For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ కరేలా అలో వెరా ఫేస్ ప్యాక్ తో ఇన్స్టెంట్ గ్లోని సొంతం చేసుకోండి

|

చర్మాన్ని కాంతివంతంగా అలాగే ప్రకాశవంతంగా మార్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, వీరిలో కొందరు చర్మ సంరక్షణకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం మరచిపోతారు. మరికొందరు ఖరీదైన పార్లర్లకు అలాగే సెలూన్లకు వెళ్లి స్కిన్ ట్రీట్మెంట్స్, ఫేషియల్స్, క్లీన్ అప్స్ మరియు బ్లీచ్ లపై ఆధారపడతారు. అయితే, ఇంటి వద్దే ఇన్స్టెంట్ గ్లోని సొంతం చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా. వంటింట్లో సాధారణంగా లభ్యమయ్యే పదార్థాలతో అద్భుతమైన ఫేస్ ప్యాక్ ను తయారుచేసుకోవచ్చు. తద్వారా ఇన్స్టెంట్ గ్లోను పొందవచ్చు.

ఇంటివద్దే ఇన్స్టెంట్ గా కాంతివంతమైన చర్మాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలని ఆతృత పడుతున్నారా? అయితే, ఈ ఆర్టికల్ మీ కోసమే. ఈ విషయంలో హోంమేడ్ ఫేస్ ప్యాక్స్ మీకు ఉపయోగపడతాయి. వంటింటి అరలలో లభ్యమయ్యే కొన్ని పదార్థాలతో సులభంగా ఫేస్ ప్యాక్స్ ను తయారుచేసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా సరైన పదార్థాలను పిక్ చేసుకోవడమే. వీటితో తయారుచేయబడిన మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ గా అప్లై చేసుకోవాలి.

ఈ రోజు, అటువంటి రిఫ్రెషింగ్ హోంమేడ్ ఫేస్ మాస్క్ ను మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఈ ఫేస్ మాస్క్ ను ఉపయోగించడం ద్వారా ఇంతకు ముందెన్నడూ పొందని అద్భుతమైన ఫలితాలను మీరు పొందవచ్చు. ఈ పదార్థాలు కిచెన్ లో సులభంగా లభ్యమవుతాయి.

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

1 కరేలా

2 టేబుల్ స్పూన్ల అలోవెరా పల్ప్

1 టేబుల్ స్పూన్ తేనె

2 స్లైస్ ల తాజా దోసకాయ ముక్క

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

ఒక మీడియం సైజ్ బౌల్ ను తీసుకోండి.

తొక్క తీసిన కరేలాను చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేసుకోండి.

ఈ కరేలా ముక్కలను మిక్సర్ గ్రైండర్ లో వేయండి. బాగా గ్రైండ్ చేయండి.

ఒక బౌల్ లో కరేలా పల్ప్ ను ఉంచండి.

అందులో అలోవెరా పల్ప్ ను జోడించండి.

ఈ మిశ్రమానికి తేనెను జతచేయండి.

ఇప్పుడు, ఈ పదార్థాలని బాగా కలిపి చిక్కటి పేస్ట్ ను తయారుచేయండి.

ఈ మిశ్రమాన్ని అయిదు నుంచి పది నిమిషాల వరకు అలాగే ఉండనివ్వండి.

మీ ముఖాన్ని స్వచ్ఛమైన నీటితో శుభ్రంగా కడిగి ఒక టవల్ తో తుడుచుకోండి.

ఈ మిశ్రమాన్ని ఫేస్ పై ఈవెన్ గా అప్లై చేయండి.

దోసకాయను రెండు స్లైసెస్ గా కట్ చేసి కళ్లపై దోసకాయ స్లైసెస్ ను ఉంచండి.

20 నిమిషాల పాటు ఈ ఫేస్ ప్యాక్ ని అలాగే ఉంచండి.

ఒక కాటన్ బాల్ తీసుకుని దానిని నీళ్ళల్లో ముంచి ఈ ఫేస్ ప్యాక్ ను తొలగించండి.

ఇప్పుడు శుభ్రమైన నీటితో ఈ ఫేస్ ప్యాక్ ను తొలగించండి. ఒక టవల్ తో తడిని తుడిచేయండి.

ఈ ప్రాసెస్ ని వారానికి రెండు సార్లు పాటిస్తే మంచి ఫలితాలను మీరు గమనించగలుగుతారు.

గమనిక:

గమనిక:

ఈ ఫేస్ ప్యాక్ ను అప్లై చేసుకునే ముందు కాస్తంత మిశ్రమాన్ని మీ నుదుటిపై అప్లై ఈ ప్రాసెస్ ను పాటించి 24 గంటల పాటు వేచి చూడండి. ఏవైనా రియాక్షన్స్ ఉంటే మీకు తెలిసిపోతుంది. ఎటువంటి రియాక్షన్స్ లేకపోతే ఫేస్ ప్యాక్ గా ఈ మిశ్రమాన్ని వాడవచ్చు. సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారు ఈ ఫేస్ ప్యాక్ ను వాడే ముందు ప్యాచ్ టెస్ట్ ను చేసుకోవడం తప్పనిసరి.

