Latest Updates
-
పల్లెటూరి రుచులతో నోరూరించే దహీ వడ.. ఒక్కసారి ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు మళ్లీ మళ్లీ అడుగుతారు! -
విజయవాడలో థార్ వాహనాలతో వీరంగం.. ప్రేమ పేరుతో జరుగుతున్న ఈ ప్రమాదకరమైన టాక్సిక్ రిలేషన్స్ వెనుక అసలు నిజాలేంటి? -
హాట్ హాట్ సమ్మర్లో పచ్చి మామిడితో జ్యూస్, ఘాటుఘాటుగా పచ్చడి.. -
ఎండల వేళ పెళ్లిళ్లు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ చిన్న మార్పులు చేయకపోతే కష్టమే! -
మండుతున్న ఎండలకు పర్ఫెక్ట్ కిక్.. ఇంట్లోనే చల్లచల్లని స్పైసీ లెమన్ సోడా చేసుకోండిలా! -
బేకరీ స్టైల్ చాక్లెట్ కేక్ ఇంట్లోనే.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు! తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ -
శుక్రుడి కటాక్షం.. ఈరోజు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం, కెరీర్లో తిరుగులేని సక్సెస్! -
నెయ్యిలో దోరగా వేయించిన వెల్లుల్లి.. మీ ఆరోగ్యానికి సంజీవని.! -
గురు పుష్య యోగం ముగిసినా అదృష్టం ఇంకా ఉంది.. ఈ చిన్న పనులు చేస్తే మీ ఆర్థిక స్థితి మారుతుంది! -
సమ్మర్ కూల్ స్వీట్.. నోట్లో కరిగిపోయే పుచ్చకాయ బర్ఫీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
లిప్ పింపుల్ నుంచి తక్షణ ఉపశమనాన్ని అందించే సులభమైన మరియు ప్రభావవంతమైన రెమెడీస్
ముఖంలో ఏ ప్రదేశంలోనైనా మొటిమలు రావచ్చు. అయితే, సెన్సిటివ్ ప్రదేశాలలో మొటిమలొచ్చే అవకాశం ఎక్కువ. పెదవులు అటువంటి సెన్సిటివ్ ప్రదేశాల కిందకే వస్తాయి. ఈ మొటిమలు నొప్పిని, అలాగే చికాకుని కలిగిస్తాయి. లిప్ పింపుల్ కి సరైన సమయంలో పరిష్కారాన్ని వెతకకపోతే ఈ సమస్య మరింత ముదిరి ముఖంలోని మిగతా ప్రదేశాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఆ విధంగా మీకు అసౌకర్యం కలుగుతుంది.
హార్మోన్ల మార్పులు, ఇన్ఫెక్షన్ల వంటి వివిధ రకాల ఫ్యాక్టర్స్ వలన పెదవులపై మొటిమలు వస్తాయి.ఈ మొటిమలను వదిలించుకోవడం చాలా కష్టతరం.
అదృష్టవశాత్తూ, కొన్ని సహజసిద్ధమైన నివారణ పద్దతుల ద్వారా లిప్ పింపుల్ ని సులభంగా వదిలించుకోవచ్చు. తద్వారా, ఇన్ఫెక్షన్ మరింత వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు.

ఈ రోజు బోల్డ్ స్కై లో లిప్ పింపుల్ ని అరికట్టే కొన్ని ప్రభావవంతమైన సహజ నివారణ పద్దతుల గురించి తెలుసుకుందాం.
ప్రాచీనకాలం నుంచి ఈ రెమెడీస్ అనేవి ప్రాచుర్యం పొందాయి. ఈ రెమెడీస్ అనేవి యాంటీ బాక్టీరియల్ అలాగే యాంటీ ఇంఫ్లేమేటరీ ఏజెంట్స్ తో నిండి ఉన్నాయి. కాబట్టి, ఈ రెమెడీస్, మీ సమస్యకు సరైన పరిష్కారం కలిగిస్తాయి.
కాబట్టి, మీరు ఈసారి ఎప్పుడైనా లిప్ పింపుల్ తో ఇబ్బంది పడుతున్నట్లైతే, ఈ రెమెడీస్ ని పాటించి వేగవంతమైన ఫలితాలను పొందండి.
ఈ రెమెడీస్ ను ఇప్పుడు పరిశీలిద్దాం:

1. పసుపు పొడి
ఈ ట్రెడిషనల్ హోమ్ రెమెడీలో యాంటీ ఇంఫ్లేమేటరీ ఏజెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి, లిప్ పింపుల్ నుంచి మీకు ఉపశమనం కలిగిస్తాయి.
ఎలా వాడాలి:
చిటికెడు పసుపు పొడిని నీళ్ళల్లో కలిపి మెత్తటి పేస్ట్ ను తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. పది నుంచి పదిహేను నిమిషాల తరువాత మెత్తటి తడి వస్త్రంతో ఈ పేస్ట్ ను తొలగించాలి. ఈ పద్దతిని రోజుకు రెండుసార్లు పాటిస్తే వేగవంతమైన ఫలితాలు పొందవచ్చు.

