For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ హోమ్ రెమెడీస్ తో ఏజ్ స్పాట్స్ కి చెక్ పెట్టేద్దాం

|

ఏజింగ్ ని ఎవరూ ఇష్టపడరు. అయితే, ఏజింగ్ అనే ప్రక్రియను యాక్సెప్ట్ చేయడం మినహా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇది ప్రకృతి సహజం. సహజసిద్ధంగా ఏజింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. మానసిక ఆరోగ్యానికి అలాగే శారీరక ఆరోగ్యానికి ప్రకృతి పరంగా శరీరంలో జరిగే మార్పులు మంచివేనని గుర్తించాలి.

కానీ, ఈ ఏజింగ్ అనేది ముందుగానే మనల్ని పలకరిస్తే? ఈ ఆలోచనే కాస్త ఆందోళనను కలిగిస్తోంది కదూ? కాబట్టి, కొన్ని సమర్థవంతమైన హోమ్ రెమెడీస్ ద్వారా ఏజింగ్ ప్రాసెస్ ని నెమ్మది చేయవచ్చు.

ఈ రోజుల్లో, చర్మం తన సౌందర్యాన్ని త్వరగా కోల్పోతోంది. ఇంతకు ముందు జెనెరేషన్స్ తో పోలిస్తే ఈ జెనెరేషన్ వారి చర్మం త్వరగా వృద్ధాప్య లక్షణాలను సంతరించుకుంటోంది. ఒత్తిడే వీటన్నిటికీ మూలకారణం. కంప్యూటర్ ముందే ఎక్కువసేపు గడపడం, సరైన వ్యాయామం లేకపోవడం, తాజా గాలికి లోటు ఏర్పడటం, పోషకాహార లోపం వంటి వివిధ కారణాలు ఏజింగ్ ను త్వరగా స్వాగతిస్తున్నాయి. అందువలన, స్కిన్ తన ఎలాస్టిసిటీని వేగంగా కోల్పోతోంది.

కాలుష్యం కూడా విపరీతంగా పెరగడంతో చర్మం ఆరోగ్యం దెబ్బతింటోంది. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ను కూడా పరిరక్షించుకోవడం వలన చర్మాన్ని సంరక్షించుకున్నవారవుతాము.

చర్మం ఎక్కువగా మెలనిన్ లేదా స్కిన్ పిగ్మెంట్ ని ఉత్పత్తి చేయడం వలన ఏజ్ స్పాట్స్ అనేవి ఏర్పడతాయి. ఏభై దాటిన వారిలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, ఈ మధ్య ఇవి యుక్తవయసు వారిని కూడా పలకరిస్తున్నాయి. ఎండలో ఎక్కువ సేపు గడిపితే ఏజ్ స్పాట్స్ ఏర్పడతాయి. అలాగే, లైట్ స్కిన్ కలిగిన వారిలో కూడా ఇవి కనిపిస్తాయి.

మీతో ఎల్లప్పుడూ సన్ స్క్రీన్ ని వెంట ఉంచుకుని రెగ్యులర్ ఇంటెర్వల్స్ లో సన్ స్క్రీన్ తో చర్మాన్ని సంరక్షించుకుంటే ఏజ్ స్పాట్స్ ని కొంతవరకూ అరికట్టవచ్చు.

ఏజ్ స్పాట్స్ ని తగ్గించే కొన్ని సమర్థవంతమైన హోమ్ రెమెడీస్ ఇవే.

1. లెమన్ జ్యూస్:

1. లెమన్ జ్యూస్:

లెమన్ జ్యూస్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ అనేది స్కిన్ సెల్స్ ని బ్రేక్ డవున్ చేయడానికి తోడ్పడుతుంది. చర్మం పైపొరని తొలగించి నూతన చర్మాన్ని వెలికితీస్తుంది. ఇందుకే, లెమన్ ని ఉత్తమమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పరిగణిస్తారు. కాస్తంత లెమన్ జ్యూస్ ను తీసుకుని ఏజ్ స్పాట్స్ పై రాయండి. ప్రభావిత ప్రాంతంపై లెమన్ జ్యూస్ ని కొంత సమయం వరకు తొలగించవద్దు. ఆ తరువాత నీటితో ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రం చేసుకోండి. ఈ రెమెడీని పాటిస్తున్నప్పుడు కొద్దిసేపటి వరకు ఎండలోకి వెళ్ళకపోవడం మంచిది.

