For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీపు మీద వచ్చే మొటిమలను సమర్ధవంతంగా తిప్పికొట్టే గృహవైద్య చిట్కాలు!

|

జీవితమనేది లెక్కలేనన్ని చిత్రవిచిత్రమైన సమస్యల సమాహారం. వాటికి మొటిమలు కూడా తొడవ్వాలని ఎవరూ ఆశించరు. కానీ మనకువాటిని తప్పించుకునేందుకు ఇంకొక దారి లేదు. మనం ఆహ్వానిచకుండానే అవి మనను చుట్టుముడతాయి. మనని ఎంతో బాధకు గురిచేసి వెంటాడి వేధిస్తుంటాయి. అంతేకాక, వాటి గుర్తులుగా మచ్చలను వదిలి వెళ్తుంటాయి. అదృష్టవశాత్తూ వీటికి చికిత్స మన వంటగదిలోనే ఉంది.

వీపు మీద వచ్చే మొటిమలు చాలా నొప్పితో కూడుకుని, నివారణకు కష్టతరంగా ఉంటాయి. మీరు కూడా వీపు మీద మొటిమలని నివారించడానికి ప్రయత్నించి అలసిపోయి ఉన్నారా? వ్యధ చెందకండి. మనలో చాలా మందికి ఈ సమస్య ఉంది. శుభవార్త ఏమిటంటే, శరీరం మీద ఇతర భాగాల్లో వచ్చే మొటిమల వలే వీటిని కూడా సులువుగా నివారించుకోవచ్చు.

8 Simple Home Remedies For Back Acne That Actually Work

అసలు వాస్తవమేమిటంటే, మన చర్మానికి మొటిమలను మరియు మచ్చలను నిర్మూలింప చేసే సొంత విధానం ఉంది. కాకపోతే, దీనికి కొంచెం సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఈ ప్రక్రియ ను వేగవంతం చేయడానికి మరియు ఫలితం త్వరగా పొందడానికి, మనం మన వంటగదిలో దొరికే ప్రకృతి సహజమైన ఎనిమిది పదార్థాలను వినియోగించుకోవచ్చు. వీటిలో మీకు ఇది సరిపడుతుందో, దానిని అనుసరించవచ్చు. కానీ, ముందుగా మనం అసలు వీపు మీద మొటిమలు ఎలా ఏర్పడటానికి కారణం తెలుసుకోవాలి.

వీపుపై మొటిమలు ఎందుకు ఏర్పడతాయి?

మనం ముఖం మీద మల్లే, మన వీపు మీద కూడా సీబం అనే మైనం వంటి జిడ్డుతో కూడిన పదార్ధంను స్రవించే సెబెషియస్ గ్రంధులు ఉంటాయి. ఇది మన చర్మానికి, జుట్టుకు నునుపునిచ్చే తైలం వలె పనిచేస్తుంది. ఇది బాక్టీరియా వంటి బాహ్య కారకాల నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది. కొన్నిసార్లు ఇవి అతిగా స్రవించడం మూలాన, బాక్టీరియా మరియు చర్మం పై పేరుకున్న మృతకణాలతో కలిసి చర్మరంధ్రాలను పూడ్చేస్తాయి. దీని వలన మొటిమలు ఏర్పడతాయి.

1. కలబంద- అద్భుతాల పొద!

1. కలబంద- అద్భుతాల పొద!

ఈ మొక్క పరిష్కరించలేని సమస్య ఏదైనా ఉందా? కలబంద ప్రకృతి మనకు అందించిన వెలకట్టలేని బహుమతి. ఇది సహజమైన యాంటీమైక్రోబియల్ మరియు యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు కలిగివున్నందున, మొటిమలను కలుగజేసే బాక్టీరియాను నాశనం చేయడమే కాక, నష్టపోయిన చర్మాన్ని మెరుగుపరిచి, మచ్చలను తగ్గిస్తుంది. అంతేకాక, దీనికి చర్మాన్ని చల్లబరిచే గుణం కూడా ఉంది. కలబంద ఆకును కత్తితో తెరచి, దానిలోని గుజ్జును వెలికితీసి ప్రభావిత ప్రదేశంలో నేరుగా రాసుకోవాలి. మీ ఇంటి వద్ద కలబంద ఆకులు దొరకని యెడల, గుజ్జు మార్కెట్లో లభిస్తుంది. దీనిని రోజుకు రెండు సార్లు రాసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు.

2. నిమ్మకాయ

2. నిమ్మకాయ

ఈ అద్భుతమైన ఫలంలో మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది సహజమైన బ్లీచ్ గా పనిచేసి,మేనిఛాయను మరియు వీపుపై ఉండే వెంట్రుకల రంగును తేలిక పరుస్తుంది. ఇది చర్మంలో కొల్లాజన్ ను పెంచి, వీపుపై ఉన్న మచ్చలను తొలగించి, ఇకపై మొటిమలు ఏర్పడకుండా చేస్తాయి.

