ఇంటివద్దనే మొహంపై అక్కర్లేని వెంట్రుకలను తొలగించుకునే ఫేస్ మాస్కులు

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఆడవాళ్ళు తమ మొహం అందాన్ని సంరక్షించుకోటం కోసం స్పాలకి సెలూన్లకి వెళ్ళి, వ్యాక్సింగ్ కిట్లు, రేజర్లు, ట్రిమ్మర్లు కొనుక్కుని వేలాది రూపాయలు ఖర్చుచేస్తారు. కానీ మీకు తెలుసా,మన ఇంటిలోని వస్తువులతోనే సింపుల్ చిట్కాలతో మొహంపై వెంట్రుకలను తెల్లబర్చుకోవచ్చని?

చాలామందికి మొహంపై వ్యాక్సింగ్, బ్లీచింగ్, లేజర్ చికిత్స మొదలైనవి చేయటం చర్మాన్ని బాగా ప్రభావితం చేసి, అనేక ఆరోగ్య సమస్యలకి దారితీస్తాయని తెలీదు.

Effective face masks for whitening facial hair naturally at home

మొహంపై వెంట్రుకలను తెల్లబర్చే ఇంటి చిట్కాల గురించి తెలుసుకునేముందు, ఈ మొహంపై అవాంఛిత వెంట్రుకలకి సెలూన్ లో చేసే చికిత్సల వలన వచ్చే ఆరోగ్య సమస్యలేంటో చూద్దాం;

1.ర్యాషెస్

2.వెంట్రుకలు మరింత దట్టంగా పెరగటం

3.మొటిమలు

4.చర్మంపై మంట

5.చర్మంపై గాయాలు

ఈ సెలూన్,పార్లర్లలో చేసే హెయిర్ రిమూవల్ పద్ధతులు చర్మాన్ని పాడుచేయటమేకాదు, బాగా ఖర్చవుతాయి కూడా. మీకు ఇంట్లోనే సులభంగా మొహంపై వెంట్రుకలను తేటపర్చుకునే/తేలికపర్చుకునే పద్ధతులు చిట్కాలు చెప్తే బావుంటుంది కదా? సహజపదార్థాల సాయంతోనే, మీరు ఈ కింది మార్గాల్లో మొహంపై అక్కర్లేని చోట వెంట్రుకలను తొలగించు/తేలికపర్చు/తేటపర్చుకోవచ్చు;

1.నిమ్మ,తేనె మాస్క్ ;

1.నిమ్మ,తేనె మాస్క్ ;

సిట్రస్ పండు అయిన నిమ్మలో చర్మంపై పనిచేసే సహజ ఎక్స్ ఫోలియేటింగ్ ప్రభావం ఉంటుంది. మనందరికీ తెలిసినట్లే తేనె ఏ సమస్యకైనా మంచి పరిష్కారం. అందుకని మీరు ఎప్పుడైనా వీటినుంచి మాస్క్ చేస్తే దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.

స్టెప్ 1 ;తాజా నిమ్మకాయను తీసుకుని రసాన్ని తీయండి.

స్టెప్ 2;4 చెంచాల సహజ తేనెను తీసుకుని పిండిన నిమ్మరసంతో కలపండి.

స్టెప్ 3 ; ఒక గట్టిగా అతుక్కునే మాస్క్ తయారవుతుంది, అందుకని మీ మొహాన్ని చల్లనీరుతో బాగా కడుక్కుని ఆరనివ్వండి.

స్టెప్ 4 ; ఈ మాస్క్ ను కాటన్ దూది కానీ, చేతులు లేదా బ్రష్ తో మొహానికి పట్టించండి.

స్టెప్ 5; 15 నిమిషాలు ఆరాక ,గోరువెచ్చని నీటిలో ముంచిన తడిగుడ్డతో మొత్తం తుడిచేయండి.

ఈ పద్ధతిని 3-4సార్లు పాటిస్తే మీ మొహంపై వెంట్రుకలు తొలగిపోయి,మెరిసే చర్మం కూడా లభిస్తుంది. టాన్ కూడా దీనితో పోతుంది.

2. వైల్డ్ పసుపు మాస్క్ ;

2. వైల్డ్ పసుపు మాస్క్ ;

ఈ మాస్క్ ఎంత ప్రభావం చూపిస్తుందంటే,మన పూర్వీకులు, పెద్దవాళ్ళు దీని గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. దీన్ని చాలా కాలంగా వాడుతూనే ఉన్నారు. వైల్డ్ పసుపులో ఉండే యాంటీ ఆక్సిడైజింగ్ లక్షణం చర్మంపై సూక్ష్మజీవులను తొలగిస్తుంది.

స్టెప్ 1 ; 2 చెంచాల వైల్డ్ పసుపు, 2 చెంచాల చల్లపాలను తీసుకోండి.

