For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎప్పుడైనా చిటికెలో పూర్తయ్యే ఈ సౌందర్య చిట్కాలను పాటించారా?

|

మానవ శరీరంలోని అతిపెద్ద అవయవం చర్మం. ఇది బయట ప్రపంచం మరియు మీ శరీర భాగాల మధ్య ఒక రక్షిత అవరోధంగా పనిచేస్తుంది. ఇది ఒక వడపోత అవయవం వలె పనిచేయడమే కాక శరీర ఉష్ణోగ్రతని కూడా నియంత్రిస్తుంది. మన శరీరం తన విధులను సక్రమంగా నిర్వర్తించడానికి, చర్మం సహాయం చేస్తుంది. అందువలన, చర్మ ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

సెలూన్లో చర్మ చికిత్సలను పొందడం, చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. పైగా, ఇవి అన్ని చర్మరకాల వారికి సరిపడవు కనుక తీవ్రమైన చర్మ ప్రతిచర్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. స్పా మరియు సెలూన్లో తీసుకునే చర్మ చికిత్సలలో, దీర్ఘకాలంలో మీ చర్మాన్ని దెబ్బతీసే రసాయనాలను చాలా ఉపయోగిస్తారు. అందువల్ల, మీ చర్మం దెబ్బతినకుండా, సహజ గృహవైద్య చిట్కాలను పాటించడం వలన, చర్మానికి అవసరమైన ఆలనాపాలనా లభించి, కాంతులీనుతూ ఉంటుంది.

Ever Tried These One-minute Beauty Tips?

మన ఇంటిలో సాధారణంగా అందుబాటులో ఉండే చాలా పదార్ధాలతో తయారు చేసుకునే స్క్రబ్ లు మరియు మాస్కులు , ఆరోగ్యవంతమైన చర్మాన్ని సాధించడానికి సమర్థవంతంగా ఉపయోగపడతాయి. పసుపు, కలబంద, కొబ్బరి నూనె, దోసకాయ, తేనె, నిమ్మకాయ, బొప్పాయి తదితర పదార్థాలు గృహ-ఆధారిత చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారుచేయటానికి ఉపయోగపడతాయి.

మీరు తప్పక ప్రయత్నించాల్సిన, ఒక నిమిషం వ్యవధిలో పూర్తయ్యే చర్మసంరక్షణ చిట్కాలు:

సమయం తక్కువగా ఉన్నప్పుడు, మీరు పాటించదగిన అద్భుతమైన సౌందర్య చిట్కాలు కొన్ని ఉన్నాయి. రోజువారీ జీవితంలో ఈ చిట్కాలను ఉపయోగించడం వల్ల, అందమైన చర్మాన్ని పొందవచ్చు. మీ విలువైన సమయాన్ని ఎక్కువగా వెచ్చించనవసరం లేని, ఈ సులభమైన సౌందర్య చిట్కాలను గురించి తెలుసుకోవడానికి, ఆలస్యం చేయకుండా ఈ వ్యాసాన్ని చదవండి.

• రాత్రి సమయంలో మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసుకోండి:

చర్మానికి అవసరమైన మరమ్మతులు రాత్రి సమయంలోనే జరుగుతాయి. రాత్రి వేళ చర్మాన్ని తేమగా ఉంచటానికి, ఒక DIY క్రీమ్ సహాయపడుతుంది. దీనిలోని ఒక ముఖ్యమైన పదార్థం ఆలివ్ నూనె. ఇది చర్మం లోని తేమను కాపాడటానికి సహాయపడుతుంది. క్రీమ్ లో ఉపయోగించే కొబ్బరి నూనె, చర్మానికి అందంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. విటమిన్ E కూడా కలిగిన ఈ క్రీమ్ చర్మాన్ని సంరక్షిస్తుంది.

కావలసిన పదార్థాలు:

o 2 స్పూన్లు కొబ్బరి నూనె

o 1 స్పూన్ మైనం

o 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్

o అరకప్పు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె

తయారీ విధానం:

ఆలివ్ నూనె, కొబ్బరి నూనె మరియు మైనంను కలపాలి. తక్కువ సెగపై ఒక కళాయిని పెట్టి, ఈ మిశ్రమం కరిగే వరకు వేచి ఉండండి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ ను చిదిమి మరియు కళాయిలోని పదార్థాలకు కలపండి. ఈ మిశ్రమం చల్లబడే వరకు వేచి ఉండండి. ఇప్పుడు ఈ క్రీమ్ ను ఒక కంటైనర్ లో వేయండి. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. ఈ క్రీమ్ ను 2 నుండి 3 నెలల వరకు ఉపయోగించవచ్చు.

