For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చర్మంపై ఏర్పడిన దద్దుర్లను నివారించగల ఇంటి చిట్కాలు !

|

మీ శరీరంపై దద్దుర్లు కొన్ని కారణాల వల్ల ఏర్పడతాయి. కానీ, ఇది మీ చర్మ అనారోగ్యాన్ని సూచించే ఒక ముఖ్యమైన సంకేతం. మీ చర్మం ఎరుపు రంగులోకి మారటానికి జన్యుపరమైన, రసాయనాల ప్రభావం వల్ల, అలర్జీలు, సన్-బర్న్ వంటి ప్రతిచర్యలు కారణం కాగలవు. చర్మంపై ఏర్పడిన దద్దుర్ల తీవ్ర పరిణామాల ఆధారంగా దురద, నొప్పి, మంట, బాధ వంటివి ఏర్పడవచ్చు.

అయితే, రసాయన ప్రేరేపిత చర్యలను నివారించడానికి ఇంటి చిట్కాలను ఉపయోగించడమే చాలా ఉత్తమము. మీ ఇంట్లోనే సాధారణ నివారణ చర్యలను కలిగి ఉన్నప్పుడు వేరే వాటి కోసం ఎందుకు వెళ్ళటం, అవునా ?

కాబట్టి, మీ చర్మంపై ఏర్పడే దద్దుర్లను నివారించేందుకు అనుసరించవలసిన ఇంటి చిట్కాల గురించి పూర్తిగా ఇక్కడ మీకు వివరించాము.

1. గ్రీన్-టీ :

1. గ్రీన్-టీ :

ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మీ చర్మాన్ని పునరుత్తేజితం చేయటంలో సహాయపడుతుంది.

ఆచరించవలసిన విధానం :

1. దీని తయారీ విధానం చాలా సులభం. తయారుచేసిన గ్రీన్-టీను ఫ్రిజ్లో పెట్టి చల్లగా అయ్యేలా చూడాలి.

2. అలా చల్లగా మారిన గ్రీన్-టీలో దూది పింజను ముంచి, ప్రభావితం కాబడిన చర్మంపై నేరుగా అప్లై చేయాలి.

ఈ విధంగా రోజుకి 3 సార్లు చేయడం వల్ల మీరు మెరుగైన ఫలితాలను పొందగలరు.

2. కొబ్బరినూనె :

2. కొబ్బరినూనె :

మీ చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ను అందించడంలో కొబ్బరినూనె చాలా గొప్పగా పనిచేస్తుంది. మీ చర్మాన్ని హైడ్రేట్గా ఉంచడం ద్వారా, చర్మంపై దద్దుర్లు ప్రభావాన్ని తగ్గిస్తుంది.

ఆచరించవలసిన విధానం :

1. మీ శరీరాన్ని పూర్తిగా కరిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొబ్బరినూనెను తీసుకొని, అందులో దూదిపింజను ముంచి, దానిని మీ శరీరమంతటా అప్లై చేయాలి.

2. ఈ విధంగా మీ శరీరం మీద నెమ్మదిగా మసాజ్ చేయాలి, అలా 30 నిమిషాలు దాటిన తర్వాత మంచినీటితో మీ చర్మాన్ని శుభ్రంగా కడగాలి.

రోజుకి రెండుసార్లు చెప్పున, ఒక్క నెలరోజులు ఈ పద్ధతిని పూర్తిగా అనుసరించడంవల్ల మీరు కోరుకున్న ఫలితాలను పొందగలరు.

3. ఓట్మీల్ :

3. ఓట్మీల్ :

ఇందులో ఉన్న యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కారణంగా మీ చర్మంపై ఏర్పడిన దురదలు, మంటల నుంచి మీకు సత్వరమే ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ రోజుల్లో అన్ని షాపుల్లోనూ ఓట్మీల్ చాలా సులభంగా దొరుకుతుంది.

ఆచరించవలసిన విధానం :

1. అరకప్పు ఓట్మీల్ను తీసుకొని, దాన్ని గ్రైండర్లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.

2. అలా సేకరించిన పొడికి, పావుకప్పు నీటిని జత చేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.

