For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కాంతివంతమైన చర్మాన్ని పొందేందుకు హోంమేడ్ బీట్ రూట్ మరియు యోగర్ట్ ఫేస్ మాస్క్

  |

  బీట్ రూట్ అనేది ఆరోగ్యానికి మంచిది. ఇందులో లభించే పోషక విలువల వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాక, దీనిని ఫేస్ మాస్క్ గా అప్లై చేసుకోవడం వలన చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. సహజంగానే కాంతివంతంగా మారుతుంది.

  అనేక శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, పచ్చి బీట్ రూట్స్ అనేవి డిమెన్షియాను అరికట్టేందుకు తోడ్పడతాయి. అలాగే, పచ్చి బీట్ రూట్స్ హైపర్ టెన్షన్ ను అలాగే గుండె వ్యాధులను అరికట్టడానికి తోడ్పడతాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేసేందుకు సహాయపడతాయి.

  పచ్చి బీట్ రూట్స్ అనేవి ఎక్సర్సైజ్ సప్లిమెంట్ గా ఉపయోగపడతాయి. మజిల్ ఆక్సీజనేషన్ ను ప్రేరేపిస్తాయి. అలాగే, హై ఇంటెన్సిటీ ఎక్సరైజ్ లను తట్టుకునే సామర్థ్యం పచ్చి బీట్ రూట్ ని తీసుకోవడం ద్వారా అందుతుంది.

  అనేక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఈ బీట్ రూట్స్ లో లభ్యమవుతాయి. ఇందులో యాంటీ ఇంఫ్లమేటరీ తో పాటు ఫంగైసైడల్ క్వాలిటీస్ కలవు. గౌట్ మరియు గాల్ బ్లాడర్ సమస్యలకు చికిత్సగా బీట్ రూట్ ను సూచిస్తారు. బీట్ రూట్స్ లో హోమోసిస్టైన్ అనే పదార్థం కలదు. ఇది ఉదర ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

  Homemade Beetroot & Yogurt Face Mask For Glowing Skin

  కొన్ని యుగాల నుంచి బీట్ రూట్ ని చర్మ మరియు కేశ సంరక్షణ కోసం వినియోగించడం జరుగుతోంది. ఫేస్ ప్యాక్ రూపంలో బీట్ రూట్ ను ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలలో బీట్ రూట్ వలన చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి కాస్తంత అవగాహన ఉంది. హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ లోని ముఖ్యమైన పదార్థంగా ఇది ప్రసిద్ధి చెందింది. వివిధ సంప్రదాయాలకు చెందిన ప్రజలు చర్మ సౌందర్యాన్ని పొందటం కోసం బీట్ రూట్ ను విస్తృతంగా వాడటం జరుగుతోంది.

  డార్క్ స్కిన్ టోన్ కలిగిన వారి కంటే ఫెయిర్ కాంప్లెక్షన్ కలిగిన వారు బీట్ రూట్ ని ఫేస్ ప్యాక్ గా వాడటం వలన ఫలితాలను వేగవంతంగా గమనించగలుగుతారు. అయితే, ఈ వెజిటబుల్ ను చర్మ సంరక్షణకై కొంతకాలం పాటు వాడితే స్కిన్ టోన్ ఏదైనా కూడా అద్భుతమైన ఫలితాలను గుర్తించే అవకాశం ఉంది.

  బీట్ రూట్స్ ని అప్లై చేసుకుంటే పోర్స్ సైజ్ తగ్గుతుంది. డార్క్ స్పాట్స్ తొలగిపోతాయి. బీట్ రూట్ ని ఫేస్ మాస్క్ ప్రిపరేషన్ లో ఏ విధంగా వాడలో తద్వారా కాంతివంతమైన చర్మాన్ని లోలోపల నుంచి సహజంగా ఎలా పొందవచ్చో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

  బీట్ రూట్ అనేది చర్మానికి ఏ విధంగా ప్రయోజనకారిగా ఉంటుంది?

  బీట్ రూట్ అనేది చర్మానికి ఏ విధంగా ప్రయోజనకారిగా ఉంటుంది?

  బీట్ రూట్ అనేది శతాబ్దాల నుంచి అనేక స్కిన్ బెనిఫిట్స్ ను అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. బ్లేమిషెస్ ను లైటెన్ చేయడం దగ్గర నుంచి పోర్స్ సైజ్ ను తగ్గించడం వరకు చర్మ సంరక్షణలో బీట్ రూట్ పాత్ర అనిర్వచనీయం. సహజమైన కాంతిని చర్మానికి అందించడంలో బీట్ రూట్ తోడ్పడుతుంది.

  బీట్ రూట్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చర్మం యొక్క కొలాజిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. తద్వారా చర్మం యొక్క ఎలాస్టిసిటీ మెరుగవుతుంది. చర్మం మృదువుగా అలాగే కోమలంగా మారుతుంది.

  అలాగే బీట్ రూట్ లో లభించే యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ కు దారితీసే బాక్టీరియాను నశింపచేస్తాయి. బీట్ రూట్ లో ఉండే ఈ సామర్థ్యం వలన డల్ స్కిన్ సమస్య తొలగిపోతుంది.

