మీ చర్మం మొత్తం ఒకే రంగును ఈ నిమ్మరసం ఫేస్ మాస్క్ లతో పొందండి.

By: Deepthi TAS
Subscribe to Boldsky

ఒకే రంగు చర్మం మొత్తం పొందటానికి మీరు తరచుగా మేకప్ సామాగ్రిని వాడతారా? అవును అయితే చదవండి, ఈ రోజు మేము బోల్డ్ స్కైలో మీ చర్మ రంగు అన్నిచోట్లా ఒకేలా ఉండేలా చేసే అద్భుతమైన సహజ చిట్కాను పరిచయం చేయబోతున్నాం.

మేము చెప్తున్న ఆ అద్భుత పదార్థం నిమ్మరసం. సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ అయిన నిమ్మరసాన్ని చాలా కాలం నుంచి చర్మంపై ఒకే రంగు రావటానికి, మచ్చలు, ట్యాన్ వంటి చర్మసమస్యలు పోగొట్టుకోడానికి వాడుతున్నారు.

ఈ సహజ చిట్కాను చర్మం అంతా ఒకే రంగు పొందటానికి నేరుగా వాడే విధానాలున్నా, ఇతర లాభదాయక సహజ పదార్థాలతో కలిపి వాడటం మంచిది.

ఇక్కడ మేము మీ ముఖం అంతా ఒకే రంగు వచ్చేలా చేసే సహజమైన నిమ్మరసం ఫేస్ మాస్కుల లిస్టును పొందుపరిచి అందిస్తున్నాం. సులభంగా తయారయ్యే, చవకైన, మెరుగ్గా పనిచేసే ఈ మాస్క్ లు కన్సీలర్లు, చర్మం తెల్లబడే క్రీముల వంటివి ఇక కొనక్కర్లేకుండా చేస్తాయి.

అవేంటో చదవండి.

గమనిక ; ఈ కింద సూచించిన మాస్క్ లన్నిటిని ముందుగా కొంచెం చర్మంపై పరీక్షించి తర్వాత ముఖానికి రాయటం ఉత్తమం.

ఫేస్ మాస్క్ #1

ఫేస్ మాస్క్ #1

మీకు కావాల్సినవిః

1 చెంచా ఆలోవెరా జెల్

1 గుడ్డు తెల్ల సొన

చిటికెడు పసుపు

1 చెంచా నిమ్మరసం

ఎలా వాడాలిః

అన్ని పదార్థాలు గడ్డలు కట్టకుండా మెత్తగా కలపండి.

మీ తడిగా ఉన్న మొహానికి ఈ మిశ్రమం పట్టించి 10 నిముషాలు అలానే ఉండనివ్వండి.

గోరువెచ్చని నీటితో కడిగేసి కొంచం మాయిశ్చరైజర్ రాసుకోండి.

ఫేస్ మాస్క్ #2

ఫేస్ మాస్క్ #2

మీకు కావాల్సినవిః

2 చెంచాల నిమ్మరసం

1 చెంచా ఆర్గానిక్ తేనె

ఎలా వాడాలిః

పైన చెప్పిన పదార్థాలను కలిపేసి మాస్క్ తయారుచేయండి.

ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై సమానంగా పల్చగా పట్టించి 10-15 నిమిషాలు ఎండనివ్వండి.

అయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేయండి.

ఫేస్ మాస్క్ #3

ఫేస్ మాస్క్ #3

మీకు కావాల్సినవిః

1 చెంచా సెనగపిండి

అరచెంఛా కమలా పండు తొక్క పొడి

1 చెంచా నిమ్మరసం

ఎలా వాడాలిః

అన్ని పదార్థాలను కలిపేసి ఈ సహజ మాస్క్ ను తయారుచేయండి.

ఈ మిశ్రమాన్ని తడిచర్మానికి పట్టించి 10-15 నిమిషాలు అలా ఉండనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

మంచి ఫలితాల కోసం లైట్ స్కిన్ టోనర్ ను రాసుకోండి.

ఫేస్ మాస్క్ #4

ఫేస్ మాస్క్ #4

మీకు కావాల్సినవిః

1 చెంచా నిమ్మరసం

1 చెంచా బియ్యంపొడి

అరచెంచా రోజ్ వాటర్

ఎలా వాడాలిః

సూచించిన అన్ని పదార్థాలను మాస్క్ కోసం కలిపేయండి.

మీ ముఖంపై ఈ మిశ్రమంతో మెల్లగా మసాజ్ చేస్తూ ఒక 10 నిమిషాలు ఉండనివ్వండి.

గోరువెచ్చని నీటితో కడిగేయండి.

ఫేస్ మాస్క్ #5

ఫేస్ మాస్క్ #5

మీకు కావాల్సినవిః

1 చెంచా నిమ్మరసం

అరచెంచా ఆలివ్ నూనె

2 చెంచాల దోసకాయ గుజ్జు

ఎలా వాడాలిః

ఒక బౌల్ లో అన్ని పదార్థాలను వేసేసి, మెత్తగా పేస్టులా వచ్చేవరకు చెంచాతో కలపండి.

ఈ మాస్క్ ను మీ అప్పుడే కడిగిన ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉండనివ్వండి.

గోరువెచ్చని నీటితో కడిగేయండి.

ఫేస్ మాస్క్ #6

ఫేస్ మాస్క్ #6

మీకు కావాల్సినవిః

1 చెంచా నిమ్మరసం

2 చెంచాల బొప్పాయి గుజ్జు

ఎలా వాడాలిః

తీసిన బొప్పాయి గుజ్జును తాజా నిమ్మరసంతో కలపండి.

ఈ మాస్క్ ను ముఖమంతా పట్టించి 10 నిమిషాలు అలా వదిలేయండి, తర్వాత ఫేసియల్ క్లెన్సర్ మరియు గోరువెచ్చని నీరుతో కడిగేయండి.

మీ తడిచర్మాన్ని తువ్వాలుతో వత్తుకుని, లైట్ మాయిశ్చరైజర్ ను రాసుకోండి.

ఫేస్ మాస్క్ #7

ఫేస్ మాస్క్ #7

మీకు కావాల్సినవిః

అరచెంచా ఓట్ మీల్

అరచెంచా నిమ్మరసం

1 విటమిన్ ఇ క్యాప్సూల్

ఎలా వాడాలిః

విటమిన్ ఇ క్యాప్సూల్ నుంచి నూనెను బయటకి తీసి ఇతర పదార్థాలతో కలపండి.

ఈ వచ్చిన మిశ్రమాన్ని మీ ముఖం, మెడపై పల్చటిపొరలాగా పట్టించండి.

10-15 నిమిషాలు ఎండనిచ్చాక, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

English summary

Even Out Your Skin Tone With These Lemon Juice Face Masks

A natural bleaching agent, lemon juice has been used since ages for achieving an even skin tone and combating problems like pigmentation, tanning, etc. Though there are numerous ways in which you can use this natural remedy for achieving an even skin tone, it is always better to use it in combination with other equally beneficial natural ingredients. We have
Subscribe Newsletter