ఇప్పుడు, ఈ ఫేస్ మాస్క్ ని తయారుచేసుకునే రెసిపీ మీకు తెలిసింది కదా! ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ లో వాడబడిన పదార్థాల వలన చర్మానికి కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.

కరేలాలో దాగున్న చర్మసంరక్షణ గుణాలు:

కరేలాలో దాగున్న చర్మసంరక్షణ గుణాలు:

1. ఇందులో యాక్నేను అలాగే బ్లేమిషెస్ ను తగ్గించే గుణం ఉంది.

2. డీప్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గించే సామర్థ్యం ఉంది.

3. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇచింగ్ మరియు బ్లడ్ బాయిల్స్ సమస్య నుంచి రక్షణ అందిస్తుంది.

4. రక్తాన్ని శుద్ధి చేసి మెరిసే చర్మాన్ని అందిస్తుంది.

5. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీలు పుష్కలంగా కలవు. విటమిన్ సి వలన ఈ ప్రాపర్టీలు లభిస్తాయి. హానీకర ఆల్ట్రావయొలెట్ రేస్ నుంచి రక్షణ లభిస్తుంది.

అలోవెరా ద్వారా చర్మానికి కలిగే లాభాలు:

అలోవెరా ద్వారా చర్మానికి కలిగే లాభాలు:

సన్ బర్న్ ను నయం చేయడానికి అలోవెరా అద్భుతంగా తోడ్పడుతుంది. ముఖంపై అలోవెరా క్రీమ్ ను అప్లై చేయడం ద్వారా చర్మంపై ప్రొటెక్టివ్ లేయర్ ఫార్మ్ అవుతుంది. ఇది మాయిశ్చర్ ను రిస్టోర్ చేసేందుకు తోడ్పడుతుంది.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు కలవు. ఇవి చర్మసంరక్షణకై తోడ్పడతాయి.

మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. ఆయిలీ స్కిన్ కలిగిన వారు చర్మంపై అలోవెరాను అప్లై చేసుకోవడం ద్వారా చర్మంపైనున్న అదనపు నూనెను తొలగించుకోవచ్చు.

యాక్నేను తొలగించేందుకు తోడ్పడుతుంది.

దురద, బ్లిస్టర్స్ అలాగే స్కిన్ ఇంఫ్లేమేషన్ ను తొలగించేందుకు తోడ్పడుతుంది.

ఇందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీలు కలవు.

తేనె వలన చర్మానికి కలిగే లాభాలు:

తేనె వలన చర్మానికి కలిగే లాభాలు:

కొన్ని యుగాల నుంచి తేనె అనేది అనేకవిధాలుగా మన లైఫ్ స్టయిల్ లో భాగంగా మారింది. అందువలన, తేనెను ప్రతిఒక్కరూ తమ డైలీ రొటీన్ లో భాగంగా చేసుకోవాలి. కనీసం ఒక స్పూన్ తేనెనైనా రోజూ తీసుకోవాలి. లేదా ముఖంపై అప్లై చేసుకోవాలి.

తేనె ద్వారా అనేక లాభాలను పొందవచ్చు. ఇది నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేసి పోర్స్ ను తొలగించేందుకు తోడ్పడుతుంది.

ఇది ఎక్స్ఫోలియేటర్ లా పనిచేస్తుంది.

సన్ బర్న్ ను ట్రీట్ చేస్తుంది.

ముఖంపైన స్కార్స్ ను తొలగించేందుకు తోడ్పడుతుంది.

యాక్నేమరియు పింపుల్స్ సమస్య నుంచి విముక్తిని కలిగిస్తుంది.

నేచురల్ గా చర్మంలోని కాంతిని వెలికితీసేందుకు తోడ్పడుతుంది.

ఇందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీలు కలవు.

చర్మంపై ముడతలను తగ్గిస్తుంది.

స్కిన్ కాంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది.

ఇప్పుడు ఈ అద్భుతమైన ఫేస్ ప్యాక్ లో వాడబడిన పదార్థాల యొక్క గొప్పతనం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు వీటిని ఉపయోగించి ఫేస్ ప్యాక్ ను తయారుచేసుకుని వాడి మెరుగైన ఫలితాలను పొందండి. ఇంటివద్దే ఇన్స్టెంట్ గ్లో ను సొంతం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ద్వారా మీరు పొందిన లాభాలను కామెంట్స్ సెక్షన్ లో మాకు తెలియచేయండి. బోల్డ్ స్కై కి ట్యూన్ అయి ఉండండి. స్కిన్ కేర్, బాడీ కేర్ అలాగే హెయిర్ కేర్ కి సంబంధించిన మరిన్ని ఫన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ను తెలుసుకోండి.

English summary

Get Instant Glow With This Amazing Karela-Aloe Vera Face Pack

Homemade face masks are one of the best options to choose, as you get all the ingredients handy in your kitchen shelves. All you need to do is pick up the right ingredients, follow the recipe, apply the mask, and see the results for yourself. Blending karela pulp with honey and aloe vera gel can work wonders for your skin.