• బ్లో డ్రైయర్ కు వీడ్కోలు పలకండి

బ్లో డ్రైయర్ ద్వారా వీచే వేడిగాలిని ఉపయోగించి, జుట్టును పొడిగా ఎండబెట్టుకోవడం వలన, మీ జుట్టుకు ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. చిటికెలో ఎండబెట్టుకునే ఈ విధానం ప్రభావం వలన, జుట్టుకున్న తడితో పాటుగా ఉపరితల తేమ కూడా తొలగిపోతుంది. ఈ చర్య జుట్టులోని క్యూటికల్ ను పొడిగా మరియు పెళుసుగా మారుస్తుంది. తరచుగా జుట్టును బ్లో డ్రైయింగ్ చేసుకోవడం వలన, జుట్టు అధికంగా రాలిపోతుంది.

• జుట్టును బన్ గా కట్టుకుని అలంకరించుకుంటే, కేశాల అందం పెరుగుతుంది.

చిటికెలో మీరు సొగసైన కేశాలంకరణ చేసుకోవాలనుకుంటే, అప్పుడు జుట్టును బన్ గా అలంకరించుకోవచ్చు. ఈ కేశాలంకరణను, ఒక నిమిషం లోపల సులభంగా పూర్తి చేయవచ్చు. ముందుగా జుట్టును పోనీటైల్ గా గట్టిగా కట్టాలి. తరువాత జుట్టును రోల్ చేసుకుని, బాబీ పిన్స్ ఉపయోగించి సురక్షితంగా పెట్టుకుంటే, కేశాలంకరణ ఒక నిమిషంలో లోగా పూర్తవుతుంది.

• ప్రతి రాత్రి మీ పెదాలను ఎక్సఫోలియేట్ చేసుకోండి

ఇంట్లో తయారు చేసుకుని, సహజ స్క్రబ్ లు, మీ పెదవులను సహజాంగా ఎక్సఫోలియేట్ చేస్తాయి. ప్రతి రాత్రి పెదవులను ఎక్సఫోలియేట్ చేసుకోవడం వలన, మలినాలు, పెళుసుగా మరియు పగిలి, పొడిగా మారిన చర్మకణాలు తొలగిపోతాయి. క్రమం తప్పకుండా పెదవులను ఎక్సఫోలియేట్ చేసుకోవడం వలన, పెదవులు రంగు మారకుండా ఉంటాయి. ఆలివ్ నూనె మరియు చక్కెర మిశ్రమాన్ని ఉపయోగించి, పెదవులను ఎక్సఫోలియేట్ చేసుకోవచ్చు.

• గోళ్ల ఆరోగ్యం కొరకు పెట్రోలియం జెల్లీ

బలమైన మరియు పొడవైన గోర్లు పొందడానికి పెట్రోలియం జెల్లీని ఉపయోగించవచ్చు. మీ చేతులను తరచుగా కడుక్కోవడం వలన, మీ గోళ్ళను పొడిగా మారిపోతాయి. గోళ్లకు తేమ చాలా అవసరం. పెట్రోలియం జెల్లీ గోళ్లకు ఈ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. పెట్రోలియం జెల్లీ గోళ్ళ పొడిదనం మరియు పెళుసుదనంను తగ్గిస్తుంది. ఇది క్యూటికల్స్ పొడిబారడాన్ని కూడా తగ్గిస్తుంది.

పైన చెప్పబడిన చిట్కాలను ఉపయోగించినట్లైతే, ఎల్లప్పుడూ మీరు అందంగా మరియు తాజాగా కనిపిస్తారు.

English summary

Ever Tried These One-minute Beauty Tips?

Spa and salon skin treatments use a lot of chemicals that can damage your skin in the long run. It is therefore always advisable to use home remedies when seeking to pamper your skin to make it continue looking flawless. There are several ingredients like turmeric, aloe vera, coconut oil, cucumber, honey, lemon, etc. that are effective.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more