TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
వేసవిలో పొడిచర్మం కోసం ఆచరించవలసిన ముఖ్యమైన ఫేస్ ప్యాక్లు !
వేసవికాలంలో పొడిచర్మం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు అంత సులభమేమీ కాదు. వేసవితాపం మరియు తీవ్రమైన సూర్యరశ్మి వల్ల మీ పొడిచర్మంలో ఉండే తేమ నష్టపోవచ్చు. ఈ కారణంచేత మీ చర్మం డీహైడ్రేషన్ కు గురవుతుంది. అలా మీ చర్మం వికారమైన రూపాన్ని పొంది ఉండే ఇతర చర్మ సమస్యలకు దారితీస్తుంది. పొడి చర్మం వల్ల చర్మలో తేమ కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది.
అందుచేత మీ చర్మానికి డీహైడ్రేషన్ ను అందించడం చాలా అవసరం, ఈ హైడ్రేషన్ మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో చర్మ సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వికారమైన చర్మసమస్యలను పారద్రోలి మీ చర్మం దీర్ఘకాలంపాటు ప్రకాశవంతంగా, తాజాగా ఉండేలా చేయగలుగుతుంది.
ఈ వేసవి కాలంలో మీ పొడి చర్మాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో అనే విషయం గురించి మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఆ విషయాలను మీకు తెలియజేయడం కోసం ఈరోజు మీ బోల్డ్ స్కై, ఈ ఆర్టికల్తో మీ ముందుకు వచ్చింది. మీరు మీ చర్మాన్ని అన్నివేళలా సంరక్షించగలిగే, ఫేస్ ప్యాక్ల తయారీ విధానం గురించి మీకు తెలియజేస్తున్నాం. ఈ ఫేస్ ప్యాక్స్ వేసవిలో మీ చర్మానికి కావల్సిన తేమను అందించి చర్మం అందంగా , కాంతివంతంగా తేమగా ఉండేట్లు చేస్తుంది.
మీ పొడిచర్మం లో గల లోపాలను సవరించి మృదువుగా సంరక్షించ గలిగే లక్షణాలను కలిగిన పదార్ధాలతో ఫేస్ప్యాక్లను ఎలా తయారుచేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మీరు అనుసరించే సౌందర్య సాధనాలలో ఈ ఫేస్ప్యాక్స్ ను ఒక భాగంగా చేసుకుంటే అద్భుతమైన చర్మ సౌందర్య ఫలితాలను పొందవచ్చు. అదెలాగే, అందుకు అవసరం అయ్యే పదార్థాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
1. పెరుగు పేస్-ప్యాక్ :-
పెరుగు మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచటానికి, తేనే మీ చర్మంపై తేమ కలిగి ఉండేటట్లు చేయడానికి సాయపడుతుంది. ఈ 2 పదాల కలయికతో మీ పొడి చర్మం పై అద్భుతాలను సృష్టించవచ్చు.
కావలసిన పదార్థాలు :
1 టేబుల్ స్పూన్ పెరుగు
అర టీస్పూన్ తేనే
2 స్ట్రాబెర్రీ పండ్లు
తయారీ విధానం :
స్ట్రాబెర్రీస్ను మెత్తని పేస్టులా చేసుకుని, దానికి మిగతా పదార్థాలను జోడించాలి. అలా తయారైన మిశ్రమాన్ని మీ ముఖంపై మృదువుగా మసాజ్ చేస్తూ, అప్లై చేయాలి. అలా అప్లై చేసిన 10-15 నిమిషాల వరకు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.
త్వరగా మరింత మెరుగైన ఫలితాలను పొందడం కోసం వారంలో కనీసం రెండు మూడు సార్లు ఈ ఫేస్ ప్యాక్స్ ను ఉపయోగించాలి.
2. దోసకాయ ఫేస్-ప్యాక్ :-
దోసకాయ - ఇరిటేటింగ్ చర్మం నుంచి ఉపశమనం కలిగించడంలోనూ, ఓట్మీల్ & ఆలివ్ ఆయిల్ మీ చర్మంపై ఉన్న మలినాలను తొలగించడంతో పాటు పొరలుగా ఉన్న మీ చర్మాన్ని నిరోధించడానికి కూడా ఉపయోగపడుతుంది. దోసకాయలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల చర్మానికి కావల్సిన తేమను అంధించి తేమగా ఉండేట్లు చేస్తుంది.
కావలసిన పదార్థాలు :
1 టేబుల్ స్పూన్ల దోసకాయ రసం
2-3 టేబుల్ స్పూన్ల ఓట్మీల్
అర టీస్పూన్ ఆలివ్ ఆయిల్
తయారీ విధానం :
ఒక గిన్నెలో పైన చెప్పిన పదార్థాలన్నీ తీసుకుని బాగా కలుపుతూ, ప్యాక్స్ ను తయారుచేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసిన 15 నిమిషాల వరకు అలానే వదిలివేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి.
మీ పొడిచర్మానికి చికిత్స చేసి - అద్భుతమైన ఫలితాలను పొందడం కోసం వారంలో 2 సార్లు ఈ ప్యాక్ ను ప్రయత్నించండి.
3. అలోవేరా పేస్-ప్యాక్ :-
తాజాగా సేకరించిన అలోవెరా జెల్ ను టమాటోను కలిపి ఫేస్ ప్యాక్ ను తయారు చేయడం వల్ల మీ చర్మం తేమగా ఉండడంతో పాటు, మృదువైన ఛాయను కలుగజేయడంలో కూడా సహాయపడుతుంది.
కావలసిన పదార్థాలు :
1 టేబుల్ స్పూను అలోవెరా జెల్
1 స్పూన్ టమోటా గుజ్జు
తయారీ విధానం :
పైన తెలిపిన పదార్థాలను ఒక గిన్నెలోకి తీసుకొని బాగా మెత్తగా కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసిన తర్వాత కొన్ని నిమిషాలపాటు బాగా ఆరనివ్వాలి. చివరిగా గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి.
మెరుగైన ఫలితాల కోసం వారంలో 2-3 సార్లు ఈ ఫేస్ ప్యాక్ ను ప్రయత్నించండి.
4. బొప్పాయి ఫేస్-ప్యాక్ :-
బొప్పాయి & లావెండర్ ఆయిల్ కలయికలు మీ చర్మాన్ని తాజాగా ఉంచడంతో పాటు, మీ చర్మాన్ని ఈ వేసవి కాలమంతటా తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
కావలసిన పదార్థాలు :
2-3 బొప్పాయి ముక్కలు (బాగా పండిన)
అర టీస్పూను లావెండర్ ఆయిల్
తయారీ విధానం :
బొప్పాయి ముక్కలను మెత్తని పేస్ట్ లా చేసుకున్న తర్వాత దానికి లావెండర్ ఆయిల్ ను కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారైన పేస్ట్ ను ముఖానికి అప్లై చేసిన 15 నిమిషాల వరకు బాగా ఆరనివ్వాలి. క్లెన్సర్ తో మృదువుగా మీ చర్మాన్ని శుభ్రపరచుకున్న తరువాత, వేడినీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి.
మంచి ఫలితాల కోసం వారానికి 2-3 సార్లు ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ ను ప్రయత్నించి చూడండి. మంచి ఫలితాలను పొందుతారు. లావెండర్ ఆయిల్ లేకపోతే మీరు రెగ్యులర్ గా ఉపయోగించే సహజ నూనెలను వాడుకోవచ్చు.