For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పొటాటోతో డార్క్ నెక్ సమస్య నుంచి ఉపశమనం పొందండిలా

  |

  డార్క్ నెక్ సమస్యతో కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. మెడపై డార్క్ నెస్ ను తొలగించేందుకు మనం ఎన్నో చిట్కాలను ప్రయత్నించే ఉంటాము. మేకప్ ను వేసుకున్నా ఎంతో కొంత డార్క్ నెస్ ఎగ్జిబిట్ అవుతూనే ఉంటుంది. ఎన్నో సార్లు ఫేస్ వాష్ చేస్తూనే ఉన్నా ఈ సమస్య నుంచి ఉపశమనం లభించి ఉండదు. మెడపై డార్క్ నెస్ అనేది మనలో దిగులుని పెంచుతూ ఉంటుంది. ఎంత బాగా రెడీ అయినా ఈ డార్క్ నెస్ వైపే ఇతరుల ఫోకస్ పడటంతో అందంగా కనిపించేందుకు చేసిన మన ప్రయత్నం వృధాగా మారుతుంది.

  ఈ సమస్య ఎందుకెదురవుతుందంటే మనం ఎక్కువగా ముఖంపై ఫోకస్ పెట్టి ఫేస్ వాష్ లతో పాటు వివిధ హోమ్ రెమెడీస్ ను ప్రయత్నిస్తాము. ఆ సమయంలో మెడ భాగాన్ని ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. అందువలన, మెడపై దుమ్మూ ధూళి పేరుకుపోవడం జరుగుతుంది. డెడ్ స్కిన్ సెల్స్ కూడా అలాగే నిలిచి ఉంటాయి. వీటివలన మెడపై డార్క్ స్పాట్స్ తో పాటు కొన్ని ప్యాచెస్ ఫార్మ్ అవుతాయి. ఇవి చర్మాన్ని డల్ గా అలాగే అందవికారంగా మార్చుతాయి. అందువలన, ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు కొన్ని హోమ్ మేడ్ హ్యక్స్ తో సిద్ధంగా ఉండాలి. అప్పుడు, సులభంగా ఈ డార్క్ ప్యాచెస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

  Get Rid Of Dark Neck Instantly With Potato

  ఈ సమస్యకు ఏదైనా శాశ్వత పరిష్కారం ఉంటే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు కదూ? అయితే, ఈ పరిష్కార విధానాన్ని తెలుసుకుని మీకంటే ఆనందపడే వారు మరెవ్వరూ ఉండరనడంలో సందేహం లేదు. ఈ ప్రాసెస్ ని పాటించడం చాలా సులభం. ఈ ప్రాసెస్ ఎంతో సమర్థవంతమైనది కూడా. మరి ఈ ప్రాసెస్ ను తెలుసుకునేందుకు మీరు ఉత్సాహంగా ఉన్నారా? అయితే, ఇక్కడ ఈ ప్రాసెస్ గురించి తెలుసుకోండి. ఈ విధానాన్ని పాటించడం మెడపై డార్క్ నెస్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

  పొటాటో ద్వారా చర్మానికి అందే ప్రయోజనాల గురించి తెలుసుకోవాలనుందా? అయితే, ఈ ఆర్టికల్ ను మీరు ఖచ్చితంగా చదివి తీరాలి. ఇందులో పొటాటో ద్వారా చర్మానికి అందే ప్రయోజనాల గురించి స్పష్టంగా వివరించాము. ముందుగా, డార్క్ నెక్ సమస్య నుంచి పొటాటో ద్వారా ఎలా లబ్ది పొందాలో తెలుసుకుందాం.

  కావలసిన పదార్థాలు:

  కావలసిన పదార్థాలు:

  • ఒక పొటాటో

  • ఒక కాటన్ బాల్

  • ఒక వెట్ వైప్ టిష్యూ లేదా శుభ్రమైన హ్యాండ్ టవల్

  ఎలా తయారుచేయాలి?

  ఎలా తయారుచేయాలి?

  • ఒక చిన్న సైజు పొటాటోను తీసుకోండి.

  • దాని తొక్కను పీల్ చేయండి. ఇప్పుడు పొటాటోను రెండు భాగాలుగా చేసుకోండి.

