒక గంట తర్వాత, గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. వేగవంతమైన మరియు మెరుగైన ఫలితాలు త్వరగా రావాలంటే రోజుకు ఒకసారి ఇలా చేయండి.

2. ఆముదం మరియు విటమిన్ ఈ ఆయిల్:

2. ఆముదం మరియు విటమిన్ ఈ ఆయిల్:

విటమిన్ ఈ ఆయిల్ లోని యాంటిఆక్సిడెంట్ లక్షణాలు, మేని ఛాయను మెరుగుపరచి, మృదువుగా మరియు సున్నితంగా తయారు చేస్తుంది.

కావలసిన పదార్థాలు:

1 స్పూన్ ఆముదం

1 విటమిన్ ఇ గుళిక

తయారీ విధానం:

ఒక విటమిన్ ఈ గుళికను కత్తిరించి, దాని నుండి నూనెను వెలికితీసి,ఆముదంలో కలపండి. మీ మీద వర్తించు మరియు మీ మునివేళ్ల సహాయంతో ముఖం అంతటా రాసుకుని వలయాకారంగా పైకి కదలిస్తూ మృదువుగా మర్దన చేసుకోండి. 10-15 నిముషాల పాటు వదిలేసి మరియు మీ ముఖాన్ని తేలికపాటి క్లెన్సర్ తో కడుక్కోండి.

3. ఆముదం ఫేస్ ప్యాక్:

3. ఆముదం ఫేస్ ప్యాక్:

ఆముదం చర్మంపై పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది దీనిలోని కొవ్వు ఆమ్లాలు చర్మానికి పోషణ అందించి, తేమను చేకూరుస్తాయి.

కావలసిన పదార్థాలు:

1 స్పూన్ ఆముదం

గాజుగుడ్డ

వాడే విధానం:

ఇది చర్మంపై పిగ్మెంటేషన్ ను తొలగించటానికి చాలా సులభమైన పద్ధతి. ఆముదంలో గాజుగుడ్డని ముంచి మరియు ప్రభావిత ప్రాంతానికి వ్యతిరేక దిశలో ఒత్తుకోండి. మీ రక్త ప్రసరణకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా, మృదువుగా ఒత్తుకోండి. తరువాత ఒక గంట పాటు ప్రభావిత ప్రాంతంపై గాజుగుడ్డను ఉంచి, తరువాత తొలగించండి. తేడా త్వరగా గమనించాలంటే ఇలా ప్రతిరోజూ చేయండి.

4. ఆముదం మరియు తేనె:

4. ఆముదం మరియు తేనె:

తేనెను సహజమైన బ్లీచ్ గా పనిచేసి, మేనిఛాయను మెరుగుపరచి మరియు మచ్చలు మరియు ప్యాచులను తొలగించడంలో సహాయపడుతుంది. దీనికి ఆముదంను జత చేసినప్పుడు, అది మీ చర్మాన్ని తేమను అందివ్వడంలో సహాయపడుతుంది.

కావలసిన పదార్థాలు:

1 స్పూన్ ఆముదం

1 స్పూన్ తేనె

½ స్పూన్ నిమ్మ రసం

తయారీ విధానం:

మొదట, ఒక శుభ్రమైన గిన్నెలో, ఆముదం, తేనె మరియు నిమ్మరసంలను కలపాలి. ఈ మిశ్రమంతో కొద్ది నిమిషాల పాటు, మీ ముఖం మీద మృదువుగా మర్దన చేయండి. తరువాత, 30 నిముషాల పాటు అలా వదిలేయండి. 30 నిముషాల తరువాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మంచి ఫలితాల కోసం ప్రతి రోజూ ఒకసారి ఈ పద్దతిని పాటించండి.

English summary

Does Castor Oil Help In Reducing Pigmentation?

Pigmentation on the skin is a nightmare for most of us. Well, there is no need to worry of this skin issue, since there are some natural remedies with which you can treat it. One such ingredient is castor oil. The fatty acids contained in castor oil help in treating pigmentation of the skin.Does Castor Oil Help In Reducing Pigmentation?Pigmentation on the skin is a nightmare for most of us. Well, there is no need to worry of this skin issue, since there are some natural remedies with which you can treat it. One such ingredient is castor oil. The fatty acids contained in castor oil help in treating pigmentation of the skin.Does Castor Oil Help In Reducing Pigmentation?
Story first published: Wednesday, July 25, 2018, 17:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more