స్టెప్ 2 ; రెండు వస్తువులను బౌల్ లో కలపండి.

స్టెప్ 3 ; ఈ పేస్టును మొహంపై బాగా రుద్ది 15-20 నిమిషాలు ఆరనివ్వండి.

స్టెప్ 4 ; మొహాన్ని మామూలు చల్లనీరుతో కడగండి.

ఈ మాస్క్ మొహంపై వెంట్రుకల రంగును తేలికచేయటంలో ప్రభావం చూపిస్తుంది.

3.ఓట్ మీల్ మాస్క్ ;

3.ఓట్ మీల్ మాస్క్ ;

ఓట్ మీల్ లో గరుకుదనం ఉండి చర్మంపై మృతకణాలను సులభంగా తొలగిస్తుంది.

స్టెప్ 1 ; 2 చెంచాల ఓట్ మీల్, 2 చెంచాల తేనె, 2 చెంచాల తాజా నిమ్మరసం తీసుకోండి.

స్టెప్ 2 ; అన్ని పదార్థాలను ఒక బౌల్ లో కలపండి.

స్టెప్ 3 ; ఈ మాస్క్ ను మీ చేత్తో ముఖమంతా పట్టించి 15-20 నిమిషాలు ఆరనివ్వండి.

స్టెప్ 4 ;ఆరాక, మీ మొహాన్ని మొత్తం చల్లనీరుతో నెమ్మదిగా కడుక్కోండి.

వారానికి రెండు లేదా మూడుసార్లు ఇలాచేసి మీ మొహంపై వెంట్రుకలే కాదు, చర్మం కూడా ఎక్స్ ఫోలియేట్ అయి కాంతివంతంగా మారటం చూడండి.

4.సెనగపిండి మాస్క్;

4.సెనగపిండి మాస్క్;

సెనగపిండి లేదా బేసన్ మొహంపై వెంట్రుకలను తొలగించటమేకాదు, చర్మంపై చచ్చిపోయిన కణాలను ఎక్స్ ఫోలియేట్ చేసి కాంతివంతం చేస్తుంది.

స్టెప్ 1 ;2 చెంచాల సెనగపిండి, 1చెంచా తాజా క్రీమ్ లేదా చల్లపాలు,1 చెంచా పసుపు తీసుకోండి.

స్టెప్ 2 ;అన్ని వస్తువులను కలిపి గట్టి పేస్టును తయారుచేయండి.

స్టెప్ 3 ; ఈ పేస్టును మీ మొహంపై బ్రష్ తో రాసుకుని 20 నిమిషాలు ఆరనివ్వండి.

స్టెప్ 4 ; మెత్తని స్పాంజి లేదా గోరువెచ్చని నీరులో ముంచిన తువ్వాలుతో తుడవండి.

ఈ పద్ధతిని వారానికి రెండు లేదా మూడుసార్లు పాటిస్తే మీ మొహంపై వెంట్రుకలు తగ్గిపోవటం మీరే చూస్తారు.

5.బొప్పాయి మాస్క్ ;

5.బొప్పాయి మాస్క్ ;

బొప్పాయి సహజ బ్లీచింగ్ పదార్థంగా పనిచేస్తుంది. ఈ సులభమైన మాస్క్ అన్నిరకాల చర్మాలపైన పనిచేస్తుంది.

స్టెప్ 1 ; రెండు చెంచాల బొప్పాయి గుజ్జు, 1 చెంచా చల్లని పాలను తీసుకోండి.

స్టెప్ 2 ; ఈ రెండింటిని కలిపి గట్టి పేస్టును తయారుచేయండి.

స్టెప్ 3 ; దీన్ని మీ మొహంపై బ్రష్ తో పట్టించుకుని 20-22 నిమిషాలపాటు ఆరనివ్వండి.

స్టెప్ 4 ;దీన్ని మెల్లగా వేళ్ళతో మొహమంతా రుద్దండి, ముఖ్యంగా మొహంపై వెంట్రుకల రంగు తేలిపోవాలనుకున్న చోట రుద్దండి.

స్టెప్ 5 ; తడి,మెత్తని స్పాంజితో లేదా గోరువెచ్చని నీటిలో ముంచిన తువ్వాలుతో కడిగేసి,తుడవండి.

ఈ మాస్క్ మొహంపై వెంట్రుకలను బ్లీచ్ చేసి, చర్మంపై ఎక్స్ ఫోలియేటింగ్ ప్రభావాన్ని చూపిస్తుంది.

English summary

Effective face masks for whitening facial hair naturally at home

Not most people are aware of the fact that facial waxing, bleaching, laser treatment, etc., might affect your skin drastically leading to health risks. In such cases, homemade masks work wonders for your skin. Lemon-honey mask, oatmeal mask, papaya mask, chickpea flour mask, etc., are some hacks you must definitely try.