3. టమాటో

3. టమాటో

టొమాటోలలో సాల్సిలిక్ యాసిడ్ మరియు విటమిన్ సి మెండుగా ఉంటాయి. ఇవి రెండు ప్రభావవంతంగా మొటిమలను తుడిచిపెట్టేసి, మేనిఛాయను తేలిక పరచి, చర్మాన్ని రిపేర్ చేస్తాయి. టొమాటోలో ఉండే కేరోటీన్ లో సహజమైన యాంటిఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫలమేటరీ ఏజంట్లు మన శరీరానికి ప్రయోజనాలు కలిగిస్తాయి.

4. ఆలివ్ నూనె

4. ఆలివ్ నూనె

వీపు మీద వచ్చే మొటిమలను ఇది సులువైన పరిష్కారం. మీరు చేయవలసినదల్లా పడుకోబోయే ముందు మొటిమలు ఎక్కువగా వున్న ప్రదేశాల్లో ఆలివ్ నూనెను రాసుకుని నిద్రకు ఉపక్రమించడమే! తరువాతి రోజు పొద్దుట ఆ ప్రదేశాన్ని శుభ్రంగా నీటితో కడిగేయండి. ఆలివ్ నూనెలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటిఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నందున మొటిమల వలన కలిగే మంటను తగ్గించి, సహజ మాయిశ్చరైజర్ వలె పనిచేస్తుంది.

5. తేనె

5. తేనె

అద్భుతమైన రుచితో, మీ నాలుకపై రుచిమొగ్గలను తాగేందుకు ప్రేరేపించే తేనె, మీ వీపు మీద మొటిమలను ప్రభావవంతంగా తగ్గిస్తుంది అని మీకు తెలుసా? తేనెలో యాంటీబాక్టీరియల్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు మొటిమలను తగ్గించి, వాటిని వ్యాప్తి చెందకుండా చేస్తాయి. దీనికై మీరు చేయవలసినదల్లా,ప్రభావిత ప్రాంతాల్లో తేనెను రాసుకుని, పావుగంటసేపు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకు రెండు -మూడుసార్లు చేయండి.

6. పసుపు

6. పసుపు

మన వంటగదులలో ఎప్పుడూ లభించే పదార్ధం పసుపు. దాని సామర్థ్యాన్ని సాధారణంగా అందరూ తక్కువగా అంచనా వేస్తారు. మీరు శరీరం లోపల నుండి మరియు బయట నుండి శుద్ధిచేయాలని కోరుకున్నప్పుడు, పసుపు మంచి ఎంపిక. దీనిలో ఉండే కుర్కుమిన్ మొటిమల వలన కలిగే నొప్పి మరియు మంటను తగ్గించి, మొటిమలను కలుగజేసే హానికారక బాక్టీరియాతో పోరాడుతుంది. మీ శరీరాన్ని లోపల నుండి శుద్ధి చేసుకోదలచితే, పసుపు కలిపిన పాలను తాగండి. మొటిమల నివారణకు రెండు టీ స్పూన్ల పసుపును, నువ్వులనూనెతో కలిపి ముద్దగా చేసి, ప్రభావిత ప్రాంతాల్లో రాసుకోండి. గంటసేపు ఆరనిచ్చి కడిగేయండి.

7. గుడ్డు తెల్ల సోన

7. గుడ్డు తెల్ల సోన

గుడ్డు తెల్ల సోనలో ప్రోటీన్లు మెండుగా ఉంటాయని ప్రతి ఒక్కరికీ తెలిసినదే! కానీ మీకు తెలుసా ఈ ప్రోటీన్లు, మొటిమలు మిగిల్చిన మచ్చలను సమర్ధవంతంగా పోగొడతాయని? మీ చర్మం మచ్చలను పోగొట్టడానికి, కొత్త కణజాలాన్ని ఏర్పరచుకోవాలంటే ప్రోటీన్లు చాలా అవసరం. గుడ్డు తెల్ల సోనను గిలాక్కొట్టకుండా, సహజ రూపంలో నేరుగా చర్మానికి రాసుకుని, ఆరినాక నీటితో కడుక్కోవాలి.

8. పెరుగు

8. పెరుగు

పెరుగులో లాక్టిక్ ఆమ్లం మరియు ఇతర సహజ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ రంగును తేలిక పరచి, చర్మాన్ని మెరుగుపరిచి మొటిమల నివారణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కొంచెం పెరుగును ప్రభావిత ప్రాంతంలో రాసుకుని, పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి, నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి ఒకసారి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

English summary

8 Simple Home Remedies For Back Acne That Actually Work

Back acne can be very painful and difficult to manage. But it can be easily tackled with some really amazing home remedies. Aloe Vera gel not just kills the acne-causing bacteria; it also heals damaged skin and reduces acne scarring. You can also try lemon, tomato, egg whites or turmeric for getting rid of back acne.
Story first published: Thursday, July 5, 2018, 13:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more