  బీట్ రూట్ లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. విటమిన్ సి ఇందులో లభించడం వలన స్కిన్ పిగ్మెంటేషన్ అనేది తగ్గుముఖం పడుతుంది. డెడ్ స్కిన్ సెల్స్ అనేవి తొలగిపోయి చర్మం సహజంగానే లోలోపల నుంచి కాంతిని సంతరించుకుని స్వచ్ఛంగా మారుతుంది.

  డార్క్ సర్కిల్స్ మరియు పఫీ ఐస్ తో పోరాడుతుంది:

  డార్క్ సర్కిల్స్ మరియు పఫీ ఐస్ తో పోరాడుతుంది:

  ఈ రోజుల్లోనే ఫాస్ట్ పేస్డ్ లైఫ్ వలన డార్క్ సర్కిల్స్ సమస్య సర్వసాధారణంగా మారింది. బీట్ రూట్ ను ఫేస్ ప్యాక్ గా కంటి చుట్టూ వాడటం వలన సూతింగ్ ఎఫెక్ట్ లభిస్తుంది. బీట్ రూట్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్ ఫీచర్ అనేది చర్మాన్ని ఉత్తేజపరుస్తుంది. స్ట్రెస్ ని తగ్గిస్తుంది. కళ్ళ చుట్టూ బీట్ రూట్ జ్యూస్ ను అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ సమస్య తొలగిపోతుంది. అలాగే చికాకు పరిచే ఐ బ్యాగ్స్ నుంచి కూడా రక్షణ లభిస్తుంది.

  తయారుచేసే విధానం:

  తయారుచేసే విధానం:

  • బీట్ రూట్స్ ను ముందుగా గ్రేట్ చేయండి. ఆ తరువాత, అందులోంచి జ్యూస్ ను సేకరించండి. ఈ జ్యూస్ ను ఒక బౌల్ లోకి తీసుకోండి.

  • ఈ బీట్ రూట్ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని జోడించండి. అలాగే, పెరుగుతో పాటు నిమ్మరసాన్ని కూడా జోడించండి.

  • ఈ పదార్థాలని బాగా కలిపి స్మూత్ పేస్ట్ ను తయారుచేసుకోండి.

  • ఈ పేస్ ప్యాక్ ను ఫేస్ పై ఈవెన్ గా అప్లై చేయండి. పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచండి. అప్లికేటర్ బ్రష్ తో గాని లేదా ఫింగర్స్ తో గాని ఈ ఫేస్ ప్యాక్ ను అప్లై చేసుకోండి.

  • ఈ ఫేస్ ఫ్యాక్ ని ఆరిన తరువాత తొలగించుకోవచ్చు. గోరువెచ్చటి నీటితో ఈ ఫేస్ ప్యాక్ ను తొలగించుకోండి.

  • ఇప్పుడు ముఖంపై తడిని తుడుచుకోండి.

  • ఇప్పుడు ముఖంపై తడిని తుడుచుకోండి.

  ఈ బీట్ రూట్ స్పెషల్ ఫేస్ ప్యాక్ ను అప్లై చేయడం వలన కలిగే ఫలితాలు ఈ ఫేస్ ప్యాక్ ను తొలగించగానే మీకు కనిపిస్తాయి. చర్మంపై వెంటనే పింకిష్ గ్లో ను మీరు గమనించగల్గుతారు. చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది.

  వెన్న వంటి మృదువైన చర్మాన్ని పొందేందుకు బీట్ రూట్ తోడ్పడుతుంది. ఎటువంటి జిడ్డును చర్మానికి అంటించదు.

  బీట్ రూట్ లో కెరోటెనాయిడ్స్ తో పాటు ఐరన్ లభిస్తుంది. ఈ పోషకాలు చర్మంలోపలికి ఇంకిపోతాయి. చర్మానికి సంరక్షణని అందిస్తాయి.

  ఈ మ్యాజిక్ వెజిటబుల్ ను ఫేస్ ప్యాక్ రూపంలో తరచూ వాడుతూ ఉంటే మీ చర్మం పొడిబారే సమస్య నుంచి విముక్తి పొందుతుంది. ప్యాచెస్ సమస్య కూడా వేధించదు. అలాగే ముడతల వంటి ఏజింగ్ సైన్స్ నుంచి కూడా బీట్ రూట్ ద్వారా విముక్తి పొందవచ్చు.

  ఈ పేస్ ప్యాక్ ను మీరెప్పుడు వాడాలనుకుంటే అప్పుడు వాడవచ్చు. రోజువారీ కూడా ఈ ఫేస్ ప్యాక్ ను వాడవచ్చు. మీరెంతగానో కోరుకుంటున్న మచ్చలేని చర్మాన్ని పొందేందుకు ఈ ఫేస్ ప్యాక్ అమితంగా తోడ్పడుతుంది.

  బీట్ రూట్ ద్వారా అందే ఈ అద్భుత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ వెజిటబుల్ ను డైలీ స్కిన్ కేర్ లో భాగంగా చేసుకుంటే మీరు అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

  English summary

  Homemade Beetroot & Yogurt Face Mask For Glowing Skin

  Beetroots are a storehouse of powerful antioxidants and also show anti-inflammatory and fungicidal qualities. Being one of the popular ingredients for a homemade face mask, beetroots have been widely used across all cultures to achieve a beautiful skin. Beetroots when applied to the face have the capability of reducing pores and dark spots.
  Story first published: Thursday, June 21, 2018, 17:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more