  • ఇప్పుడు ఒక భాగాన్ని తీసుకుని తురిమి దాన్ని ఒక పాత్రలోకి తీసుకోండి.

  • మరొక భాగాన్ని కూడా తీసుకుని దాన్ని కూడా తురమండి.

  • ఇప్పుడు, ఇంకొక పాత్ర తీసుకుని అందులోకి పొటాటో రసాన్ని పిండండి.

  • ఈ పొటాటో జ్యూస్ ను ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి.

  ఎలా అప్లై చేయాలి?

  ఎలా అప్లై చేయాలి?

  • ఒక కాటన్ బాల్ ను తీసుకోండి.

  • దాన్ని పొటాటో రసంలో ముంచి ఆ కాటన్ బాల్ తో మెడపై ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి. డార్క్ మరియు ప్యాచీ ఏరియాస్ పై శ్రద్ధ వహించండి.

  • ఇలా పదిహేను నిమిషాల పాటు ప్రభావిత ప్రాంతంపై రబ్ చేయండి.

  • మరో పదిహేను నిమిషాల వరకు ఈ పొటాటో రసాన్ని చర్మం గ్రహించేలా అలాగే ఉంచండి.

  • ఆ తరువాత వెట్ వైప్ తో చర్మాన్ని శుభ్రపరుచుకోండి. లేదా మెడను నీళ్లతో శుభ్రంగా కడగండి.

  • ఈ పద్దతిని ప్రతి రోజూ నెలపాటు పాటిస్తే ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు.

  గమనిక:

  గమనిక:

  అన్ని నేచురల్ మరియు హోమ్ మేడ్ రెసిపీలు లేదా హ్యక్స్ అనేవి ఫలితాన్ని చూపించడానికి సమయం తీసుకుంటాయి. అయితే, వీటి ద్వారా కలిగే ఫలితం ప్రభావవంతంగా ఉంటుంది. వంద శాతం ఆశించిన ఫలితం అందుతుంది.

  ఇప్పుడు ఈ సులభమైన హ్యాక్ ను పాటించడం ద్వారా మెడపై డార్క్ ప్యాచెస్ నుంచి విముక్తి లభిస్తుంది. ఇప్పుడు, మరింత ఆసక్తికర విషయంలోకి వద్దాం. ఈ రెమేడీ ద్వారా అందే ప్రయోజనాల గురించి చర్చించుకుందాం. పోటాటోనే ఎందుకు వాడాలి? దీని వెనుక ఒక కారణం ఉంది. ఈ కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...

  పొటాటో ద్వారా చర్మానికి అందే ప్రయోజనాలు

  పొటాటో ద్వారా చర్మానికి అందే ప్రయోజనాలు

  • డార్క్ స్పాట్స్, కంటి కింద డార్క్ సర్కిల్స్ మరియు ముడతలను తొలగించుకునేందుకు తోడ్పడుతుంది.

  • సన్ బర్న్స్ ను ట్రీట్ చేస్తుంది.

  • డార్క్ స్కిన్ ను లైటెన్ చేయడానికి తోడ్పడుతుంది.

  • డ్రై స్కిన్ ను ట్రీట్ చేస్తుంది.

  • చర్మాన్ని ఎక్స్ఫోలియెట్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

  ఇప్పటికి, పొటాటో ద్వారా అందే చర్మ సంరక్షణ గుణాల గురించి మీకు స్పష్టమైన అవగాహన ఏర్పడింది కదూ. మరింకెందుకు ఆలస్యం, ఈ రెమెడీని పాటించి మెడపై డార్క్ స్కిన్ సమస్యను తొలగించుకోండి. ఇంకొక్క ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెమెడీ అనేది డార్క్ ప్యాచెస్ సమస్యను తగ్గించుకునేందుకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు నల్లటి మోచేతులు అలాగే నల్లటి మోచేతుల సమస్య నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.

  English summary

  Get Rid Of Dark Neck Instantly With Potato

  Get Rid Of Dark Neck Instantly With Potato,Dark neck or dark patches or spots on the neck area seem to be a tough problem most women often deal with. So, how do we get rid of it permanently? You must be wondering if there is at all any permanent solution to this problem, isn't it? Well, you would be happy to know that
  Story first published: Wednesday, June 20, 2018, 10:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more