For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళ కింద సంచులను తగ్గించుకునేందుకు సహజ తైలాలను ఉపయోగించి పాటించదగిన చిట్కాలు!

|

మీ కళ్ళ క్రింద సంచులు ఏర్పడటం వలన మీరు చూడటానికి ఎల్లప్పుడు నిస్తేజంగా కనిపిస్తున్నారా? మీ అందాన్ని దెబ్బతీసే ఈ సమస్య నివారణ కోసం సహజ పద్దతులకై ఎదురు చూస్తున్నారా? అయితే మీరు సరైన చోటుకు వచ్చారు.

కంటి కింద సంచులలో, చూపులకు మిమ్మల్ని నిస్తేజంగా మార్చేయడమే కాక, మీ ముఖాన్ని అలసిపోయినట్లు మరియు అసహ్యకరంగా చేస్తుంది. ఆ ప్రాంతంలో మెలనిన్ ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు కళ్ళు కింద చర్మం నల్లబడుతుంది.

Get Rid Of Under Eye Bags With these Oils

నిద్ర లేకపోవటం, సూర్యుడి తీవ్ర కిరణాలకు గురికావడం, అధిక ధూమపానం మరియు మద్యపానం, ఒత్తిడి మొదలైనవి వంటి అనేక ఇతర అంశాలు వలన కూడా, ఇలా కళ్ళ కింద సంచులు ఏర్పడతాయి. వీటి నివారణకు సహజ తైలాలను ఉపయోగించి చేసే గృహవైద్య చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని పాటించి మీ ముఖాన్ని తాజగా పునరుత్తేజితం చేసుకోండి.

1. ఆలివ్ నూనె

1. ఆలివ్ నూనె

ఆలివ్ నూనెలో ఉన్న యాంటీఆక్సిడెంట్ లక్షణాల సహాయంతో, మీ కళ్ళు కింద చర్మం రంగును తేలికగా మార్చుకోవచ్చు. అంతేకాక, ఆలివ్ నూనె చర్మానికి తేమ సమకూర్చి, మృదువుగా మారుస్తుంది.

ఎలా రాసుకోవాలి?

కొంచెం ఆలివ్ నూనెను తీసుకుని, మీ కళ్ళ క్రింద రాసుకుని, మృదువుగా మర్దన చేసుకోవాలి. మీరు ప్రతి రోజు పడుకోబోయే ముందు దీనిని రాసుకుని, లేచాకా సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. మీ కళ్ళ కింద తేడాని మీరు గమనించేంతవరకు, ప్రతి రోజు మీరు ఈ చిట్కాలను ఉపయోగించండి.

2. బాదం నూనె:

2. బాదం నూనె:

బాదం నూనెలో ఉన్న ఓలిక్ ఆమ్లం, దీనిలోనిఇది పోషక విలువను మరియు ఔషధ విలువను పెంచుతుంది. బాదం నూనె, మీ చర్మానికి తేమను సమకూర్చడంతో పాటు, మీ మేనిఛాయను తేలిక పరచడంలో సహాయపడుతుంది. బాదం నూనెలో A, B, C, D మరియు E విటమిన్లతో పాటు ఉన్న ప్రోటీన్, ఫైబర్, ఇనుము మరియు పొటాషియం చర్మం యొక్క రంగును తేలిక పరుస్తాయి.

ప్రధానంగా, బాదంలు రెండు రకాలు. తీపి బాదం మరియు చేదు బాదం. సాధారణంగా సౌందర్య ఉత్పత్తుల తయారీ కొరకు, ముఖ్యంగా చర్మ సంరక్షణ కోసం తీపి బాదం ఉపయోగిస్తాము.ఎలా రాసుకోవాలి?

మీరు చేయవలసినదల్లా, మీ మునివేళ్ళతో చేతుల్లో 2-3 చుక్కల బాదం నూనె తీసుకుని, మీ కళ్ళు కింద 2-3 నిమిషాలు పాటు నెమ్మదిగా మర్దన చేసుకోండి. తరువాత 15-20 నిముషాల పాటు ఆరనిచ్చి, ఆపై సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు ఉదయం లేదా రాత్రి పడుకోడానికి ముందు ఇలా చేయవచ్చు. క్రమం తప్పకుండా ఈ చిట్కాను పాటిస్తే, మీరు ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

3. ఆర్గాన్ తైలం

3. ఆర్గాన్ తైలం

ఆర్గాన్ తైలంలో క్రిమినాశక, యాంటీ ఫంగల్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మానికి మేలు చేస్తాయి. దీనిలోని విటమిన్ E మరియు ఒమేగా 3, 6 మరియు 9 కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని పునరుజ్జీవింపడంలో సహాయపడతాయి. అంతేకాక, చీకటి మచ్చలను తేలికగా తొలిగించడంలో సహాయపడతాయి.

ఎలా రాసుకోవాలి?

దీని కొరకు మీరు కావలసినదల్లా, మూడు చుక్కల స్వచ్ఛమైన ఆర్గాన్ తైలం మాత్రమే. మీ చేతివేళ్ల సహాయంతో ఇది మీ కళ్ళ క్రింద రాసుకోండి. అది మీ కళ్ళలోకి పోకుండా చూసుకోండి. కొన్ని సెకన్లపాటు మృదువుగా మర్దన చేసుకున్నాక, 15 నిముషాల పాటు ఆరనివ్వండి. తరువాత, సాధారణ నీటిలో దాన్ని శుభ్రం చేసుకోండి. వేగవంతమైన ఫలితాల కోసం ప్రతి రోజూ తప్పక ఉపయోగించండి.

4. లావెండర్ తైలం

4. లావెండర్ తైలం

లావెండర్ తైలం క్రిమినాశక కారకాలు మరియు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉండటం వలన, చర్మానికి రాసుకుంటే చాలా మేలు చేస్తుంది. ఈ లక్షణాలు పాటు, లావెండర్ తైలం చర్మంపై వాపులను కూడా నయం చేస్తుంది. ఇది అద్భుతమైన డి-టాక్సిఫైయర్ మరియు నొప్పి నివారిణిగా పనిచేసి మీ చర్మానికి మేలు చేస్తుంది.

ఎలా రాసుకోవాలి?

ఈ చిట్కా పాటించడానికి, మీరు కావాల్సినదల్లా రెండు చుక్కల లావెండర్ తైలం మరియు కొంచెం నీరు మాత్రమే. నీటిలో లావెండర్ తైలం వేసి బాగా కలపాలి. రాత్రి పడుకోవడానికి ముందు, మీ కళ్ళు కింద ఈ ద్రావణాన్ని రాసుకోండి. మరుసటి రోజు ఉదయం, చల్లని లేదా సాధారణ నీటితో కళ్ళను శుభ్రం చేసుకోండి. ఉదయం పూట కూడా, మీరు ఈ పద్దతిని అవలంబింపవచ్చు.

English summary

Get Rid Of Under Eye Bags With these Oils

Under eye bags that appear under the eye not only makes your eyes dull but also makes your whole face look tired and unpleasant. Dark skin under the eyes appear when the melanin production of there is excess melanin production on the skin. Some essential oils like olive oil, argan oil, almond oil, etc. will help you I getting rid of these under eye bags effectively.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more