2. ఆపిల్ సిడర్ వినేగార్:

2. ఆపిల్ సిడర్ వినేగార్:

ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్స్ అనేవి ఆపిల్ సిడర్ వినేగార్ లో లభిస్తాయి. ఇటువంటి యాసిడ్స్ హై ఎండ్ కాస్మటిక్స్ లో అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో కనిపిస్తాయి. ఈ ఇంగ్రిడియెంట్ ని వాడిన కొత్తలో చర్మం కొంత ఉబ్బినట్టుగా మారి ఎరుపుగా తయారవడం సహజం. ఒక పార్ట్ ఆపిల్ సిడర్ వినేగార్ లో రెండు పార్ట్స్ తేనెని కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఏజ్ స్పాట్స్ ఉన్న ప్రదేశాలలో ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి. ప్రతి రోజూ ఈ రెమెడీని పాటిస్తే ఆశించిన ఫలితం దక్కుతుంది.

3. క్యాస్టర్ ఆయిల్:

3. క్యాస్టర్ ఆయిల్:

ఏజ్ స్పాట్స్ పై పోరాటం సాగించేందుకు క్యాస్టర్ ఆయిల్ అమితంగా తోడ్పడుతుంది. కొంత క్యాస్టర్ ఆయిల్ ను ప్రభావిత ప్రాంతంపై రాసి మసాజ్ చేయాలి. కొన్ని గంటల తరువాత మీ రెగ్యులర్ ఫేస్ వాష్ ను ఉపయోగించి చర్మాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ పద్దతిని ప్రతిరోజూ పాటిస్తే ఏజ్ స్పాట్స్ ఫేడ్ అయిపోతాయి.

4. పాలు:

4. పాలు:

పాలు చర్మసంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఏజ్ స్పాట్స్ ను తొలగించేందుకు ముఖ్యపాత్ర పోషిస్తాయి. పాలలో లాక్టిక్ యాసిడ్ లభ్యమవుతుంది. మార్కెట్ లో లభ్యమయ్యే వివిధ కాస్మెటిక్స్ లో లాక్టిక్ యాసిడ్ ని విరివిగా వాడుతున్నారు. సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారికి పాలు ఉపయోగకరంగా ఉంటాయి. చర్మం ఎర్రగా అలాగే ఉబ్బినట్టుగా మారకుండా సున్నితంగా డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది. చర్మాన్ని మాయిశ్చరైజ్డ్ గా ఉంచుతుంది.

5. టమాటో జ్యూస్:

5. టమాటో జ్యూస్:

లెమన్ జ్యూస్ వంటి ఎఫెక్ట్స్ నే అందిస్తుంది టమాటో జ్యూస్. అయితే, లెమన్ జ్యూస్ కంటే మరింత జెంటిల్ గా చర్మాన్ని డీల్ చేస్తుంది. ఇందులో, సిట్రిక్ యాసిడ్ తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. దీనిని సులభంగా అప్లై చేసుకోవచ్చు. టమాటో స్లైస్ లను కట్ చేసి ఆ తరువాత వాటిని చర్మంపై ఉంచండి. టొమాటో రసాన్ని చర్మం గ్రహించే వరకు వేచి చూడండి. ఆ తరువాత చల్లటి నీటితో చర్మాన్ని శుభ్రపరుచుకోండి. ప్రతి రోజూ ఈ విధంగా చేస్తే చర్మంపై నున్న ఏజ్ స్పాట్స్ ఇట్టే మాయమవుతాయి. సన్ బర్న్ తరువాత కూడా ఈ విధంగా చేస్తే చర్మం ప్రశాంతపడుతుంది.

6. టర్మరిక్:

6. టర్మరిక్:

టర్మరిక్ అనేది అత్యద్భుతమైన స్కిన్ కేర్ ఇంగ్రిడియెంట్. కాస్తంత రోజ్ వాటర్ లో కొంత టర్మరిక్ ని వేసి పిగ్మెంటేషన్ సమస్య కలిగిన ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ప్రతి రోజూ ఈ రెమెడీని పాటించడం ద్వారా చర్మం మెరుగవడాన్ని మీరు గుర్తించగలుగుతారు.

English summary

Home Remedies For Age Spots

Ageing is a natural process. Age spots is something which we cannot avoid. It can occur due to internal or external factors. Trying out on different home remedies can eventually reduce age spots and help you attain a clear face. Some of the best home remedies that are a must try are lemon juice, turmeric, tomato juice, etc.
Desktop Bottom Promotion