3. ఈ పేస్టును ప్రభావితమైన చర్మ ప్రాంతాల్లో అప్లై చేసి 20 నిమిషాల వరకు బాగా ఆరేలా వేచి ఉండాలి.

4. ఆ తర్వాత చల్లని నీటితో మీ చర్మాన్ని శుభ్రపరుచుకుని, శుభ్రమైన టవల్తో మీ చర్మాన్ని పొడిగా చేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయటంవల్ల దద్దుర్ల నివారణ సాధ్యం కాగలదు.

4. అలోవెరా :

4. అలోవెరా :

వీటిలో ఉన్న శోథ నిరోధక లక్షణాలు, మీ చర్మంపై ఏర్పడిన వాపులను, మంటలను తగ్గిస్తుంది.

ఆచరించవలసిన విధానం :

1. వేడి నీటితో మీ శరీరాన్ని శుభ్ర పరుచుకోవాలి.

2. అలోవెరా మొక్క నుంచి తాజాగా సేకరించిన గుజ్జును ఒక కప్పు మోతాదులో సేకరించుకోవాలి.

3. ప్రభావిత చర్మ ప్రాంతంలో ఈ గుజ్జును అప్లై చేసి, పొడిగా మారేంత వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత మీ శరీరాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. మరింత వేగవంతమైన ఫలితాలను పొందడం కోసం రోజులో ఈ పద్ధతిని అనేకసార్లు పునరావృతం చేయాలి.

5. కీరదోసకాయ మాస్క్ :

5. కీరదోసకాయ మాస్క్ :

కీరదోసలో ఉన్న హైడ్రేటింగ్ లక్షణాలు మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఈ విధంగా చర్మం పొడిబారకుండా, దురదలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆచరించవలసిన విధానం :

1. ఇందుకోసం మీకు తాజా కీరదోసకాయ కావాలి. కీరదోస పై ఉన్న తొక్కను తొలగించి, అడ్డంగా ముక్కలు చేసుకోవాలి.

2. ఇలా కోసుకున్న ముక్కలను శరీరంపై మాస్క్ లా అప్లై చేసుకోవాలి.

3. ఆ ముక్కలు 30 నిమిషాల తర్వాత పొడిగా మారుతుంది. ఆ తర్వాత మీ శరీరాన్ని శుభ్రపరుచుకోవాలి.

నెలలో ప్రతిరోజు ఇలా చేయడం వల్ల, మీరు పెద్ద మొత్తంలో వచ్చే తేడాను గమనించగలరు.

6. పెట్రోలియం జెల్లీ :

6. పెట్రోలియం జెల్లీ :

మీరు ఎదుర్కొనే అనేక చర్మ సమస్యల పరిష్కారం కోసం పెట్రోలియం జెల్లీని ఉపయోగించడం వల్ల, ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని ఎండిపోనివ్వకుండా చేసి, దద్దుర్లను రానివ్వకుండా చేస్తుంది. అయితే, మీరు మొటిమలను కలిగి ఉన్నట్లయితే, దీనిని మీరు వాడకూడదు.

ఆచరించవలసిన విధానం :

1. చల్లని నీటితో మీ శరీరాన్ని శుభ్రం చేసుకుని, శుభ్రమైన టవల్తో మీ శరీరాన్ని పొడిగా మార్చుకోండి.

2. రాత్రి పడుకునేముందు, సమస్యాత్మకమైన చర్మ ప్రాంతాల్లో పెట్రోలియం జెల్లీని అప్లై చేసి, మరుసటి రోజు ఉదయం మీ శరీరాన్ని నీటితో శుభ్రంగా కడగండి.

మీరు నెలరోజులపాటు ఈ పద్ధతిని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు.

English summary

Home Remedies To Treat Rashes On The Skin

Rashes on the body can be due to several reasons. Some common reasons for redness of the skin include reactions to chemicals, allergies, sunburn and even genetics. In order to avoid further reactions to chemicals, it is best to treat it using home remedies. Some of them include cucumber, oatmeal, petroleum jelly, etc.
Story first published: Friday, June 8, 2018, 12:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more