మృదువైన పెదవులకు ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోగలిగే మాస్కులు

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

వయసు, అవయవ సౌష్టవం తో సంబంధం లేకుండా, ఈ ప్రపంచంలో ఏ స్త్రీకి అయినా అందాన్నిచ్చేది చెరగని చిరునవ్వు మాత్రమే! అందరూ అనుకునేట్టు అందమైన చిరునవ్వుకై కేవలం ముత్యాల్లాంటి పలువరస ఒక్కటే కాదు దొండపళ్ల లాంటి పెదవులు కూడా దోహదపడతాయి.

సాధారణంగా ఏ వ్యక్తయినా మాట్లాడేటప్పుడు వారి పెదవుల కదలికను గమనించడం మానవ సహజం. ఇటువంటి కారణాల వలన మృదువైన, ఎర్రని పెదవులను కూడా మనం కోరుకుంటాం.

ముందుగా మీ పెదవుల అందానికి అడ్డుపడుతున్న కారణాలను తెలుసుకోండి. మన జీవనశైలిలో పొగత్రాగడం, మద్యపానం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు ఉంటే అవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా, నీటిని శారీరక అవసరాలకన్నా తక్కువగా తాగడం, ఎండ మరియు కాలుష్యానికి అధికంగా గురవ్వడం కూడా సమస్యలను తీవ్రతరం చేస్తాయి.

Get Smooth Lips With These Simple Homemade Masks

ఆధునిక జీవనశైలిలో భాగంగాఎక్కువ కెఫిన్ తో కూడిఉన్న పానీయాలు సేవించడం వలన కూడా పెదవులు పగిలి రంగు మారిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మెత్తని ఎర్రని పెదవులు పొందటం అంత తేలికేమి కాదు. ఈ వ్యాసంలో పెదవుల మెరుపుకై చిట్కాలు, ఉపాయాలు తెలుసుకుందాం!

తేనె మరియు నిమ్మరసం మాస్క్: ఛాయ తక్కువగా ఉండే వారికి అమిరే మాస్కు ఇది. తేనె సహజ మాయిశ్చరైసర్ గా మరియు నిమ్మరసం బ్లీచ్ మాదిరిగా పనిచేస్తాయి. ఒక టీ స్పూన్ తేనెలో అర టీ స్పూన్ తాజా నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని పెదవులపై రాసుకుని 15-20 ,నిమిషాలు ఆరనివ్వండి. ఇలా చేస్తే పెదువులపై కాలుష్యం యొక్క ప్రభావం నశించి ఎర్రగా, మృదువుగా తయారవుతాయి

కోకో మరియు చాక్లెట్ మాస్కు: ఇది తెల్లగా ఉండేవారికి సరిపడుతుంది. మీరు చేయవల్సినదల్లా ఒక టీ స్పూన్ కోకో బటర్ మరియు రెండు ముక్కల తీపిలేని డార్క్ చాక్లెట్ లని కలిపి కరిగించాలి. దీనికి ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ లోని నూనెను కలపాలి. ఇలా చేయగా తయారైన మాస్కును ఒక డబ్బాలో వేసి చల్లారనివ్వండి. చల్లారాక పెదవులపై రాసుకుని 15-20 నిమిషాలు ఆరనిచ్చి గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా చేస్తే పెదవులు మెరుపును సంతరించుకుంటాయి

కలబంద్ గుజ్జు మాస్కు: ఇది అని వయస్సుల వారికి , అన్ని ఛాయలవారికి కూడా సరిపడుతుంది. దీనిని పిల్లలకు కూడా రాయవచ్చు. మీరు చేయవల్సిందల్లా ఒక కలబంద ఆకును మధ్యకు చీల్చి గుజ్జును తీసి ఒక శుభ్రమైన గాజు సీసాలో వేసి దానిలో కొన్ని చుక్కల కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో ఉంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెదవులకు పూసుకోండి.

పసుపు మరియు పాల మాస్కు: ఈ మాస్కులో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటం వలన ముప్ఫై పైబడిన వారికి ఇది సరిపడుతుంది. ఈ మిశ్రమాన్ని పెదవులకు పూసుకుని 5-7 నిమిషాల పాటు ఆరనిచ్చి రుద్దండి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి మూడు నుండి నాలుగుసార్లు పడుకోబోయే ముందు రాసుకుంటే పెదవులు ఎర్రగా మృదువుగా ఉంటాయి..

English summary

Get Smooth Lips With These Simple Homemade Masks

Having smooth, pink lips is something every woman dreams of. It is true that irrespective of her age, body structure or looks, any woman can take the world in her stride with a good smile. Homemade masks enriched with honey and lemon, chocolate, aloe vera, milk cream and turmeric work wonders for smooth lips, leaving behind a beautiful smile.
Story first published: Sunday, April 8, 2018, 13:00 [IST]