For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంగు పాలిపోయిన చర్మాన్ని వదిలించుకునే సులభమైన మార్గాలు

|

చర్మం రంగు పాలిపోవటం లేదా ఒకే మాదిరి చర్మం రంగు లేకపోవటం ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. హానికర రసాయనాలు ఉన్న ఉత్పత్తులు వాడటం మరియు ఎండలో ఎక్కువగా తిరగటం వలన చర్మంలో తేమ తగ్గిపోయి మచ్చలు పడవచ్చు.

ఈ రంగు పాలిపోవటం, మచ్చలు, మొటిమలు మరియు ఇతర చర్మ ఇన్ఫెక్షన్ల వలన చర్మం ఒకే మాదిరిగా కన్పించదు. చర్మం రంగు పాలిపోవటం హార్మోన్ల అసమతుల్యత వలన, మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటం, మానసిక ఒత్తిడి, అల్ట్రావయొలెట్ కాంతికి ఎక్స్ పోజ్ అవటం, గర్భం దాల్చటం మరియు కఠిన రసాయనాలకి ఎక్స్పోజ్ అవటం వలన జరుగుతుంది.

చర్మం రంగు సరిగా లేకపోవటం చాలామందికి అందం గురించి టెన్షన్ పడేలా చేస్తుంది ఎందుకంటే చర్మం ఒక లాగా లేకుండా అందంగా కన్పించదు. అందుకని రంగు పాలిపోతున్న చర్మాన్ని సంరక్షించుకుంటూ అందంగా కన్పించండి.

easy ways to get rid of skin discolouration

మనం తరచుగా వివిధ అందాల చికిత్సలకి మరియు చర్మం రంగు పాలిపోవటాన్నుండి రక్షించే కాస్మెటిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.

దురదృష్టవశాత్తూ, వాటి వలన ఆశించిన ఫలితాలు రాక, అనవసరంగా డబ్బు కూడా వృథా అవుతోంది. అప్పుడే ఇంటి చిట్కాలు అక్కరకు వస్తాయి. చర్మం రంగు పోవటాన్ని ఇంటిలోనే సులువుగా బాగుచేయవచ్చు.

అందుకని ఈ ఆర్టికల్ లో, బోల్డ్ స్కై మీకోసం చర్మం రంగు పాలిపోవటాన్ని తగ్గించే చిట్కాలను అందిస్తోంది. తెలుసుకోటానికి చదవండి.


చర్మం రంగు పాలిపోవటాన్ని తగ్గించుకునే పద్ధతులు

easy ways to get rid of skin discolouration

దోసకాయ మరియు నిమ్మ ; దోసకాయ చల్లదనం మరియు నిమ్మకాయ బ్లీచింగ్ లక్షణం చర్మం రంగు తగ్గిన చోటను సరిచేస్తుంది. దోసకాయను తురిమి కొన్నిచుక్కల నిమ్మరసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి కొన్ని నిమిషాల తర్వాత కడిగేయండి.

చర్మం రంగు పాలిపోవటాన్ని తగ్గించుకునే పద్ధతులు


వెనిగర్ ; వెనిగర్ కు చర్మం రంగు తేలికపరిచే శక్తి ఉంది. అన్ని మచ్చలను, రంగు పాలిపోవటాన్ని తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. వెనిగర్లో యాసిడ్ లక్షణాలుంటాయి కాబట్టి, అది మీ చర్మాన్ని పాడుచేస్తుంది, అందుకని గాఢతను తగ్గించండి. సమానంగా నీటిని మరియు వెనిగర్ ను కలిపి మీ ముఖాన్ని దీనితో క్రమం తప్పకుండా కడుక్కోని మంచి ఫలితాలు పొందండి.

బాదం ; బాదంలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. విటమిన్ ఇ చర్మాన్ని బాగుచేసి దాని సహజ కాంతిని బయటకి తెస్తుంది. బాదం చర్మానికి లోతైన పోషణనిచ్చి చర్మంపై రంగు పాలిపోవటాన్ని తగ్గిస్తుంది. రాత్రిపూట కొన్ని బాదంలు నానబెట్టి, మరునాడు పొద్దున్న పాలతో కలిపి పేస్టులా చేయండి. దీన్ని చర్మంపై పట్టించి కాసేపయ్యాక కడిగేయండి.

easy ways to get rid of skin discolouration

కోకో బటర్ ; కోకో బటర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణం చర్మానికి ఉపశమనాన్ని ఇచ్చి, బాగుచేస్తుంది. చర్మం రంగు కొన్నిచోట్ల ఉండి కొన్నిచోట్ల పోకుండా ఆపి, బాగా తేమ ఉండేలా చేస్తుంది. రంగు పాలిపోతున్న చర్మం ఉన్నచోట కోకోబటర్ ను పూయండి. కొన్ని నిమిషాలు మసాజ్ చేసి కడిగేయండి.

చర్మం రంగు పాలిపోవటాన్ని తగ్గించుకునే పద్ధతులు

బొప్పాయి;

బొప్పాయిలోని ఎంజైములు చర్మకణాలు తిరిగి పెరిగేలా చేసి, రంగు పాలిపోయిన చర్మం మెల్లగా పోయేట్లా చేస్తాయి. బొప్పాయి చర్మంపై మృతకణాలను తొలగించి రంగు మచ్చలు పడటాన్ని అలాగ ఆపుతుంది. బొప్పాయి పేస్టును అవసరమున్న చోట రాయండి. కొద్దిసేపు తర్వాత మొహాన్ని కడుక్కోండి. ఈ పద్ధతిని వారంపాటు ప్రయత్నించి ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోండి.

English summary

easy ways to get rid of skin discolouration

easy ways to get rid of skin discolouration,in this article, we at Boldsky will be sharing with you some of the best home remedies for skin discolouration. Read on to know more about it.
Desktop Bottom Promotion