2. కేరట్ ఆయిల్:
కేరట్ ఆయిల్ లో లభించే యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన లిప్ పింపుల్ మటుమాయమవుతుంది.
ఎలా వాడాలి:
మూడు నుంచి నాలుగు చుక్కల కేరట్ ఆయిల్ ను అర టీస్పూన్ ఆలివ్ ఆయిల్ తో కలిపి ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. పదినిమిషాల తరువాత మెత్తటి తడివస్త్రంతో పెదవులను శుభ్రపరచుకోవాలి. ఈ పద్దతిని రోజుకు మూడు నాలుగు సార్లు పాటించడం ద్వారా లిప్ పింపుల్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

3. మజ్జిగ:
మజ్జిగ ఒక కూలింగ్ మరియు సూతింగ్ ఏజెంట్ లా పనిచేసి లిప్ పింపుల్ ని తొలగిస్తుంది. ఆ విధంగా, లిప్ పింపుల్ వలన కలిగే అసౌకర్యాల నుంచి మీకు పూర్తి ఉపశమనం కలిగిస్తుంది.
ఎలా వాడాలి:
మజ్జిగలో ముంచిన కాటన్ బాల్ తో ప్రభావిత ప్రదేశాన్ని రుద్దండి. కొద్ది నిమిషాల తరువాత, గోరువెచ్చటి నీటితో మీ పెదాలను శుభ్రపరుచుకోండి. ఈ పద్దతిని రోజుకు మూడు లేదా నాలుగు సార్లు పాటిస్తే, లిప్ పింపుల్ తగ్గుముఖం పడుతుంది.

4. అలోవెరా జెల్:
లిప్ పింపుల్ నుంచి ఉపశమనాన్ని అందించేందుకు అలోవెరా జెల్ అమితంగా తోడ్పడుతుంది. అలాగే, మున్ముందు కూడా లిప్ పింపుల్స్ సమస్య తలెత్తకుండా ఇన్ఫెక్షన్స్ ను అరికడుతుంది.
ఎలా వాడాలి:
అలోవెరా జెల్ లో ముంచిన కాటన్ బాల్ తో ప్రభావిత ప్రాంతంపై రుద్దాలి. పది నుంచి పదినిమిషాల వరకు అలోవెరా జెల్ ను ప్రభావిత ప్రాంతంపై ఉండనివ్వాలి. ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో పెదాలను శుభ్రపరచుకోవాలి. ఇలా, రోజుకు నాలుగైదు సార్లు చేస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

5. కేస్టర్ ఆయిల్:
అన్ని రకాల బ్యూటీ ప్రాబ్లమ్స్ కి కేస్టర్ ఆయిల్ తగిన పరిష్కారాన్ని అందిస్తుంది. లిప్ పింపుల్ ని తొలగించేందుకు కేస్టర్ ఆయిల్ సమర్థవంతంగా పనిచేస్తుంది. పింపుల్ ని కలిగించే బాక్టీరియాతో పోరాడి పింపుల్ వలన కలిగే ఎర్రదనాన్ని అలాగే వాపును తగ్గిస్తుంది.
ఎలా వాడాలి:
కేస్టర్ ఆయిల్ లో ఒక కాటన్ బాల్ ని ముంచాలి. ఈ కాటన్ బాల్ తో ప్రభావిత ప్రాంతంపై రుద్దాలి. 20 నుంచి 25 నిమిషాల తరువాత మెత్తటి తడి వస్త్రంతో పెదాలను శుభ్రపరచుకోవాలి. ఈ విధంగా రోజుకు మూడు లేదా నాలుగు సార్లు చేస్తే లిప్ పింపుల్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

6. ఆపిల్ సిడర్ వినేగార్
ఆల్ఫా హైడ్రాక్సీల్ యాసిడ్స్ ఆపిల్ సిడర్ వినేగార్ లో లభిస్తాయి. ఇవి పింపుల్ ని కలిగించే బాక్టీరియాతో పోరాడి మీకు ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. తద్వారా, మంట అలాగే వాపు తగ్గుముఖం పడతాయి.
ఎలా వాడాలి:
డైల్యూట్ చేయబడిన ఆపిల్ సిడర్ వినేగార్ లో ఒక కాటన్ బాల్ ని ముంచి ప్రభావిత ప్రదేశంపై ఈ కాటన్ బాల్ తో రుద్దాలి. కొద్ది నిమిషాల తరువాత చల్లటి నీటితో పెదాలను శుభ్రపరచుకోవాలి. ఈ పద్దతిని రోజుకు రెండు మూడు సార్లు పాటిస్తే ఆశించిన ఫలితాలు లభిస్తాయి.

7. వేపాకులు
వేపాకులలో యాంటీబాక్టీరియల్ కాంపౌండ్స్ పుష్కలంగా లభిస్తాయి. లిప్ పింపుల్ ని తొలగించడానికి వేపాకులు అమితంగా తోడ్పడతాయి.
ఎలా వాడాలి:
గుప్పెడు వేపాకులను పొడి చేసుకుని అందులో కాసింత రోజ్ వాటర్ ను కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. పది నిమిషాల వరకు ఈ పేస్ట్ ను తొలగించకూడదు. ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో పెదాలను శుభ్రపరచుకోవాలి. ఈ పద్దతిని రోజుకు రెండుసార్లు పాటిస్తే లిప్ పింపుల్ నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.

8. గ్రీన్ టీ:
ఈ లిస్ట్ లోని లాస్ట్ రెమెడీ ఇది. లింప్ పింపుల్ నుంచి తక్షణ ఉపశమనం కలిగించేందుకు ఈ రెమెడీ అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీ లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి, ఇన్ఫెక్షన్ ను అరికట్టి, వాపు నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.
ఎలా వాడాలి:
తీపిలేని గ్రీన్ టీలో ముంచిన కాటన్ బాల్ ను ప్రభావిత ప్రాంతంపై సున్నితంగా రుద్దండి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో పెదాలను శుభ్రపరుచుకోండి. ఈ నేచురల్ రెమెడీని పాటించి లిప్ పింపుల్ నుంచి ఉపశమనం పొందండి. వారానికి మూడు నాలుగు సార్లు ఈ రెమెడీ ను పాటించవచ్చు.



Click it and Unblock the Notifications